సహారా, బిర్లా డైరీలు, మోడీ పద్దులూ హుష్ కాకి
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నా- దేశ ప్రధానిగా వున్నా నరేంద్ర మోడీపై వచ్చే కేసులు ఆరోపణలూ ఇట్టే ఎగిరిపోతుంటాయి. సచ్చాయి అచ్చాయి అంటూ గంభీరోపన్యాసాలు చేసే మోడీజీ తనపై వచ్చే కేసులను రాజకీయంగా ఎదుర్కొవడానికి బదులు సాంకేతిక సాకులతో తప్పించుకుంటుంటారు. అందుకు వ్యవస్థల లొసుగులను ఉపయోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. నల్లడబ్బు అవినీతిపై యుద్ధం అంటూ నోట్లరద్దు చేసిన ఆయన తనపై వచ్చిన సహారా బిర్లా డైరీల ఆరోపణకు మాత్రం స్పందించలేదు.ఆలస్యంగా అస్మదీయులతో ఖండనలు ఇప్పించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆ ఆరోపణలను ఐటిశాఖ కమిషనే కొట్టివేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్పప్పుడు ఆయనకు 25 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు సహారా అధినేత సబ్రతో బెనర్జీ కార్యాలయ సహాయకుడు రాసిపెట్టిన డైరీని ఇన్‌కం టాక్స్ సెటిల్‌మెంట్స్ కమిషన్(ఐటిఎస్‌సి) కొట్టిపారేసింది. మోడీకి మాత్రమే గాక అసలు సహారా గ్రూపునకే ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది. ఈ డైరీలను విచారించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శాసనసభలో
కోరారు. కాంగ్రెస్‌నాయకుడు రాహుల్‌గాంధీ ఇదే ఆరోపణ చేశారు. ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీ వివరమైన కథనం ప్రచురించింది.సిపిఎం అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ కూడా ఆ వ్యాసాన్ని పునర్ముద్రించింది. ఇంత జరుగుతున్నా తేలిగ్గా కొట్టిపారేయడం తప్ప లోతుగా దర్యాప్తు జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. ఆ సాక్ష్యాలు చెల్లవని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందంటూ దాటవేశారు. ఇక ఇప్పుడైతే ఐటిఎస్‌సినే వాటిని కొట్టిపారేసింది. దీనివల్ల మోడీ వంటివారికే గాక సహారా గ్రూపునకు కూడా చాలా మేలు కలిగింది.14 పార్టీలకు చెందిన వందమందికి ముడుపులు అందించినట్టు దొరికిన సాక్ష్యాధారాలకు విలువ లేదని ఎవరో ఉద్యోగి కోపంతో వాటిని సృష్టించారని వింత వాదన తీసుకొచ్చారు.ఇలాటి కేసులు తేల్చడానికి ఏడాది రెండేళ్ల మధ్య తీసుకునే ఐటిఎస్‌సి కేవలం మూడే రోజుల్లో కొట్టిపారేసి రికార్డు సృష్టించింది. నవంబరు 7న సమస్య రాగా 10వ తేదీకంతా కొట్టేయడం జరిగిపోయింది. అంటే ఏలిన వారిని కాపాడ్డం కోసం ఎంత వేగంగా కదిలారో తెలుస్తుంది. గతంలోనూ గుజరాత్ హత్యాకాండకు సంబంధించిన కేసులు, కాగ్ చేసిన ఆరోపణలు ఇలాగే కొట్టుకుపోయాయి. అప్పుడు గుజరాత్‌లో గాని ఇప్పుడు కేంద్రంలో గాని లోక్‌పాల్‌ను నియమించడానికి మోడీ సిద్ధపడరు. నీతి గురించి మాత్రం నిరంతర సూక్తులు వినిపిస్తూనే వుంటారు. వినాలి మరి!
VOTE VESINA THARUVATHA VINAKA THAPPADUGAMARI, NEETHI PRAJALAKE KADA, PRAJALANU KRAMASIKSHANALO PETTE KRAMLO – NEETULU CHEPPEVARI SANKYA EEMADYA CHALA PERIGI POTOOVUNDI. ADIKOODA VENKAYYA NAIDU THARUVATE EVVARAINA. AAYANA HARICHANDRUDULENI LOTU TEERUSTUNNARU. (SORRY HARI CHANDRUDU NEETULU CHEPPALEDU)