స్థాయిని పెంచిన శాతకర్ణి

బాలకృష్ణ నూరవ చిత్రంగా క్రిష్‌ దర్శకత్వంలో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగు సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. చరిత్ర పట్ల ప్రత్యేకాసక్తి ప్రతిభ వున్న క్రిష్‌ మొగలే ఆజమ్‌ వంటి చిత్రాలను గుర్తు చేసే తరహాలో అత్యంత భారీగా నేత్ర పర్వంగా ఈ చిత్రం తీశారు. బాలకృష్ణ నటుడుగా తన సత్తా చూపించి శాతకర్ణి పాత్రకు ప్రాణం పోశారు. నూటికి నూరు ఆయనే కేంద్రబిందువుగా నడుస్తుంది. చక్రవర్తిగా యోధుడుగా భర్తగా తండ్రిగా కుమారుడుగా రకరకాల కోణాలలో బాలయ్య మంచి నటన చూపించారు. ఒక గొప్ప చిత్రం చూశామన్న తృప్తితో ప్రేక్షకులు బయిటకు వస్తారు.
శాతవాహన రాజులలో 23వ వాడైన శాతకర్ణి రాజ్యాల మధ్య ఘర్సణలు లేకుండా పోవాలంటే ఒకే రాజ్యం స్థాపించాలని భావిస్తాడు. ఆ మేరకు రాజ్యాలు జయించి సామంతులను చేసుకుంటూనే వారిని గౌరవిస్తూ ఏకం చేస్తాడు. సౌరాష్ట్ర పాలకుడైన సహపాణుడు మాత్రం కుయుక్తులతో క్రూరత్వంతో ప్రవర్తిస్తే హతమారుస్తాడు. ఈ విస్తరణకు ప్రేరణగా నిలిచిన తల్లి గౌతమినీ నిరంతర యుద్ధాలతో రక్తపాతంతో విసిగిపోయిన భార్య వాసిష్టిని కూడా ఎంతగానో గౌరవిస్తుంటాడుఅతని సవాలును ఢకొీనేందుకు కుమారుడు పులమావిని తీసుకవెళ్లేందుకై భార్య వాశిష్టి బాధను కూడా భరిస్తాడు. .ఈ క్రమంలో తనను ప్రశ్నించిన మతాధిపతులకు కూడా తగు సమాధానమిస్తాడు. కుట్రలకు గురైనా కోలుకుని చివరకు యవన రాజు డిమిట్రస్‌ను ఓడించి అఖండ భారతం, సమైక్యత చాటి చెబుతాడు.ఇదీ కథ.
చిత్రంలో ఎక్కువ భాగం యుద్ధాలు పోరాటాలు, కొంత భాగం తల్లికొడుకు కోడలు సన్నివేశాలు నడుస్తాయి. , భార్యగా శ్రియ చాలా బాగా నటించగా తల్లిగా హేమమాలిని హుందాగా వున్నారు. సహపాణుడుగా కబీర్‌ బేడిని తీసుకోవడం బాగుంది. ప్రధానంగా చెప్పుకోవలసిన మరో అంశం
బుర్రా సాయిమాదవ్‌ సంభాషణలు .అర్థవంతంగానూ భావస్పోరకంగానూ వుంటాయి. ఇది తనకో పెద్ద విజయం.ఒక్కచోట కూడా శాతకర్ణి మాటలు అదుపు తప్పకుండా చూశారు. జ్ఞానశేఖర్‌ ఫోటోగ్రపీ చిత్రానికి ప్రాణం. చిరంతన్‌ భట్‌ నేపథ్య సంగీతం, యుద్ధ సంగీతం, పాటల బ్యాండ్‌ చాలా బాగున్నాయి గాని సీతారామశాస్త్రి పాటలు అంత గుర్తుండేలాఈ చిత్రానికి తగుస్థాయిలో లేకపోవడం ఒక లోపం.
చిరంజీవి పునరాగమన చిత్రం ఖైదీ150 మాస్‌ ప్రధానంగా తయారైతే శాతకర్ణి గంభీర చరిత్రగా రూపుదిద్దుకోవడం విశేషం. బాహుబలితో దీన్ని పోలుస్తారేమోనని క్రిష్‌ చాలా వివరణలు ఇచ్చారు. కాని భారీ సంచలనం సృష్టించిన బాహుబలికి దీటుగానే గాక కొన్ని విషయాల్లో అంతకుమించిన అనుభూతిని ఈ చిత్రం కలిగిస్తుంది. గ్రాఫిక్స్‌కూ వాస్తవ చిత్రణకూ మధ్య తేడా తెలుస్తుంది. ఆ చిత్రానికి మూ12brk49aడున్నరేళ్లు పడితే ఇది 79 రోజుల్లో పూర్తికావడం పట్ల స్వయంగా రాజమౌళి ఆశ్చర్యం వెలిబుచ్చడం ఆసక్తికరం.
క్రిష్‌ చరిత్ర తీసుకున్న తనదైన శైలి అంటూ ఒకటి పాటిస్తారు. లేకపోతే ఈ చిత్రంలోయుద్ధ సన్నివేశాలను కాస్త తగ్గించి చరిత్రనూ పరిణామాలను మరికొంత చెప్పడం, పాత్రల సంబంధాలను చూపించడం చేస్తే ఇంకా బాగుండేది. కొన్ని సహాయ పాత్రలపై మరికొంత శ్రద్ద పెట్టి వుండొచ్చు. చిత్రం హఠాత్తుగా ముగిసిపోతుంది. చరిత్ర విషయాల్లోనూ కొంచెం ఇంచుమించుగా వెళ్టినట్టు అర్ఠమవుతుంది. ఉదాహరణకు తల్లిపేరు పెట్టుకోవడం చాతకశాతకర్ణితో మొదలైంది. బాలశ్రీ తన కుమారుడి జైత్రయాత్రలనూ ఘనతనూ గురించి మహారాష్ట్రలో వేసిన శాసనం ద్వారానే ఫ్రధానంగా శాతకర్ణి గురించి తెలుస్తున్నది. కాని ఆ ప్రస్తావన లేదు. ఇలాటి ఇంకొన్ని చరిత్ర విషయాలు మరోసారి చెప్పుకుందాం. అమరావతి తెలుగుజాతి ఔన్నత్యం గురించిన ప్రస్తావనలు వున్నాయి గాని అదేపనిగా జొప్పించకుండా దేశమే ఒక ఉమ్మడి కుటుంబం అన్న సందేశంతో ఉద్వేగ భరితంగా ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *