చంద్రబాబు హ్యాపీ – అయితే ఎసిబి ఫెయిల్డ్‌? కెసిఆర్‌ డిస్‌ప్రువ్డ్‌?

.

ఓటుకు నోటు కేసులో ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు జరపాలంటూ ఎసిబి కోర్టు ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. అసలు దర్యాప్తు అవసరాన్నే తోసిపుచ్చిందా లేక కేసు వేసిన వైసీపీ ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్రను నిరాకరిస్తూ ఇలా చెప్పిందా అన్నది లోతుగా పరిశీలించాల్సి వుంటుంది. ఎందుకంటే ఎసిబి తుది నివేదిక ఇవ్వకుండానే హైకోర్టు ముందే క్లీన్‌చిట్‌ ఇచ్చే అవకాశముండదు. ఆ పని ఉన్నత న్యాయస్థానానిది కాదు గనక. ఎసిబి కోర్టు ఆదేశంపై స్టే ఇచ్చినప్పుడే హైకోర్టు అభిప్రాయం సూచనగా వెల్లడైంది. కనుక ఈ తీర్పు భిన్నంగా వుంటుందని ఎవరూ అనుకోలేదు. దీనిపై సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కోర్టు తీర్పుతోనైనా వైసీపీ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అయితే ఎసిబిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ఏమీ అనకపోవడం విచిత్రం. ఎందకంటే కేసు వేసింది ఆరోపణచేసింది వారే. చంద్రబాబు సంగతి తేలుస్తామన్నట్టు మాట్లాడిన ముఖ్యమంత్రిkcr-babu333 ఇప్పుడు మౌనముద్ర దాల్చి అంతా ఎసిబి చూసుకుంటుందన్నారు. మరైతే అప్పుడెందుకు అన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు? ముందే హెచ్చరికలు కురిపించార/? ఈ తీర్పుతో మీ మాటలు కూడా తేలిపోయినట్టు వొప్పుకుంటున్నారా? ఇక ఎసిబి విషయం మరింత విపరీతం.ఇది పెద్దవాళ్లతో వ్యవహారం గనక క్షుణ్ణంగా పరిశోధించిగాని చెప్పలేమని అప్పట్లో వాదించింది ఎసిబి. ఆర్కేకు కేసుతో ప్రమేయం లేదనే విషయంలో ఎసిబి న్యాయవాది సునీల్‌ కుమార్‌ చంద్రబాబు న్యాయవాదితోఏకీభవించడం పెద్ద తమాషా. ఎందుకంటే వారు వాద ప్రతివాదులుగా వుండవలసిన వారు! ఎంఎల్‌ఎ స్టీవెన్‌సన్‌కు ఇచ్చిన మొత్తం ఎక్కడ నుంచి వచ్చిందో తాము ఇంకా దర్యాప్తు చేస్తున్నామని ఆయన కోర్టుకుచెప్పారు. మారిన ఎసిబి రూటు.. చంద్రబాబు సేఫ్‌ అన్నట్టు.. అని నేను గత నెల 15వ తేదీనే పోస్టు పెట్టాను. కాబట్టి ఈ తీర్పు ఆశ్చర్యం కలిగించదు. తెలుగుదేశం ఆనందించాల్సిన అవసరమూ లేదు. . నిజానికి రేవంత్‌ రెడ్డి వంటి వారు ఈ కేసు నిలిచేది కాదని ఎప్పుడో ధీమాగా ప్రకటించారు. చంద్రబాబుతో కెసిఆర్‌కు రాజీ కుదిరి వుండొచ్చుగాని రేవంత్‌తో కుదిరే అవకాశం ఇప్పటికైతే లేదు.కాబట్టి ే రాజకీయావసరాల కోసం కేసును రగిలించి ఇప్పుడు తక్కువ చేసిన వారు రేపు మళ్లీ అవసరమైతే రాజేయడానికి వెనుకాడరు. ఏమన్నా అంటే వ్యూహాత్మకం అంటారు. మేము సన్యాసులం కాదు సర్కారీధీశులం గనక ఏంచేసినా చెల్లుతుందని ఢంకా బజాయిస్తారు. సో… ఇప్పటికైతే అమరావతిలో ఆనందమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *