మారిన ఎసిబి రూటు – చంద్రబాబు సేఫ్ అన్నట్టు..
ఒకరేమో కేసు పెట్టిన వారు. మరొకరేమో కేసుకు గురైన వారు. మామూలుగా ఈ సందర్బంలో ఇద్దరి వాదనలు పరస్పర విరుద్ధంగా వుండాలి.కాని ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ఒకటే వాదన వినిపించడం ఒక రాజకీయ న్యాయశాస్త్ర వింత. పిటిషన్ వేసిన వైసీపీ ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని ఈ రెండు వాదనల సారాంశం. సహజంగా చంద్రబాబు తరపున ఆ వాదన రావచ్చు.కాని కేసు నమోదు చేసిన ఎసిబికి ఎందుకు అభ్యంతరం? అంటే గతంలో రాజకీయ కక్షతో వ్యవహరించామని ఒప్పుకుంటున్నారా? ఎసిబి తరపు న్యాయవాది సునీల్ చౌదరి వాదించారు! ఈ కేసులో ప్రజా ప్రయోజనాలు లేవనీ, రాజకీయ వైరంతోనే వేశారని ఆరోపించారు. ఎందుకైతే నేం వచ్చిన కేసులో చెప్పాల్సింది చెప్పాలి కదా! ఎసిబి రహస్యంగా వుంచిన 64 స్టేట్‌మెంట్స్ ఆయనకు ఎలా వచ్చాయో తేల్చాలని ఆయన కోరడం మరింత విచిత్రంగా వుంది. తమ రహస్యపత్రాలు ఎలా బయిటకు వచ్చాయో సంజాయిషీ చెప్పాల్సింది ఎసిబి తప్ప సంపాదించిన వారు కాదు! మరో విషయమేమంటే ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తేల్చలేదని కూడా చెప్పారు. మరి ఇదంతా చంద్రబాబు పనేనని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారా? ఇది ఆషామాషి కేసుకాదని,శాస్త్రీయ ఆధారాలు సంపాదించడానికి సమయం పడుతుందని చెప్పారట.ఈ విషయం తేల్చడానికే ఏడాదిన్నర పడితే ఎసిబి మొత్తం కేసు ఈ ప్రభుత్వ హయాంలో తేల్చగలదా?కావాలనే జాప్యం చేస్తున్నదా? అవేవీ లేకపోతే మొదటే ఎందుకంత రాజకీయ గగ్గోలు చేశారు?అప్పుడు చెప్పింది తప్పా? ఇప్పుడు చెబుతున్నది తప్పా? రాజకీయంగా అంత దుమారం రేపిన టిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడెందుకు మౌన ముద్ర దాల్చారు? కేసు విచారణను చంద్రబాబుపై ఒత్తిడికి ఆయుధంగా వుంచుకోవాలనుకుంటున్నారా?
మరి జగన్ ఆస్తులకీ, తెదెపా నాయకుడు ఎర్రమ్నాయుడికీ ఏం సంబంధం బ్రదర్?
జగన్ ఆస్తులకీ, కాంగ్రెస్ నాయకుడు శంకరరావు కీ ఏం సంబంధం బ్రదర్?