కిరణ్‌ పెళ్లి మళ్లీ కాంగ్రెస్‌తోనే?

kiran11!
పెళ్లికుదిరింది గాని పిల్ల పేరు గోప్యం అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వంత జిల్లా చిత్తూరులోని గుర్రంకొండ గ్రామంలో ఇష్టాగోష్టిగా అన్నారట. మీరేదైనా పార్టీలో చేరితే మాకూ ఒక దారి వుంటుందని అనుచరులు అన్నప్పుడు ఆయన స్పందన ఇది. గ్రామస్తులతో హుషారుగా కాలం గడిపిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలతో రాజకీయ పున: ప్రవేశ సంకేతం ఇచ్చారన్నమాట. ఇంతకూ ఆయన చేరడానికి అవకాశమున్నది కాంగ్రెసే కనిపిస్తున్నది.ఆ మేరకు అవగాహన కుదిరినట్టు కూడా సన్నిహితులు కొంతకాలంగా చెబుతున్నారు. మొదట బిజెపిలో చేరేందుకు ఆలోచనలు కొద్దిపాటి ప్రయత్నాలు చేశారు గాని అంతగా స్పందన రాలేదు.ఈలోగా దేశంలో అసహన దాడులు మొదలైనాయి. స్వతహాగా కాంగ్రెస్‌ వాది అయిన కిరణ్‌ను అవి పునరాలోచనలో పడేశాయి. పైగా స్వంత నియోజకవర్గం పీలేరులో
ో ముస్లిం మైనార్టిలు ఎక్కువ సంఖ్యల్‌ో వున్నారు కూడా. దాంతో బిజెపి వద్దని నిర్ణయించుకున్నారట. వైసీపీ విషయానికి వస్తే జగన్‌పై తీవ్రంగానే దాడి చేసి కేసులు దర్యాప్తు నడిపించిన వ్యక్తిగా దాంట్లో చేరే అవకాశముండదు.ఈ పరిస్థితుల్లో పాత పార్టీ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లడమే మెరుగని ఆయన భావిస్తున్నారని ఒక ముఖ్యనేత చెప్పారు. విభజన బిల్లు ఆమోదం జరిగిన రోజునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పేరిట విఫల ప్రయత్నం చేశారు. అందుకు ఆయనను పురికొల్పిన చాలామంది ఇప్పుడు రకరకాలుగా మారిపోయారు. అయితే అప్పట్లో అన్ని వాదనలు చేసిన వ్యక్తిగా తాను తిరిగి కాంగ్రెెస్‌లోకి రావాలంటే జరిగిన దాన్ని గురించి అధిష్టానవర్గం ఏదైనా కాస్త విచార ప్రకటన చేయాలని కిరణ్‌ కోరుతున్నారట. అంటే విభజన సమయంలో అనుకున్నది అమలు కాక ఆంధ్ర ప్రదేశ్‌కు నష్టం జరిగింది వంటి వ్యాఖ్యలు ఢిల్లీ నుంచి వస్తే ్త అప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని ఆయన తమ పార్టీలో పున: ప్రవేశం చేస్తారని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వివరించారు. బహుశా అలా జరిగే అవకాశమే ఎక్కువ. విభజన సమస్యపై పుస్తకం దాదాపు తయారు చేసుకున్న కిరణ్‌ ప్రచురణ మాత్రం చేయలేదు.ఆ విషయాలు కూడా ఎక్కువగా బయిటపెట్టలేదు. ఏమైనా విభజన జరుగుతుందన్న పూర్తి అవగాహనతోనే ఆయన మొదట ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని కొందరు చెబుతారు. ఒకసారి శాసనసభలో విభజనను తిరస్కరిస్తూ తీర్మానం చేస్తే కేంద్రం అడుగేసే అవకాశం వుండదని ఆయన గట్టిగా నమ్మారని జైరాం రమేష్‌ తన పుస్తకంలో పేర్కాన్నారు. ఏమైనా అదంతా ముగిసిన అధ్యాయం గనక ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌లో ప్రవేశించవచ్చు.బలం పుంజుకుని మళ్లీ ఉనికి చాటుకోవడానికి పిసిసిచీఫ్‌ రఘువీరారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఫలితాలు పరిమితంగానే వున్నాయి గనక కిరణ్‌ పునరాగమనం జరిగితే మరికొంత ఉత్సాహం రావచ్చు.అయితే ప్రజల్లో పాత స్థానం రావడం మాత్రం అంత సులభం కాదనేది నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *