బాబుకే నోబెల్‌! భక్తి వినోదాల సైన్స్‌!!

అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జోకులు,స్ట్రోకులు వేయొద్దనుకుంటాను గాని తప్పడం లేదు. మాట్లాడేముందు ఎవరినైనా సంప్రదిస్తారో లేదో అలాగే పొరబాట్లు దొర్లితే ఎవరైనా,కనీసం లోకేష్‌ అయినా చెబుతారో లేదో నాకు తెలియదు. చాలాసార్లు ఎబ్బెట్టుగా అపహాస్యభాజనంగా మాట్లాడుతూనే వున్నారు. తిరుపతి సైన్స్‌ కాంగ్రెస్‌లో నోబెల్‌ బహుమతి తెచ్చిన వారికి వందకోట్లు బహుమానం ఇస్తామని ప్రకటించడం అలాటివాటికి పరాకాష్ట. అంతటితో ఆగక నోబెల్‌ రావాలంటే ఏమైనా టిప్ప్‌ వున్నాయా అని అడగడం ఆయనకే చెల్లింది. ఆయన అదే ప్రశ్న వేదికపై వున్న జపాన్‌ నోబెల్‌ విజేత కజితాను అడిగితే ‘ కష్టపడ్డమే వేరే అడ్డదారులు లేవు’ అని జవాబిచ్చారు.ు అక్కడికీ ఆగక మా వాళ్లు బాగా కష్టపడతారు అని వ్యాఖ్యానించారట. ఆ పైన మీరో ఎవరు నోబెల్‌ తెచ్చుకుంటారు అంటే పిల్లలందరూ చేతులెత్తేశారు. ఉత్సాహపర్చడం బాగానే వుంది గాని విషయం ప్రత్యేకతను తీవ్రతనూ తగ్గించే ఇలాటి పనులు అవసరమా అద్యక్షా? అంతర్జాతీయంగా నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానంలో చాలా రాజకీయాలు వుంటాయి గాని శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇచ్చే వాటిపై పెద్ద వివాదాలు లేవు. వైజ్ఞానిక ప్రజ్ఞ దానికి కొలబద్ద. ప్రతిదానికి టిప్ప్‌ షార్ట్‌కట్స్‌ అలవాటైన తర్వాత అన్నిటికీ అదే ప్రయోగం పనిచేస్తుందనుకున్నారేమో తెలియదు. ఏమైనా ఈ వ్యాఖ్యలతో ఆయన సైన్సునూ నెబెల్‌నూ తన ధోరణిని కూడా నవ్వుల పాలు చేశారు.
ఏడుకొండలవాడి పాదాల చెంత సైన్స్‌ కాంగ్రెస్‌ అంటూ అదేపనిగా చెప్పడం మరో విపరీతం. భక్తి విశ్వాసాలు ఎవరికి వారి స్వంతం.అయిnaidu-story_647_010517121247తే విజ్ఞాణ శాస్త్రానికి ఆధ్యాత్మిక విశ్వాసాలకు పొంతనకుదర్దు. తిరుపతిని హిందువులు ఎంతగా పూజిస్తారో ఆ వేదికపై చెప్పడం ఆయనే గాక ప్రధాని మోnobel111డీ కూడా తిరుపతి మహత్యం కీర్తించేందుకు విజ్ఞాన శాస్త్ర సభను ఉపయోగించుకోవడం అసందర్భం,అభ్యంతర కరం. విజ్ఞాన శాస్త్రం విశ్వజనీనం, అందరికీ సమానం. విశ్వాసం భక్తి ఎవరికి వారి ఇష్టం. ఒకో మతానికి దేశానికి వేర్వేరు.ఏదో మాటవరసకు తిరుపతి తీర్థయాత్రా స్థలమని చెప్పడం వేరు సభా వేదికనూ తిరుమలనూ అనుసంధానం చేసిన అనధికార ఆధ్యాత్మిక తతంగం వేరు. ఇక గవర్నర్‌ నరసింహన్‌ ఈ సభల నుంచి నేరుగా కొండపైకెక్కి వళ్లంతా కుంకుమ పసుపు పూసుకుని ఫోటోలకు అవకాశమివ్వడం మరింత విపరీతం. కావాలనుకున్నంత సేపు పూజలు చేసుకోవచ్చు గాని సైన్సునూ అధికార కార్యక్రమాలను ఒక మతంతో ఒక దేవుడితో ముడిపెట్టడం మాత్రం రాజ్యాంగ సమ్మతం కాదు. విజ్ఞాన సమ్మతం అసలే కాదు.
ఈ సభల సందర్భంలో ప్రధాని మోడీ చాలా మూడీగా వుండి చంద్రబాబును గాని మరికొందరిని గాని ఏమంత ఎంటర్‌టైన్‌ చేయలేదని సమాచారం.హైదరాబాదులో కెసిఆర్‌తో పక్కకు వెళ్లి పదినిముషాలు మాట్లాడిన వారు భాగస్వామ్య ముఖ్యమంత్రి దగ్గర అలా ఎందుకు చేశారో ఏడుకొండల వాడికే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *