..ప్రైవేట్‌ ‘క్యాపిటల్‌’ కు ఫార్ములాలు సిద్ధం..

రాజధాని అమరావతికి సంబంధించిన అంచనాలపై ప్రపంచబ్యాంకు సందేహాలు వ్యక్తం చేసిన తీరు మరో పోస్టులో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచనలు ఎటు పయనిస్తున్నాయో చూద్దాం. ప్రజాశక్తి 24వ తేదీ సంచికలో ఇచ్చిన వివరాల ప్రకారం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌(పిపిపి) పేరిట పలు మార్గాలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, హడ్కోలతో సహా వివిధసంస్థలతో 25వ తేదీన ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
ఇంతకూ ఈ పిపిపి ఫార్ములాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. దేశంలో ఇంతవరకూ ఏదైనా రాజధానినే పిపిపి తరహాలో కట్టిన దాఖలాలు కనిపించవు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అటే మొగ్గు చూపుతున్నారు. ఆయన కారణాలు ఆయనకుండొచ్చు. కేంద్రం నుంచి నిధులు రాలేదనే కారణం ప్రధానంగా చూపిస్తున్నా ప్రైవేటు సంస్థలపై మోజు అనుబంధం కూడా ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్‌డిఎ(క్రిడా) మొదటి ప్రతిపాదనే పిపిaaeaaqaaaaaaaaw1aaaajgi3njy0ymuzltqxngitndrmyy05nme1ltc3yzqxmdy3yzvingపి నమూనాలో వుంటుంది. రహదారులు, విద్యుత్‌ పంపిణీ, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు బిడ్లు ఆహ్వానిస్తారు. వీటివల్ల 5500 కోట్లు వస్తాయంటున్నారు.
జి 2 జి ఈక్విటీ ఫండ్‌ ఏర్పాటు కింద ఇతర దేశాలకు రాజధాని నిర్మాణంలో భాగం కల్పిస్తారు. ఆసక్తి గల దేశాల సంస్థలకు అవకాశం ఇస్తారు. 1400 కోట్లకు ఈ తరహా ఒప్పందాలు వర్తిస్తాయి.
ఇక మూడోది దాదాపుగా భూమిని ప్రైవేటు పరం చేసే ల్యాండ్‌ మ్యానిటైజేషన్‌ పథకం. మూడళ్ల నుంచి పదేళ్ల వరకూ వ్యవధితో వుండొచ్చు. స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌(ఎస్‌పివి)గా రాజధానిలో కొంత భూమిని ి యూనిట్లుగా చేసి వెంచర్‌ క్యాపిటలిస్టులను ఆహ్వానిస్తారు. భూమి విలువ పెరిగితే అమ్ముకొని వారు లాభాలు పొందొచ్చు. ప్రభుత్వం 2500 కోట్లు వారి నుంచి ఆశిస్తున్నది గాని వారికి ఏ స్థాయిలో లాభాలు వుండేది వూహించవలసిందే.
ఇన్నివిధాలుగా ప్రైవేటును భాగస్వామిని చేస్తున్న ప్రభుత్వం తన స్వంత శాఖల భవనాలు సిబ్బంది క్వార్టర్సు విషయంలోనూ లీజు రెంటల్‌ డిస్కొంటింగు అంటూ వ్యాపార ఫార్ములాలనే పాటిస్తున్నది. శాఖల నుంచి అద్దెలు, సిబ్బంది హెచ్‌ఆర్‌ఎలను జమ చేసుకుని 2500 కోట్లు సమీకరించాలనుకుంటున్నది.
ఇది గాక నేరుగా బాండ్ల విడుదల కూడా పరిశీలనలో వుంది. ఏది ఏమైనా ఇందులో అధిక భాగం ప్రైవేటు చొరవకు లీజులు స్వాధీనాలకు సంబంధించిన ఆలోచనలే. డిజైనింగు దశలోనే అయోమయానికి దారితీసిన ఈ నమూనా రెండేళ్లలో సాధించే అద్భుతాలు ఏమీ వుండకపోవచ్చు. పైగా మొదట కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం ఆలస్కం చేయడం లాభం లేదంటే పేచీలు
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్‌డిఎ(క్రిడా) మొదటి ప్రతిపాదనే పిపిపి నమూనాలో వుంటుంది. రహదారులు, విద్యుత్‌ పంపిణీ, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు బిడ్లు ఆహ్వానిస్తారు. వీటివల్ల 5500 కోట్లు వస్తాయంటున్నారు.
