వృత్తి వ్యాపారాల్లాగే రాజకీయాల్లో వారసత్వం-సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబ వారసత్వం కొనసాగింపుపై అద్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన సమాధానం లేదా సమర్థన చాలా ఆసంబద్దంగా వుంది. వ్యాపారుల పిల్లలు వ్యాపారాలే చేసినట్టు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లయినట్టు తమ కుటుంబం రాజకీయాల్లో వుందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లో ప్రజలు పార్టీలు ఆమోదించడం ఓడిపోవడం గెలవడం వంటివి వుంటయన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా ఇండియా టుడే కోసం రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కుమారుడు రాహుల్ రాకకు రంగం సిద్ధం చేశారని చెప్పాలి. ఈ విషయంలో ఎలాటి అస్పష్టత లేకుండా సూటిగానే సమర్థించారు.తను మాత్రం బాధ్యత నిర్వహించడం కోసం ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నారు.ఇందిరాగాంధీని ఎంతగానో పొగిడిన సోనియా ఆమెను మోడీతో పోల్చడానికి అవకాశమే లేదని ఖండితంగా చెప్పారు. ఆ మాటలకు తానేమాత్రం విలువ ఇవ్వడం లేదన్నారు.మోతీలాల్ నెహ్రూ నుంచి తీసుకుంటే కాంగ్రెస్లో రాహుల్ ఆ కుటుంబం నుంచి ఆరవతరం నాయకుడవుతాడు. సోనియా చెప్పినట్టు ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావచ్చు గాని ఎకాఎకిన పార్టీ సర్వాధినేతలుగా కాదంటే దేశ ఫ్రధాన మంత్రులుగా ఎగబాకడమే ఇక్కడ అభ్యంతరాలకు ప్రశ్నలకు దారితీస్తుంటుంది. ఈ జాడ్యం ప్రాంతీయ పార్టీల్లోనూ పూర్తిగా వుం