సంతోష్ దౌర్జన్య దృశ్యాలు.. మంత్రిగారూ, మాట్లాడండి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఇంకా నిర్ణయాత్మకమైన చర్యలు మొదలు కానేలేదు. రాజకీయ నేతలపై పెద్దగా చర్యలు వుండే అవకాశమే కనిపించడం లేదు. ఈ లోగానే సూర్యాపేటలో టిఆర్‌ఎస్ యువజన నేత, మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడుగా చెప్పబడే ఈదులూరి సంతోష్ అరాచక దౌర్జన్య దృశ్యాలు బయిటకు వచ్చాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లు చేసిన ఈ చోటా నాయకుడు అమాయక యువకులపై అమానుష దాడికి పాల్పడ్డం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వార్త అన్ని ఛానళ్లలోనూ వచ్చినా ఇప్పటికీ టిఆర్‌ఎస్ అధికార మీడియాలో ఈ వార్త వచ్చిన దాఖలాలు లేవు. మంత్రి కూడా దీనిపై స్పందించాలని బాధితులు కోరుతున్నారు. నా వెబ్‌సైట్‌కు ఈ మేరకు వచ్చిన మెసేజ్‌లు వచ్చాయి. ఇలాటి వారిని మంత్రిగారూ, మాట్లాడండి..దూరంగా వుంచడం, జరిగిన దాన్ని వివరించడం, ఖండించడం మంత్రిబాధ్యత
https://youtu.be/_KeByPxYlWU