యుపివాలాగా మారిన చాయివాలా!

india-politics-modi-files_e6e83d42-2350-11e6-aecf-2639299c9bfb
నథింగ్‌ ఈజ్‌ రూల్డ్‌ ఔట్‌ ఇన్‌ లవ్‌ అండ్‌ వార్‌ అంటారు.. ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏదైనా చెల్లుతుంది. రాజకీయాలకు ఇది మరింత బాగా వర్తిస్తుందని మరోసారి నిరూపించారు మాన్య ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అఖండ భారత దేశ అధినేత అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్‌ రాగం ఎత్తుకున్నారు. నేను యూపి వాలా అని తనే ప్రకటించుకున్నారు. చాయివాలా అంటూ బయిలుదేరిన మోడీ తర్వాత హిందూత్వ శక్తుల దూకుడుతో గాయివాలా గా మారిపోయారని నేను చాలా సార్లు అన్నాను. అయితే ఆయన ఇప్పుడు మూడో అవతారమెత్తారన్నమాట. రెండు దఫాలుగా జరిగే శాసనసభ ఎన్నికలలో ముఖ్యంగా యుపి మోడీ సర్కారుకు బిజెపి భవిష్యత్తుకు ఎంత కీలకమో మరో పోస్టులో వివరంగా విశ్లేషించాను. ఆ ఆరాటమే దేశ ప్రధానిని యూపీ వాలానా చేసింది. గతంలో బీహార్‌ ఎన్నికల్లో కాలికిబలపం కట్టుకు తిరిగినా ఫలం లేకపోయింది. ఎపికి ఇచ్చిన హామీని గాలికి వదిలేసిన ప్రధాని యూపీవాలాను అని చెప్పుకోవడాన్ని ఏమనగలం! ఎవరి రాజకీయావసరాలు వారివని సరిపెట్టుకోవడమే. గతంలో బిజెపి యుపిలో పాలకపార్టీగా వున్నా తర్వాత ఎస్‌పి బిఎస్‌పిల మధ్యనే అధికారం చక్కర్లు కొడుతున్నది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినా తర్వాత పరిస్థితి అంత అనుకూలంగా లేదు. అక్కడ గెలిస్తే తప్ప కేంద్రంపై ఆశపెట్టుకునే అవకాశం లేదు. అందుకే ప్రధాని యూపీ వాలా అయిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *