బాహుబలి కాదు-బహుబలి

wpon111prabhas-warscene-baahubalibahubali-1-010615
సంచలనం సృష్టించిన బాహుబలిలో యుద్ధ సన్నివేశాన్నిచాలా కష్టపడి ఖర్చుపెట్టి తీశారు. ఆ సన్నివేశంలోనే హీరోకూ విలన్‌కూ మధ్యన తేడా చూపించి శివగామిదేవి పెట్టిన పరీక్ష ఫలితం modi-bahubaliతేల్చేశారు. దాడి చేసిన కాలకేయులపై ఒక్కుమ్మడిగా బాణాలు కురిపించేముందు తమ రాజ్య ప్రజలను కాపాడటానికి తగు చర్యలు తీసుకుంటాడు బాహుబలి. అంతకంటే ముందు విలన్‌ భల్లాల దేవుడు మాత్రం తమ వాళ్లు కూడా సామూహికంగా హతమవుతున్నా శత్రువును చంపడానికే సాగిపోతాడు. ఇక్కడే రెండు పాత్రల మధ్య తేడా తెలుస్తుంది.
ఇప్పుడు నోట్లరద్దు సర్జికల్‌ స్ట్రయిక్‌లో కొంతమంది మోడీని బాహుబలితో పోలుస్తూ కార్టూనులు వేశారు. కాని పైన చెప్పిన కొలబద్దతో చూస్తే అసలైన నల్లకుబేరులపై చర్యల లేవు గాని ఆనేక మంది అమాయకులు బలికావడానికి ఆయన వైఖరి కారణమైంది. 70 మంది పౌరులు, 11 మంది బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇది బాహుబలి కోవకు చెందుతుందో బహుబలిగా వుంటుందో ఆలోచించాలి. మంగళవారం నాడు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఇది ఆరంభ ఘట్టం మాత్రమేనని మరింత తీవ్రంగా లోతుగా చర్య వుంటుందని ప్రకటించారు. అంటే మరెన్ని దుష్ఫలితాలు చూడవలసి వుంటుందో ! పోనీ అదే ముక్క పార్లమెంటుకు వచ్చి చెప్పమంటే ససేమిరా అంటూ దాటేస్తున్నారు. వాస్తవానికి సభ సమావేశం కాగానే జరిగిన దానిపై ఒక ప్రకటన చేసి వుండాల్సింది. అందుకు బదులు అడిగినా రాకుండా మొహం చాటేయడం ఎలాటి న్యాయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *