‘అగ్ర’ -అసలు పత్రికలో వార్త లేదు!
బెంగుళూరు కమ్మనహళ్లిలో యువతి పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడిన యువకుల అరెస్టుపై ‘అగ్ర’తెలుగు పత్రిక వెబ్‌సైట్ అరకొర కథనం గురించి నిన్న చూశాం. చాలామంది ఆ పత్రిక పేరు చెప్పొచ్చని అంటే మరికొందరు పొరబాటు వూహాగానాలు చేశారు. మీడియాలో సాధారణంగా ఇరత పత్రికల పేర్లు చెప్పకపోవడం ఒక మర్యాద – మరీ తప్పనిసరైతే తప్ప! నేను ఎవరినో తప్పుపట్టడానికి గాక కేవలం తీవ్రమైన లోపాలు ఎలా జరుగుతున్నాయో తెలియడానికే ఆ పరిశీలన రాశాను. వారి ఇమేజ్ కూడా జత చేశాను. అయితే తమాషా ఏమంటే ఆ వెబ్‌సైట్ కథనం యథాతథంగా కొనసాగింది- అసలు పత్రికలో మాత్రం(నేను చూసిన మేరకు) వార్తే ప్రచురణ కాలేదు. మరి కొన్ని ఇతర తెలుగు పత్రికలు ఆ వార్త సరిగానే ఇచ్చాయి. మహిళల భద్రతకు సంబంధించిన ఈ కథనం ఎందుకు ఇవ్వలేదు, వెబ్‌కు భిన్నంగా ఇస్తే ‘చాలా బాగోదు’ అనుకుని మానేశారా తెలియదు. ఇలాటివన్నీ వారు ఖాతరు చేయకపోయినా ఆశ్చర్యం లేదు.