స్త్రీ హింసకు ఇస్ల్తామిక్‌ కౌన్సిల్‌ ఆమోదం

56cfd88db004a women
స్త్రీలను చిన్నచూపు చూడటం.. మతాలన్నిటిలో సర్వసాధారణం. పురుషాధిక్యత పీడన హింస తప్ప ఇందుకు మరో కారణం లేదు. అందుకే స్త్రీ మొదటి బానిస అని ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ అంటారు. ఇస్లామిక్‌ చాందసం రాజ్యం చేసే గల్ప్‌లోనూ పాకిస్తాన్‌ వంటి దేశాల్లోనూ ఇది మరింత ఎక్కువగా సాగుతుంది. అయితే అది ఒక బిల్లు రూపంలో ముందుకు రావడం ఇప్పుడు చెప్పుకోబోయే అమానుషం. పాకిస్తాన్‌ పంజాబ్‌ శాసనసభ గత ఏడాది గృహహింసను అరికట్టేందుకు ఒక చట్టం చేసింది. ఇది ఇస్లామిక్‌ సూత్రాలకు విరుద్ధమంటూ గగ్గోలు బయిలుదేరింది. దాంతో కౌన్సిల్‌ ఆప్‌ ఇస్లామిక్‌ ఐడియాలజీ అనే సంస్థకు సమస్య నివేదించారు. ఈ సంస్థ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగింది. దాని అభిప్రాయాలు సిఫార్సులుగానే పరిగణించబడతాయి. చాలాసార్లు అమలవుతుంటాయి కూడా. గృహహింసను అరికట్టే ఈ చట్టాలు ఇస్లామిక్‌ సూత్రాలకు విరుద్ధమని కౌన్సిల్‌ తీర్మానించింది.మాట వినని భార్యను భర్తలు స్వల్పంగా కొట్టడం నేరం కాదని నిర్దేశించింది. మరీ గట్టిగా మాట్లాడినాl_101680_100820_updates అపరిచితులతో మాట్లాడినా,భర్త అనుమతి లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నా కొద్దిగా కొట్టవచ్చని ఫర్మానా చేసింది. మరింత ఘోరం ఏమంటే పవిత్రమైన నర్సింగ్‌ వృత్తిలో కూడా స్త్రీలు పురుషులను వేరువేరుగా వుంచాలన్నది. పురుష పేషెంట్లకు స్త్రీనర్సులు సేవచేయకూడదని చెప్పింది. వ్యాపార ప్రకటనల్లో స్త్రీలు కనిపించడాన్ని నిషేదించింది. ఈ కౌన్సిల్‌ సిఫార్సులు దారుణంగా వున్నాయని విమర్శలు తీవ్రంగానే వచ్చాయి. చివరకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. ఏది ఏమైనా పాకిస్తాన్‌లో ఈ ఆధునిక కాలంలోనూ స్త్రీలపట్ల ఎంత అమానవీయ దృష్టి ప్రదర్శించడం అందరూ ఖండించవలసిన దారుణం. దీనిపై హక్కుల సంఘాలు మహిళా సంఘాల నిరసన కూడా గట్టిగానే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *