వాళ్లను అనడం ముఖ్యం, మమ్మల్ను పొగడ్డం కన్నా..
ఖైదీ150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలపై నేను మొదట కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేశాను. చిరంజీవి పదేళ్ల తర్వాత తీసిన చిత్రమే గాక భూ సమస్యతో ముడిపడింది మొదటిది. చరిత్రకు సంబంధించిన బృహత్తర ప్రయత్నం రెండవది. ఈ కారణాలతో కొంత వివరంగా త్వరితంగా రాశాను. అందులోని కాస్త సానుకూల ధోరణిని సహించలేని ‘అటు’ వైపు అభిమానులు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. తర్వాత నేను ఆ రెండు చిత్రాల్లోని రాజకీయ చారిత్రిక లోపాలను గురించి విడిగా పోస్టులు పెట్టాను.తమాషా ఏమంటే ఈ విమర్శలను మరింత మంది చూసి షేర్ చేసుకున్నారు. అంటే తమ వాళ్లను పొగడ్డం కన్నా కూడా అవతలి వారిని విమర్శించడం ఎక్కువ ఆనందం కలిగిస్తుందన్నమాట.విమర్శనాత్మకంగా వుండవలసిందే గాని ఇలా అవతలివారి మాటంటేనే గిట్టని తనం ఎవరికీ మేలు చేయదు.మరీ ముఖ్యంగా సినిమా వంటి విషయంలో. కాస్తంత సహనం సమభావం సుహృద్భావం వుండాలి మరి. వాణిజ్య పోకడలు మసాలాలంటేనేమో అవి లేనిదో మన సినిమాలు వండవాయె. 150 గనక సందేశాన్ని మించి మసాలా బాగా పెంచారక్కడ. చరిత్ర అంటూనే
తమ ధోరణిలో చెప్పుకొచ్చారిక్కడ. నిజమే గావచ్చుగాని అంతమాత్రాన వాటి వెనక కృషిని వాటిని చూసే వారి ఖుషీని మనం నిరాకరించగలమా అని నా సందేహం.