ఏడిపించి ఏడ్చిన మోడీ నోట్ల పాట్లు

 
article-mzpxfujitz-1443420873తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరూ అందరిని అని హీరో ఎన్టీఆర్‌ పాడితే తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరిని అంటుంది నాయిక బి.సరోజాదేవి దాగుడు మూతలు చిత్రంలో. ఆత్రేయ రాసిన ఈ పాటను నిజం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. నోట్ల రద్దు ప్రహసనంతో ప్రజలు నానా అవస్థలు పడుతూ కొన్నిచోట్ల కన్నీళ్లపర్యంతమవుతున్నారు. దీనికి కారకులైన ప్రధాని మోడ కూడా గోవాలో అధికార కార్యక్రమంలో భావోద్వేగానికి గురైనారట. దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నారనుకోవచ్చు. తాను కుటుంబాన్ని ఇంటినీ దేశం కోసమే వదిలేశానని ప్రకటించారు. నాకు యాభై రోజులు సమమయమివ్వండి నల్లధనాన్ని రూపుమాపుతా అన్న ప్రధాని రెండున్నరేళ్లుగా తనే అధికారంలో వున్నానని మర్చిపోయినట్టున్నారు! ఏమైతేనేం- ఇప్పుడు ఈ నోట్లరద్దు వల్ల పెద్ద ప్రయోజనం లేదనీ తేలిపోయింది. ఈ గొప్ప పథకం పకడ్బందీగా లేదని అర్థమై పోయింది.
.రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, ఆర్థిక వేత్త ప్రభాత్‌ పట్నాయక్‌. స్వామినాథన్‌ అయ్యర్‌లతో సహా చాలా మంది ఈ నోట్లరద్దుపై చప్పరించేశారు. ప్రభాత్‌ అయితే అది ప్రజా వ్యతిరేక చర్య అని కూడా అన్నారు
 
దేశంలో అనేక ప్రతిపక్షాలూ పలు రాష్ట్ర ప్రభుత్వాలూ, మీడియా సంస్థలూ కూడా ఈ నిర్ణయం ఆలోచనా రహితమని విమర్శించాయి
ప్రజలకూ ప్రభుత్వాలకు కూడా భారీ ఆర్థిక నష్టం దాపురించింది.
న్యాయస్థానాలు విచారణకు పిటిషన్లు తీసుకున్నాయి
ఇంతా చేసి ఇది రద్దు కాదు నోట్ల మార్పిడి వంటిదేనని తేలిపోయింది.
బడాబాబులను ఇదేమీ చేయలేదని అందరూ ముక్తకంఠంతో ప్రకటించారు.
సామాన్య ప్రజలూ పేదలూ నానా అవస్థలు పడుతున్నారు
చిన్నవ్యాపారాలు దాదాపు స్తంభించిపోయాయి.అనేక రంగాలు కుదేలైనాయి
పెళ్లిళ్లు చావులు వంటి శుభాశుభ కార్యక్రమాలు కూడా నరకంగా మారాయి
కొన్ని ప్రాణాలే పోయాయి
పాత నోట్ల బదులు ఎంత ఎలా ఇవ్వాలనేదానిపైనా స్పష్టత లేకపోయింది
ఇంతా చేసి పెద్ద నోట్లను రద్దు చేయకపోగా మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టారు.
ఆ నోటు నమూనా ముందే విడుదలై పోవడంతో ఏలిన వారి భద్రత బండారం బహిర్గతమైంది.
ఈ కొత్తనోట్లకు నకిలీవి తయారు చేయడం కష్టమేమీ కాదని అధికారులు అంగీకరిస్తున్నారు. అంటే నల్లడబ్బునే గాక నకిలీ నోట్లను కూడా ఆపలేకపోవచ్చు
గతంలో 1978లోచట్టం చేసి మరీ పెద్ద నోట్లను రద్దు చేస్తే ఇప్పుడు ఇంత రహస్యం నాటకీయత దేనికనే పెద్ద ప్రశ్న దేశం ముందు నిలిచింది.
బ్యాంకులు కూడా మంజూరైన అప్పులు ఇవ్వాలా వద్దా లేకపోతే కలిగే కష్టనష్టాలేమిటని తర్జనభర్జన పడుతున్నాయి.
బిజెపి రాష్ట్ర శాఖలతో సహా కొన్ని వర్గాలకు నోట్లరద్దు వార్త ముందే తెలిసిపోయింది.
అసలు పత్రికలు మీడియా కూడా చాలా వారాల కిందటే రాశాయి.మరి ఈ లేనిపోని హడావుడి దేనికి చేసినట్టు?
 
ఈ తతంగంపై ఇంకా చాలా చాలా విమర్శలున్నాయి. ఇప్పటికే ప్రధాని ఏడుస్తుంటే ఇంకా ఏడిపించడం న్యాయం కాదు. అవి మరోసారి చెప్పుకుందాం.

One thought on “ఏడిపించి ఏడ్చిన మోడీ నోట్ల పాట్లు

  • November 14, 2016 at 9:29 am
    Permalink

    GOVT EMICHESINA TAPPE??????????? ani vetakaram. Comment:- govt. anaalochanatho chesevi maatrame tappu. pratyeka hoda evvaka povatam, nalla dhanaanni swiss banks nundi testamani beeralu paliki, venakku teesuku raleka povatham, vappukalevu kada. prajala ebbandulu pratyashanga choostu vetakaram aadatam maatram pundu meeda karam jallatam lantidi. idi tappu ante case pedatharani janam bhayapadu tunnaru. ippudu manam prakatinchani emergency eddurkuntunnamu.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *