పేదలే ఏడుస్తున్నారు… కిషన్‌రెడ్డిగారూ,
పార్లమెంటులో కాకపోయినా తెలంగాణ శాసనసభలో నోట్లరద్దుపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ షరామామూలుగా ఆచితూచి మాట్లాడారే గాని ప్రజల ఘోషను ప్రతిబింబించారని చెప్పలేము. ఆయన లోలోపల బాధపడుతున్నారని . జానారెడ్డి అన్నమాట నిజం గనకే అందరూ నవ్వారు. అంతగా దాచుకోవలసిన అవసరం లేదు. మొదట దిక్కుమాలిందనీ తర్వాత దిక్కు చూపేదనీ రకరకాలుగా టి సర్కారు పిల్లిమొగ్గలు వేసింది. ఇక నగదు రహితంలో మరీ రెచ్చిపోయి అత్యుత్సాహం చూపింది.ఇబ్రహీంపూర్‌పై సాక్షిలోనూ కొన్ని ఇంగ్లీషు పత్రికలలోనూ వచ్చిన కథనాలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. అయితే ఈ చర్చలో అందరికన్నా దారుణంగా మాట్లాడింది బిజెపి నాయకుడు జి.కిషన్‌రెడ్డి. దేశ చరిత్రలో మొదటిసారి పేదలు నవ్వుతున్నారట! ఇంతకన్నా అవాస్తవం ఏముంటుంది? సైనిక భజనతో రాజకీయం చేసినపాలకులు తలదించుకునేట్టు
. ఒక మాజీ సైనికుడే విలపిస్తున్న ఫోటోను హిందూస్థాన్‌టైమ్స్ ప్రచురిస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మామూలు వారి సంగతి చెప్పేదేమిటి? నందలాల్ అనే ఆ సైనికుడు 1971 బంగ్లాదేశ్ యుద్దంనాటి లాన్స్ నాయక్. అదే నందలాల్ మరుసటి రోజు ఆ ఫోటో చూసిన వారు తనకు సహాయం చేయడానికి వస్తే హుందాగా తిరస్కరించి తన పెన్షన్ చాలని ప్రకటించడం పేదల ఆత్మగౌరవం ప్రతిబింబించింది. అయితే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాత్రం ఆయన కోరారు మరో విశేషం బిజెపి ఎంపిలు ఆరెస్సెస్ ప్రముఖులూ కూడా ఇది మన కొంప ముంచుతుందని గగ్గోలు పెట్టారు. వారికి అనుబంధమైన లఘు ఉద్యోగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో 69.9 శాతం చిన్న పరిశ్రమ దారులు నష్టపోతున్నామని చెప్పారు. నిజం చెప్పకపోవచ్చు గాని అవాస్తవాలు చెప్పడం నాయకులకు మంచిది కాదు.