హిందూత్వతో ట్రంప్‌ బంధం-మోడీపై అభిమానం

trumpbi

భారత దేశానికి మొదటి నుంచి డెమోక్రాట్లతో ఎక్కువ సంబంధం అన్నమాట నిజమే. అంతకు ముందు కొన్ని అంశాలున్నా 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో రిపబ్లికన్‌ నిక్సన్‌ హయాంలో ఇరు దేశాల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. వారి దాడి నుంచి నాటి సోవియట్‌ యూనియన్‌ మనను ఆదుకున్నది. అది సహించలేని నిక్సన్‌ వ్యక్తిగతంగానూ ఇందిరాగాంధీపై వ్యాఖ్యలు చేశారు. కాని ఆయనే 1974లో పోఖ్రాన్‌ అనుపరీక్షలను వ్యతిరేకించినా ఆంక్షలు పెట్టలేదు. 1980లో మళ్లీ రిపబ్లికన్‌ అద్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ హయాంలోనే ఇరుదేశాల సంబంధాలు పుంజుకున్నాయి. ఆయన కమ్యూనిజాన్ని కూలదోయాలనే కుట్ర కూడా ప్రారంభించాడు. అది ఫలించి 1991లో సోవియట్‌ విచ్చిన్నమైన తర్వాత అమెరికావైపు పాలకుల మొగ్గు తీవ్రతరమైంది. డెమోక్రాట్‌ బిల్‌ క్లింటన్‌ 1998లో అణుపరీక్షల తర్వాత భారతదేశంపై ఆంక్షలు ప్రకటించారు. మొత్తంపైన గత ఇరవయ్యేళ్లలోనూ ఇక్కడ అక్కడా ఎవరు వున్నా భారత అమెరికాతో మన బ్రహ్మముడి బిగిసిందే తప్hindu-trumpప సడలింది లేదు. మన విదేశాంగ అధికారులూ మంత్రులే గాక ప్రధానులు కూడా అదేపనిగా ప్రదక్షిణలు ప్రశంసలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి ట్రంప్‌ను బిజెపి హిందూత్వ శిబిరం ముందే పూర్తిగా బలపర్చింది. ఆయన కోసం పూజలు చేశారు.ముస్లింలపై తీవ్రంగా మాట్లాడిన ట్రంప్‌ శైలి వారి రాజకీయాలతో పూర్తిగా సరిపోయింది. కాబట్టి ఇక్కడ మోడీత్వకు ట్రంప్‌ శైలికి బాగా అమరుతుంది. మోడీని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలోనే ప్రశంసించారు.మోడీ విజయం ట్రంప్‌ గెలుపు ఒకటేనన్నట్టు సంఘ పరివార్‌ ప్రచారం చేసుకుంటున్నది.కాబట్టి మన పాలకులు అమెరికాకు మరింత లొంగిపోవడం తథ్యం.. . రానున్నరోజుల్లో అమెరికాలో జాతి విద్వేష శక్తులు పుంజుకుంటాయి. . పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయలు ఇతరులు సమస్యలు ఎదుర్కోవలసివస్తుందనే ఆందోళనలో వున్నారు. అధికారం కోసం ట్రంప్‌ కొంత సర్దుకున్నా ఆయన ప్రేరేపించిన ధోరణులు మారవు. మొత్తం ప్రపంచంప్రత్యేకించి యూరప్‌ మరింత మితవాదం,ద్వేషభావం వైపు వెళ్లడానికి ఇది కారణమవుతుంది. అలాగే అస్తవ్యస్తంగా వున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో మరింత ో సవాలుగా మారుతుందిి .అది తిరిగి మనపై ఒత్తిళ్లకు కారణమవుతుంది. చైనాతోనూ మనం వైరుధ్యాలు పెంచుకోవాలనే ఒత్తిడి పెరుగుతుంది. బాహాటంగా ముస్లిం వ్యతిరేకత ప్రకటించిన ట్రంప్‌ పాలనపై ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలు దాడి కేంద్రీకరిస్తే ఉద్రిక్తతలు ఇంకా పెరగొచ్చు. అది మననూ ప్రభావితం చేస్తుంది. ఎన్నికల ప్రచారాన్ని బట్టి పాకిస్తాన్‌ విషయంలో సహాయం తగ్గిస్తారనిఅంటున్నారు గాని కాని అదివేచిచూడవలసిన విషయం. ఎందుకంటే భౌగోళికంగా అమెరికా ఆధిపత్య వ్యూహానికి పాక్‌ సైనిక మతతత్వ కూటమి వంటి తొత్తు పాలనా వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి మోడీ ప్రభుత్వం ఎంతగా ఆశించినా వారు పాకిస్తాన్‌ను కాపాడుకుంటారు. ట్రంప్‌ విజయం రష్యాకు అనుకూలమనేది కేవలం వ్యతిరేకత పెంచే ప్రయత్నం అనుకోవాలి. వాస్తవంలో రేపు అమెరికా దూకుడును కొంతైనా ఆపగల శక్తి నిన్నటి సోషలిస్లు దేశమైన రష్యాకు, ఇప్పటికీ సోషలిస్టు మార్కెట్‌ అంటున్న చైనాకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ట్రంప్‌ విజయంపై సైద్ధాంతిక చారిత్రిక కోణాలలో మరింత అధ్యయనం చేయవలసి వుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *