అంటే ..క్యాష్‌ వున్నా .. కష్టపెడ్తున్నారా ? జైట్లీజీ?

నోట్లరద్దు నిర్ణయం ముందస్తు సన్నాహాలతో తీసుకున్నదేనని ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ఈ రోజు మరోసారి సమర్థించుకున్నారు. పైగా ఆర్‌బిఐ దగ్గర కావలసినంత నగదు వుందని డిసెంబరు31 తర్వాతకు కూడా సరిపోతుందని ఆయన అన్నారు. అంటే ప్రభుత్వం కావాలనే ప్రజలను కష్టపెట్టిందని ఆయన మాటల సారాంశమనుకోవాలా?
రోజుకో మాట చొప్పున మారిన ప్రభుత్వ వైఖరిని గురించి నిన్న చెప్పుకున్నాం. ఈ రోజు జైట్టీ మరో వింత సవరణ చేశారు. 5000 ఒకేసారి డిపాజిట్‌ చేసుకోవాలని అంతకు మించితే ప్రశ్నలకు జవాబుచెప్పాలని నిన్నటి తాఖీదు. ఈ రోజు జైట్లీ అన్నదేమంటే ఒకేసారి డిపాజిట్‌ చేస్తే ఏ సమస్య వుండదు దఫదఫాలుగా చేస్తేనే ప్రశ్నలు అని అన్నారు. ఇదే ప్రభుత్వం డిపాజిట్‌ చేసుకోవడానికి మాnotes_3073441pర్పిడికి హడావుడి అక్కర్లేదు 31 వరకూ గడువుందని గతంలో చెప్పి మాట మార్చిన సంగతి అందరికీ తెలుసు. ఇంత కీలక విషయంలో ఇన్నిపిల్లి మొగ్గలు మోడీ సర్కారుకే చెల్లింది
ఈ రోజు చిన్న వ్యాపారులు గనక డిజిటల్‌ చెల్లింపులు చేస్తే 8 శాతం గాక 6 శాతమే ముందస్తు పన్ను వసూలు చేస్తామని మరో తాయిలం ప్రకటించారు. ఈ ప్రభుత్వానికి నల్లడబ్బు అదుపు కన్నా నగదు రహిత కార్పొరేట్ట ప్రయోజనాలే ప్రధానంగా కనిపిస్తున్నట్టుంది. మరోవైపున ప్రభుత్వ చర్య వల్ల తాము బలవుతున్నామంటూ బ్యాంకు ఉద్యోగులు పోరాటం ప్రారంభించాలని భావిస్తున్నారు. పలు చోట్ల వారిపై దాడులు, ప్రభుత్వం వారిపైకి సమస్యను మళ్లించడం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనవెలువడింది. ఏమైనా సమస్య జటిలమే గాక సడలుతున్నది లేదు.

2 thoughts on “అంటే ..క్యాష్‌ వున్నా .. కష్టపెడ్తున్నారా ? జైట్లీజీ?

  • December 20, 2016 at 4:24 pm
    Permalink

    BANK EMPLOYEES PORATAM CHESTE, EPPUDU YEMI PRAYOJANAM. DECEMBER 30 DAGARALONE VUNDI. ADI MODATE SUPREM COURT COMMENT CHESI NAPPUDU (PRAJALU ASAHANAANIKI GURI AVUTHARU, DAADULU KOODA JARAGA VACHCHU ) POARATAM CHESI VUNTE, PRAJALANU, VAARAINA, AADUKUNNATLU VUNDEDI. EPPUDU SUPREM COURT CHEPPINDI NIJAMAIYETLUNDI, TEGE VARAKU LAGADAM ANTE YIDENEMO. ANDARU DONGALE AYINNAPPUDU, VALLE VOOLLU PANCHUKUNTARE GAANI MAROKARIKI AVAKASAM IVVARU. VAATALALO THEDA VASTENE MEERU AASINCHEDI JARUGUTUNDI.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *