ఖండనలు సరే, బెదిరింపులెందుకు?
సూర్యాపేటలో నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడమే గాక దౌర్జన్యానికి పాల్పడిన ఈదులూరి సుధాకర్‌తో తమ పార్టీకి గాని మంత్రి జగదీశ్ రెడ్డికి గాని సంబంధం లేదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కర్నె ప్రభాకర్ ఖండించారు.ఒకే. దానిపై తదుపరి సమాచారాలు ఎలా వుంటాయో చూద్దాం. కాని 36 గంటల పాటు ఈ దృశ్యాలు ప్రసారమవుతుంటె నిజానిజాలు తెలుసుకోవలసిన, మోసం చేసిన వారిపై చర్య తీసుకోవలసిన బాధ్యత పాలకపక్షం పైనా ప్రభుత్వంపైనా వుంటాయి. అంతేగాక తమ గురించిన కథనాలను ఖండించడం కూడా వారి బాధ్యతే. ఆ విషయంలో బాగా ఆలస్యం చేసిన టిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఇది దుష్ప్రచారమంటూ వాటిని పనిగట్టుకుని ప్రసారం చేసిన వారిపైన ప్రచారం చేసిన సోషల్‌మీడియాపైన పరువు నష్టం దావా వేస్తామంటున్నారు. ఈ విషయంలో అలసత్వం ఆలస్యం వుంటే అది అధికార పక్షానిది. నేనైతే నిన్న నాకు వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ విషయం పోస్టు చేస్తూ వివరణో లేక ఖండనో ఇవ్వాలని రాశాను. అంత విస్త్రతంగా ప్రసారం అవుతుంటే స్పందించేందుకు ఎందుకు ఆలస్యం జరిగిందో వారే అధినేతకు సంజాయిషీ చెప్పుకోవాలి తప్ప ఇతరులపై కేసులు వేస్తామనడం అర్థం లేని విషయం. ఎంఎల్‌సి ప్రభాకర్ ప్రకటనలో ఖండనకు చూపినంత ఆసక్తి తదుపరి చర్యకూ నిరుద్యోగులకు న్యాయం చేయడానికి చూపకపోవడం ఆశ్చర్యకరం. మరోవైపున ఈ మోసానికి సంబంధించిన మరిన్ని ఫిర్యాదులు ఈ రోజు కూడా వచ్చాయి. ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా గట్టిగా స్పందిస్తారని ఆశిద్దాం. https://youtu.be/CvVXI1RbDak
https://youtu.be/8Onoc74LR30