1 శాతం చేతుల్లో 58 శాతం సంపదí జూన్‌వరకూ నోట్ల దెబ్బ!í ప్రాణాలకే భయమన్న ఆర్‌బిఐ!!í
మోడీజీ నోట్ల పోట్లు ఇప్పట్లో తగ్గేలా లేవు. ఆర్థిక వ్యవస్థపై నోట్లరద్దు
ప్రభావం 2017 జూన్ నాటికి సర్దుకుంటుందని స్వయంగా ప్రభుత్వమే వెల్లడించింది.బడ్జెట్ కసరత్తులో భాగంగా చేసిన ఈ వ్యాఖ్య నిజాన్ని అనివార్యంగా ఒప్పుకోవడం తప్ప మరొకటి కాదు. మరోవైపున ఎస్‌బిఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరో యాభై రోజులలో అంతాసర్దుకుంటుందని ప్రకటించారు(అంటే 50+50 అన్నమాట) ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతిని 7.6 శాతం నుంచి తగ్గించి 7.2 శాతంగా చూపింది. ఇదే సమయంలో చైనా ఆర్థిక ప్రగతి కాస్త పెంచి అనుకున్న లక్ష్యాల మేరకు నడుస్తున్నట్టు ఐఎంఎఫ్ చెప్పింది. లక్షల ఉద్యోగాలు దీనివల్ల హాంఫట్ అన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్న పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. నిరుద్యోగం రెండులక్షలు అదనంగా పెరుగుతున్నట్టు ఐఎల్‌వో పేర్కొంది. నోట్లరద్దు తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థలో 1 శాతం మందది 58 శాతం సంపద కలిగివున్నట్టు ఆక్స్‌ఫాం తాజా నివేదిక వెల్లడించింది. అయితే ఆ సంస్థ ఇచ్చిన సంపద లెక్కలు చూస్తే ముఖేష్ అంబానీ, అజిత్ ప్రేమ్‌జీ వంటివారి స్తోమతకు తగినట్టు కనిపించదు. అంటే వాస్తవంలో ఇంకా ఎక్కువ వుంటుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే నోట్లరద్దు నిర్ణయం అమలు పలితాలపై ఆర్‌టిఐ కింద కొన్ని ప్రశ్నలకు సమాచారం ఇచ్చేందుకు ఆర్‌బిఐ నిరాకరించడం ఆశ్చర్యకరం. బ్లూమ్‌బర్గ్ ఆర్థిక సంస్థ కోరిన ప్రకారం నోట్లరద్దుకు ముందు బ్యాంకులలో ఎంత నగదు వుందనే వివరాలు వెల్లడించేందుకు ఆర్‌బిఐ నిరాకరించింది.. అంతేగాక దానివల్ల సిబ్బందికి ప్రాణహాని వుందని పేర్కొంది. ఇది ఆర్‌టిఐ దరఖాస్తుల్లో వుండే భాషే అయినా ఆర్‌బిఐ అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రాణహాని ఎవరినుంచి?మొదట్లో ప్రధాని మోడీయే తన ప్రాణాలు తీయొచ్చని చెప్పడం ప్రజలకు గుర్తుంది.ఇప్పుడు ఆర్‌బిఐ అంటున్నది ప్రభుత్వాన్ని ఉద్దేశించాల లేక నల్లకుబేరులను గురించా? ఇలా చెప్పి మూడు రోజులైనా మీడియాలో విస్త్రతంగా వచ్చినా ఏలిన వారు ఎందుకు నోరు మెదపడటం లేదు?
చివరగా నిక్కీ నీల్గి ఆర్‌బిఐ ఎటిఎంల విత్‌డ్రా మొత్తాన్ని పదివేలకు పెంచింది.అయితే మొత్తం విత్‌డ్రా పరిమితి అలాగే వుంది. ఇంకా సడలింపులు కావాలంటే నిరీక్షించండి మరి. అదే కదా ధేభభక్తి!