అమరావతిలో ప్రపంచస్థాయి నిర్లక్ష్యం

అమరావతిలోప్రపంచస్థా యి రాజధాని కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూనే వున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మాట అటుంచి ఆధునిక కాలపు కనీస ప్రమాణాలైనా పాటించడం లేదంటే కారకులెవరు? రాష్ట్ర పాలనా కేంద్రం కాబోతున్న భవనంలతోనే వరుస ప్రమాదాలు దుర్ఘటనలు జరిగే పరిస్థితి ఎందుకు దాపురిస్తున్నది?వీటిపై వివరాలు వెల్లడించరు. మీడియాను అనుమతించరు. నిరసనలు సాగనివ్వరు. అనుకూల మీడియాలో ఏ వివరాలు రావు. అంతా గప్చిప్. హుష్ అప్. గతంలో జరిగిన ప్రమాదాలు రెండు ప్రాణాలు తీసుకుంటే ఇప్పుడు పిట్ట గోడ కూలిపోయింది. షాపూర్జిపల్లోంజి సంస్థలో పనివారైన రామ్చంద్, ధర్మేంద్ర, కిరణ్ చౌదరి, జయరామ్లకు తీవ్ర గాయాలు తగిలాయి. మరొకరు గాయపడ్డారు.పైనుంచి గోడ కూలి పడటంతో రామ్చంద్కు వెన్నెముక విరగ్గా, ధర్మేంద్రకు తలకు ఛాతికి తీవ్రగాయాలైనాయి. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యుల తొలి సమాచారంగా వుంది. పనిచేస్తున్నవారిలో అత్యధికులు జార్ఖండ్నుంచి వచ్చిన వారు. వారి జీతభత్యాలు కూడా చాలా తక్కువ.పనివొత్తిడి బాగా ఎక్కువ. స్థానికంగా వారిని కలవనివ్వరు.బయిటకు చెప్పిన వారిపై కక్షసాధింపులు. హక్కులు భద్రత నాస్తి.అందరి హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వసచివాలయని ర్మాణంలోనే ఈ పరిస్థితి నిజంగా ఆందోళనకరం. అప్రజాస్వామికం. గతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బయిటకు రాని రాని ఘటనలు కూడా వున్నాయి. అధికార కట్టడాలలోనే గాక ఇతర వాణిజ్య నిర్మాణాలలోనూ దుర్ఘటనలను పోలీసులు కప్పిపుచ్చుతున్న ఉదంతాలున్నాయి. నాకు తెలిసిన మీడియా మిత్రులే అలాటి తతంగాలకు సాక్షులుగావున్నారు. ఈ ప్రమాదాలకు ఏవో సాంకేతిక కారణాలు సాకులు చెప్పొచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. కాని అసలు ఇలాటి దుస్థితి ఎందుకు వస్తున్నది? ఈ అపశ్రుతులన్నిటి వెనక అలక్ష్యం అవినీతి అసమర్థత లేదని భావించడం సాద్యమేనా? పోనీ హడావుడి వల్ల ఇలా జరుగుతుందనుకుంటే కాస్త నెమ్మదించవచ్చు. కడుతున్నదెవరు?కట్టిస్తున్నదెవరు?పర్యవేక్షిస్తున్నదెవరు?వైఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రో నిర్మాణ సందర్భంలో ఒక ప్రమాదం జరిగితే అప్పుడు ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలూ తీవ్రంగా విమర్శించలేదా? అలాటిదిరేపటి రాజధానిలోనూ కొనసాగుతుందంటున్న అతి ముఖ్యమైన భవనం అదికూడా కావలసిన సమయం తీసుకుని విడిగా కడుతున్న పరిస్థితుల్లో ఎందుకిలా పదే పదే ప్రమాదాలు మరణాలు గాయాలు సంభవిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు చెప్పకపోవడం బాధ్యతా రాహిత్యం. ఇప్పటికైనా నిర్మాణంలోనూ కార్మికుల పరిస్థితుల్లోనూ భద్రత పెంచడం అవసరం. పైపై ఖండనలతో సరిపెడితే రేపు మరింత ముప్పు కలగొచ్చు.