మథుర మారణకాండలో భారతీయుడు మోడల్?

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో జరిగిన మారణహౌమం ఒక పోలీసు సూపరెండెంటుతో సహా 24 మంది ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన దేశాన్నే ఉడికిస్తోంది. అయితే దీనికి కారణమైన సాయుధదళ నాయకుడు సామాన్య గ్రామీణ పెత్తందారులా వుంటాడన్న సమాచారం మరింత ఆసక్తి కలిగిస్తున్నది. రామకృష్ణయాదవ్ అనే ఆ పెద్ద మనిషి చుట్టూ ఎప్పుడూ తుపాకులు కత్తులు ధరించిన సాయుధులు సంచరిస్తుంటారు. వీరు తమ సంస్థకు పెట్టుకున్న పేరు మాత్రం ఆజాద్ భారత్ విధిక్ విచారిక్ క్రాంతి సత్యాగ్రహి. రెండేళ్లుగా వీరు 280 ఎకరాల ఒక పార్కును ఆక్రమించి భైఠాయింపు కొనసాగిస్తున్నారట. ఒక పిల్ విచారణలో భాగంగా హైకోర్టు వారిని ఖాళీ చేయించాలని ఆదేశించడంతో పోలీసులు వెళ్లారు. అంతే. హఠాత్తుగా జరిగిన కాల్పుల వర్షంలో పోలీసులసు నేలకొరిగారు. రామకృష్ణయాదవ్ ఆ కల్లోలంలో తప్పించుకుపోయాడు. అక్కడ భారీగా ఆయుధాలు మందుగుండు దొరికాయి. ఈ స్థాయిలో వారు సిద్ధమై వుంటారని దాడి చేస్తారని తాము వూహించలేదని యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంగీకరించారు. ఇంతకూ ఈ దొమ్మీకి ఆధ్వర్యం వహించిన వారు తాము నేతాజీ అనుయాయులమని చెప్పుకుంటున్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను రద్దు చేయాలనీ, ప్రధాని రాష్ట్రపతి పదవులే గాక ప్రస్తుత కరెన్సీని కూడా రద్దు చేసి భారతీయ సిక్కాలను ప్రవేశపెట్టాలని వారి డిమాండ్లు. వీరంతా మొదట బాబా జై గురుదేవ్ అనే స్వామి అనుయాయులుగా వుండేవారు. కాని స్వామీజీ తర్వాత వారితో తెగతెంపులు చేసుకున్నారు. ఆయన 2012లో మరణించారు. గజియాబాద్ జిల్లాలోని రామ్‌పూర్ భాగ్పురా నివాసి అయిన యాదవ్ పోటీ ఎన్నికల్లో కూడా చేసి ఓడిపాయరు.చాలా ముతగ్గా బతుకుతుంటాడు గాని సాయుధుల పహారా వుంటుంది. మొత్తంపైన ఇ
దంతా చూస్తుంటే కమల్‌హాసన్ భారతీయుడు సినిమా గుర్తుకు వస్తుందా? తాము విప్లవకారులమని చెప్పుకుంటారు గాని వీరికి అంత ఆశయాలు వున్నాయో లేదో తెలియదు. అనేక రకాలైన సాయుధ ముఠాలను బందిపోట్లను చూసిన యుపిలో ఇది పెద్ద సంచలనంకాదు గాని ఇటీవలి కాలంలో ఇంత భారీగా పోలీసులు మరణించడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. మరణించిన ఎస్పి ద్వివేదీ కుటుంబానికి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించగా అతని తల్లి కావాలంటే మేమే 20 లక్షలు ఇస్తాం నా కొడుకును తీసుకొచ్చి ఇమ్మని అడగడం అందరినీ కదిలించింది. నేతాజీ పేరును తీసుకున్న ఈ సంస్థకు ఇంకా ఇలాటి మరికొన్నిటితో సంబంధాలున్నాయంటున్నారు. దీనికి వెబ్సైట్లు ఫేస్‌బుక్‌లు కూడా వున్నాయి. మరి యుపిలో ఎన్నికలకు ముందు కల్లోలం పెరిగేందుకు ఇదో సంకేతం అవుతుందేమో తెలియదు. అన్నాహజారే వలె దీనిచుట్టూ కొంత కథ నడుస్తుందేమో కూడాచూడాలి.
స్వప్నంలోనే సుందరి
ఇంత జరుగుతున్నా ఈ నియోజకవర్గ ఎంపి హేమమాలిని మాత్రం తన సినిమా షఉటింగు ఫోటోలను ఫేస్బుక్లో పెట్టి అభాసుపాలైనారు. విమర్శలు ముంచుకొచ్చాక వాటిని తొలగించడమే గాక తను మథుర నుంచేవచ్చినట్టు మరో ట్వీట్ పెట్టారు. బిజెపి కూడా ఆమెను సర్దుబాటు చేయడానికి తంటాలు పడింది. జరిగిన ఘటనపై న్యాయవిచారణ జరపాలని కోరింది.