అభినవ చక్రవర్తి మోడీ-‘ఫ్రంట్‌లైన్’ కథనం
భారత దేశ సార్వభౌమత్వం అనే మాట మనం రాజ్యాంగపరంగా దేశమంతటికీ వర్తించే విధంగా వాడటం పరిపాటి. కాని ప్రధాని నరేంద్ర మోడీ ఆధునిక సార్వభౌమత్వం అర్థం మార్చేశారా? ఇప్పుడు ఆయన అభినవ చక్రవర్తిగా మారి అఖండ భారతాన్ని కనుసన్నలతో శాసిస్తున్నారా? ప్రముఖ పక్ష పత్రిక ‘ఫ్రంట్‌లైన్'(జనవరి20,2017) ముఖ చిత్ర కథనం అదే’ మోడీ చక్రవర్తి’. ఈ కథనం రాసిన ఆ పత్రిక ప్రధాన ప్రతినిధి వెంకటేశ్ రామకృష్ణన్ అనేక ఉదాహరణలతో ఈ వ్యాఖ్యానం రాశారు. నోట్లరద్దుతో పాటు భారత సైనిక దళాల ప్రధానాధికారి( సివోఎస్-చీప్ ఆఫ్ స్టాప్) నియామకం కూడా ఈ ఏకపక్ష ధోరణికి నిదర్శనంగా వుందని ఆయన విశ్లేషించారు. నోట్లదర్దు సరే, కనీసం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకైనా ముందుగా సమగ్రంగా తెలుసునా అనేది సందేహంగా వుంది. తామంతా టీవీల ద్వారానే తెలుసుకున్నామని కొందరు కేంద్ర మంత్రులు కూడా సన్నిహితుల దగ్గర అంటున్నారట. ఇక సివోఎస్ నియామకంలోనైతే మామూలుగా సీనియర్లతోనూ సంబంధిత శాఖలోనూ చర్చించి నిర్ణయిస్తారు. కాని ముగ్గురు సీనియర్లను కాదని లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆ స్థానంలో నియమించదం కూడా ప్రధాని కార్యాలయం తీసుకున్న నిర్ణయమే. దీనిపై క్యాబినెట్ నియామకాల కమిటీ అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకున్నదని చెప్పడం కూడా వాస్తవం కాదని చాలామంది రక్షణ శాఖ సైన్యం అధికారులు చెబుతున్నారు. అసలు మోడీ వచ్చాక ఏర్పాటు చేసిన ఆ కమిటీలో రక్షణ మంత్రికి స్థానమే లేకుండా పోయింది.
ఇదేగాకుండా విదేశాంగ మంత్రి షుష్వా స్వరాజ్, హౌం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ వంటివారంతా కేవలం ప్రధాని ఆదేశాల కోసం ఎదురు చూస్తూ కూచుంటున్న దుస్థితి. రాజ్‌నాథ్, మరో మంత్రి నితిక్ గడ్కరీ వంటివారు ఏదో విధంగా పరువు కాపాడుకుంటున్నా లోలోపల ఇబ్బండి దిగమింగుతున్నారు. ఈ ఏక వ్యక్తి రాగానికి, వ్యక్తిఆరాధనా పద్ధతికి బిజెపి ఆరెస్సెస్ వ్యవస్థల ఆమోదం కూడా వుంది. అయితే ఆ వ్యవస్థల ప్రతినిధులకు కూడా మోడీ మాట లేకుండా చేశారట.
ఐఎఎస్‌లను కూడా వేధింపులు విచారణలు బదిలీలతో పిఎంవో లొంగదీసుకుంటున్న
ది. ఉదాహరణకు హర్యానా క్యాడర్‌కు చెందిన సంజరు చతుర్వేదికి మంచి అధికారిగా పేరుంది. ఆయన ఎఐఐఎంఎస్‌లో నిఘా విభాగం బాధ్యుడుగా వుంది రాజకీయ నేతల గోత్రాలు అస్పత్రి అధికారుల అక్రమాలు బయిటకు తీశారు. ఆయనను అక్కడనుంచి మార్చాలంటూ సాక్షాత్తూ ప్రధాని కార్యాలయమే లేఖ రాసి మరీ పక్కనపెట్టించింది. తమిళనాడు క్యాడర్‌కు చెందిన అజరు యాదవ్ యుపి ఎస్‌పి నేత శివలాల్ యాదవ్ అల్లుడు కావడంతో నిబంధణలు పాటించకుండానే యుపికి బదిలీ చేశారు. చాలామంది ఐఎఎస్‌లపై నిఘా నడుపుతున్నట్టు ఆఱ్‌టిఐ చట్టం కింద వెల్లడైన వివరాలు చెబుతున్నాయి. వీటి కారణంగా చాలామంది అధికారులు గప్‌చిప్‌గా చెప్పిన మాట వినడానికి సిద్ధమై పోతున్నారు.హెచ్‌సియులో వివాదాస్పద అప్పారావుకు సత్కారాలు చేసిన ప్రభుత్వం అనేక మంది సమర్థులను తమ మాట వినని కారణగా బదిలీలకు చర్యలకు గురి చేసింది.ఆఖరుకు న్యాయవ్వవస్థ కూడా ఈ దాడికి గురవుతున్నది.దీనంగటి వ