జి 2 జి ఈక్విటీ ఫండ్‌ ఏర్పాటు కింద ఇతర దేశాలకు రాజధాని నిర్మాణంలో భాగం కల్పిస్తారు. ఆసక్తి గల దేశాల సంస్థలకు అవకాశం ఇస్తారు. 1400 కోట్లకు ఈ తరహా ఒప్పందాలు వర్తిస్తాయి.
ఇక మూడోది దాదాపుగా భూమిని ప్రైవేటు పరం చేసే ల్యాండ్‌ మ్యానిటైజేషన్‌ పథకం. మూడళ్ల నుంచి పదేళ్ల వరకూ వ్యవధితో వుండొచ్చు. స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌(ఎస్‌పివి)గా రాజధానిలో కొంత భూమిని ి యూనిట్లుగా చేసి వెంచర్‌ క్యాపిటలిస్టులను ఆహ్వానిస్తారు. భూమి విలువ పెరిగితే అమ్ముకొని వారు లాభాలు పొందొచ్చు. ప్రభుత్వం 2500 కోట్లు వారి నుంచి ఆశిస్తున్నది గాని వారికి ఏ స్థాయిలో లాభాలు వుండేది వూహించవలసిందే.
ఇన్నివిధాలుగా ప్రైవేటును భాగస్వామిని చేస్తున్న ప్రభుత్వం తన స్వంత శాఖల భవనాలు సిబ్బంది క్వార్టర్సు విషయంలోనూ లీజు రెంటల్‌ డిస్కొంటింగు అంటూ వ్యాపార ఫార్ములాలనే పాటిస్తున్నది. శాఖల నుంచి అద్దెలు, సిబ్బంది హెచ్‌ఆర్‌ఎలను జమ చేసుకుని 2500 కోట్లు సమీకరించాలనుకుంటున్నది.
ఇది గాక నేరుగా బాండ్ల విడుదల కూడా పరిశీలనలో వుంది. ఏది ఏమైనా ఇందులో అధిక భాగం ప్రైవేటు చొరవకు లీజులు స్వాధీనాలకు సంబంధించిన ఆలోచనలే. డిజైనింగు దశలోనే అయోమయానికి దారితీసిన ఈ నమూనా రెండేళ్లలో సాధించే అద్భుతాలు ఏమీ వుండకపోవచ్చు. పైగా మొదట కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం ఆలస్కం చేయడం లాభం లేదంటే పేచీలు పెట్టుకోవడం ఆలస్యం చేయడం ఇవన్నీ వాటి వ్యాపారంలో భాగంగా వుంటుంది. ఇదేగాక బినామీలను దించడం, పాలకపక్షీయులకు సబ్‌లీజులు స్వాధీనం చేయడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంటుంది. చిన్నా చితకా ప్రాజెక్టులకే సమస్యలు కొనసాగుతుంటే ఏకంగా చరిత్రాత్మక రాజధాని నిర్మాణాన్ని వారి చేతుల్లో పెడితే ఏమవుతుందో నారాయణుడికే తెలియాలి మరి!
ఈ కథలో కొసమెరుపు ఏమంటే రాజధాని పాలన ప్రజా సదుపాయాలు ఒక కొలిక్కి రాకముందే ఒలింపిక్‌ విలేజి గురించి వూహలు చేయడం.గతంలో ఒలింపిక్స్‌ నిర్వహించిన స్పెయిన్‌లోని బార్సిలోనా నగర మేయర్‌ను అందుకోసం పిలిపించి సంప్రదింపులు జరపడం. దీన్ని దార్శనికత అనాలో లేక పగటి కల అనాలో ఎవరికి వారే తేల్చుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *