ఆనంద్ జోషి అదృశ్యంలో ఆంతర్యిం?

కీలకమైన హౌంశాఖలో అండర్ సెక్రటరీ హౌదాలోని ఆనంద్ జోషి అదృశ్యం,ఆ పైన అరెస్టు వార్త అనేక అనుమానాలు కలిగిస్తున్నది. అనేక కోణాలలో ఆలోచించాల్సి వస్తుంది. హౌంశాఖ అధికారిగా ఈయన అవినీతి పనులకు పాల్పడ్డారని అనేక ఎన్‌జివోలను(స్వచ్చంద సంస్థలను) బెదిరించి డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. నవంబర్ 2015లో ఆ విధంగా 20 ఎన్‌జివోలను బెదిరించారని ఈయనపై ఆరోపణ వుంది. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్‌ను అక్రమాల సంస్థల జాబితా నుంచి తొలగిస్తే తనకు 250 కోట్టు ఇస్తానని ఆశచూపినట్టు ఆయన ఈ నెల 10న హిందూ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఫోర్డ్ ఫౌండేషన్‌ను మొదట ఆ జాబితాలో వుంచి తర్వాత తొలగించారు. గుజరాత్ హత్యాకాండ కేసులలో మోడీ ప్రభుత్వంపై పోరాడిన లౌకిక వాద కార్యకర్థ తీస్తాసెతల్వాద్‌కు చెందిన సబ్‌రంగ్ ట్రస్ట్ ఫోర్డ్ ఫౌండేషన్‌నుంచి విరాళాలు తీసుకుంటున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ఆరోపించి తీవ్రంగా వెంటాడింది. ఆమె సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. అయితే ఈ అవినీతి అధికారి ఆనంద్ జోషి తీస్తా సంస్థకు చెందిన కొన్ని ఫైళ్లు తీసుకుని మాయం చేశారని ఇప్పుడు ప్రభుత్వం అంటున్నది.కాగా తాను మానసిక వేధింపుల కారణంగా అజ్ఞాతంలోకి వెళుతున్నట్టు ఇంట్లో లేఖ రాసి పెట్టి జోషి కొద్ది రోజులు కనిపించకుండా పోయారు. ఆదివారంనాడు బంధువుల ఇంట్లో ఆయనను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తీస్తాసెతల్వాద్ సంస్థలు విదేశాల నుంచి వచ్చే విరాళాలకు లెక్కలు చెప్పడం లేదని ఆరోపించి ఆనేక విధాల ఆరోపణలు చేశారు. మరి ఇన్ని మలుపులతో కూడిన ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో ఉద్దేశాలేమిటో ముందుముందు తేలాలి.నిజానికి హిందూత్వ శిబిరంలోని అనేక సంస్థలకు కూడా భారీగా విదేశీ స్వదేశీ విరాళాలు అందుతాయన్నది బహిరంగ రహస్యమే.కేవలం తమకు వ్యతిరేకమైన వారిపైనే ఈ ప్రభుత్వం గురిపెట్టిందనే ఆరోపణలున్నాయి.