పిఎఫ్ వడ్డీ కోత- రైళ్లలో వాత
నల్లడబ్బుపై యుద్ధంలో బడా బాబులను చేసిందేమీ లేదు గాని ఉద్యోగులుకార్మికులపై ప్రభుత్వం కొత్తదాడి చేసింది. ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్గీ రేటును8.8 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించేసింది. దీనివల్ల ఉద్యోగులకు 568 కోట్లు గల్లంతవుతాయి. ఈ విషయమై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ ప్రసంగంలోనే సూచనలు చేశారు. ఫ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జనరల్ పిఎప్ వంటివాటి స్థాయికి ఇపిఎఫ్‌ను కూడా తీసుకురావాలనే పథకం దీని వెనక వుంది. తద్వారా వీరందరిని అటు మరల్చవచ్చునని ఆలోచన. గతంలోనూ వడ్డీరేటు తగ్గింపు, విత్‌డ్రా పరిమితులు,పన్ను విధింపు వంటి అనేక పథకాలు ప్రకటించి కార్మికులు ఉద్యోగుల నిరసన వల్ల వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పని చేసింది. వాస్తవానికి ఈ వడ్డీ రేటును పెంచాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.ఇటీవలనే చిన్న పొదుపుమొత్తాలపై కూడా వడ్డీ రేటు తగ్గించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట వ్యాపార పారిశ్రామికవర్గాలకు అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించాలంటున్న ప్రభుత్వం మరోవైపు మధ్యతరగతిపై ఈ విధంగా దాడి చేయడం దారుణమైన విషయం
ఇక ఈ ఏడాది రైల్వే బడ్జెట్కూడా లీనం చేసుకున్న ఆర్థిక మంత్రి ప్రయాణీలకులపై బాంబు వేశారు. రైళ్లలో సేవలకు సొమ్ములు చెల్లించాలే గాని ఉచితంగా ఇవ్వబోమని స్పష్టం చేశారు. సేవల సరఫరాల ప్రైవేటీకరణ, ఆస్తుల వాణిజ్య వినియోగం, నష్టాలను నివారించే విధాన నిర్ణయాలపై రైల్వేలను నడిపిస్తామన్నారు. ఇవన్నీ ప్రజలపై పడేవేనని వేరే చెప్పాలా?