రాజ్యసభ ఎంపిక- ఆరోపణలు ఆగ్రహాలు

tdp rs
తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులుగా ఇద్దరూ సంపన్నులను ఎంపిక చేశారని విమర్శలు వస్తున్నాయి.ఆఖరు వరకూ టికెట్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి జెఆర్‌ పుష్పరాజ్‌ చంద్రబాబు నాయకత్వంపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. ఇది ఒకప్పటి ఎన్టీఆర్‌ నాటి తెలుగుదేశం కాదనీ, ఇక్కడ ధనవంతులదే చలామణి అని విమర్శించారు. గతంలో సుజనాచౌదరికి టికెట్‌ ఇచ్చినప్పుడు పార్టీ సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తనకు సన్నిహితులైన మీడియా వారితో సుజనా చౌదరిని గట్టిగా సమర్థిస్తూ ఈ విమర్శకులపై విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా ఆర్థిక వనరుల విషయంలో అండగా వుండేవారిని ఆయన వదులుకోరని అందరికీ తెలుసు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా ‘చౌదరి వర్కవుట్‌ చెయి’ అంటుంటారని ఒక సీనియర్‌ నాయకుడే చెప్పారు. నిజానికి సుజనా చౌదరి ఎంపికకు సంబంధించి ఎప్పుడూ సందేహాలు లేవు. . వ్యాపారవేత్తగా తీసుకున్న రుణాలు కట్టడంలో ఆలస్యమై వుండొచ్చుగాని తానెప్పుడూ ఎగవేతదారుణ్ని కాదని, వన్‌టైం సెటిల్‌మెంట్లు కోరలేదని సుజనా అంటుంటారు. మిశ్రమ ప్రభుత్వంలో ఆయనను తప్పించి మరొకరిని పంపించడంలోనూ సమస్యలున్నాయనేది ఒకటైతే చంద్రబాబు ఆయనపై చాలా ఆధారపడటం అందరికీ తెలిసిన విషయం.
ఇక్కడ సుజనా చౌదరి గురించి చర్చ నడుస్తున్నది గాని నిజానికి కాంగ్రెస్‌ TDP-Candidates-Files-Nomina-320x180నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రి టిజివెంకటేశ్‌ ఆరోపణలకు గురైన వారేనన్నది అంతగా ముందుకు రాలేదు. అతీతులు కారు. ఆయనకు అవకాశం రావచ్చని కర్నూలులో దానిపై మీడియా కథనాలు వదులుతూనే వుంది. కొద్దిరోజుల కిందట కర్నూలు వెళ్లినప్పుడు అవన్నీ చూశాను. తే నాలుగో సీటుకు తనను ఎంపిక చేస్తే వైసీపీ ఓట్లు రాబట్టుకోగలనని టీజీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మొదట్లో చెప్పారు. అది వ్యూహాత్మకమే అయివుండొచ్చు. .ఇప్పుడు నేరుగా రెండవ సీటు కేటాయించడంతో అనిశ్చితి అసలే తొలిగిపోయింది. రాయలసీమ, సామాజిక ప్రాతినిధ్యం వంటి మాటలు చెప్పినా ఆర్థిక బలమే ఆయనకు ప్రాతిపదిక. ఇక ఆరోపణలకు వస్తే – రాయలసీమ పేపర్‌ మిల్లు ఖాయిలా పడితే దానిపేర వనరులు తెచ్చి రాయలసీమ ఆల్కలీస్‌ పెంచుకున్నారనేది ఆయనపై కార్మిక సంఘాల తీవ్ర ఆరోపణ. ఇండియన్‌ బ్యాంక్‌లోనూ ఇలాటి సమస్యలు రావడంతో డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడం మరో ఉపకథ. అంతేగాక తన కంపెనీ విద్యుత్‌ ప్లాంటు పేరిట పెట్రోలు తీసుకుని తన బంకులో అమ్ముతున్నందుకు భారీ జరిమానా కట్టాల్సి వచ్చిందని తెలుస్తున్నది. ఇలాగే రైతుల పేరిట యూరియా తెప్పించి ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నారనే మరో ఆరోపణ కూడా తీవ్రమైందే. దాన ధర్మాలు విరాళాలు నిర్మాణాలు చేసే వ్యక్తిగా కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఆయన పేరు కనిపిస్తుంటుంది గాని దీనంతటి వెనక చాలా వ్యవహారాలు నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల విమర్శ. జగన్‌ తిరుగుబాటు సమయంలో రోశయ్యతో గట్టిగానిలబడిన టిజి మంత్రిగా డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు కూడా పదవి ఇవ్వకపోతే రాయలసీమ ఆందోళన తీసుకొస్తారు గనకే తప్పనిసరైందని నాయకత్వం అంటున్నది.
బిజెపి తరపున సురేష్‌ ప్రభుకు బిజెపి తరపున ఇచ్చారు గనక బహుశా రైల్వే జోన్‌ తెప్పించి కొంత ఓదార్చే ప్రయత్నం జరగొచ్చు. తమ ఒప్పందం ప్రకారం ఇచ్చామని అంటున్నారు గాని మొదట్లో అలాటిది వుందని చంద్రబాబు చెప్పనేలేదు. బిజెపి టిడిపి దాగుడుమూతల్లో ఇదో భాగం మాత్రమే. రైల్వేలను వేగంగా ప్రైవేటుమార్గం పట్టించనున్న సురేష్‌ ప్రభు రాష్ట్రానికి పెద్దగా చేసేదేమీ వుండదు. నాల్గవ సీటులో వైసీపీ ఫిరాయింపుదారులతోనే అభ్యర్థిని నియమింపచేసి అంతా వారిఅంతర్గత తిరుగుబాటుగా చూపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఉత్తరాఖండ్‌ నమూనా అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *