టి మేధావుల పునస్సమీకరణ- కోదండరాం

.kcr-kodandaram-tjac
తెలంగాణ రాష్ట్ర సమస్యలపై విమర్శనాత్మకంగా మాట్లాడేవారిని సజెస్ట్‌ చేయండి అని ఒక ఛానల్‌ మిత్రుడు అడిగారు. ఇది ఇప్పుడు మీడియాను వెన్నాడుతున్న ఒక సమస్య. రాష్ట్ర విభజన కోసం పోరాడిన కాలంలో తెలంగాణ ఉద్యమానికి మేధావులు పెద్ద అండదండ అని తరచూ అనేవాళ్లు. ే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరిలో అత్యధికులు అధికార చట్రంలో ఇమిడిపోయారు.ఆంధ్రప్రాంతానికి ఆ విధమైన మేధావులు లేరని అప్పట్లో కొందరు బహిరంగంగానే విమర్శించే వారు. నా వరకూ నేను ఆయా చోట్ల వుండే కొన్ని అనుకూల ప్రతికూలాంశాలనూ గమనించగలను గాని కులాల వారిగా ప్రాంతాల వారిగా చేసే సూత్రీకరణలకు ఎప్పుడూ పెద్ద విలువ ఇచ్చేవాణ్ని కాదు. .అక్కడా ఇక్కడా ఎక్కడైనా బుద్ధిజీవులు ప్రభుత్వాల నీడలో చేరి కొంతకాలం హాయిగా గడిపేద్దామనుకోవడం సహజంగానే జరుగుతుంది. లెనిన్‌ దీనిపై పెద్ద పుస్తకమే రాశారు ఉదాహరణకు ఇటీవలనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించిన బిసి కమిషన్‌కు చైర్మన్‌గా బిఎస్‌ రాములు,జూలూరి గౌరీశంకర్‌, ఆంజనేయులుగౌడ్‌, గతంలోనూ ఈ కమిషన్‌లో వుండి బాగా పనిచేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌లు గాక .అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య, విఠల్‌, నిరంజన్‌ రెడ్డి వంటివారంతా రకరకాల పదవుల్లో ప్రభుత్వ బాధ్యతల్లో నియమితులైనారు. ఇంకా వివిధ కమిషన్లు ఎంఎల్‌సి పదవులు వంటివాటిలోనూ ఉద్యమ కాలపు ప్రతినిధులు చోటు సంపాదించారు. ఇంకా ఏ పదవి రాని వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. నమ్మకంతో వుంటే ముందో వెనకో ఏదో ఒక లాభం చేకూరుతుంది తప్ప అసంతృప్తి బయిటపడితే మొదటికే మోసం అని ఇలాటి కొందరు ఎదురుచూస్తున్నారు. ఇంత మంది పదవుల్లో వుండిపోవడం వల్ల కలిగిన ఒక ఫలితం ఏమంటే ఎవరూ ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించలేని స్థితి, నైతికంగా అనకూడని పరిస్థితి ఏర్పడింది.నా సంపాదక మిత్రుడు టంకశాల అశోక్‌ వంటివారైతే పదవి తీసుకోకపోయినా అప్పుడే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్న రీతిలో ఏకపక్షంగా రాసేస్తుంటారు. ఆ మాటకొస్తే కెసిఆర్‌ అప్పుడప్పుడు బాగాలేని విషయాల్లో విమర్శలో విసుర్లో వదులుతుంటారు. నమస్తే తెలంగాణలోనూ కొంత సంయమనం కనిపిస్తుంటుంది. కాని వీర విధేయులు ఆశావహులు నోరు మెదిపే అవకాశమే కనిపించడం లేదు.
ఇలాటి నేపథ్యంలో ో బహుశా కెసిఆర్‌తో పాటు లేదా మరో రకంగా ప్రత్యేక కోణంలో ఒక కేంద్ర బిందువుగా నిలిచిన జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఈ ఒరవడికి భిన్నంగా ఉద్యమ కారుడుగానే మిగిలిపోవడం విశేషమే. అయితే ఆయన ఆలోచనలేమిటి ముందు ముందు ఎవరితో ఏ మేరకు కలుస్తారు లేక ఏ రాజకీయ వేదిక నిర్మిస్తారు అన్నది ఇప్పటికి అస్పష్టం. కాని గత సేవలను బట్టి పదవుల కోసం పాకులాడకపోవడం మాత్రం విశేషమే. (మరో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి వారు అప్పుడూ ఇప్పుడూ తమ శైలిలోనే వున్నారు తప్ప టిఆర్‌ఎస్‌ శిబిరంలో భాగం కాలేదు.) తమ ప్రభుత్వ తప్పిదాలను గట్టిగా విమర్శించే కోదండరాంపై టిఆర్‌ఎస్‌ నేతలు కోపంగానే వున్నారు. మొదట్లో ఆయనపై విమర్శలు చేసి కొంత సర్దుకున్న మంత్రి హరీష్‌ రావు ఇప్పుడు బాహాటంగానే విరుచుకుపడ్డారు. కోదండరాం చేసేది కాంగ్రెష్‌ పథకాలకే తోడ్పడుతుందని ఆరోపించారు. గౌరవం పోగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు. ఎంపి కవిత కూడా ఇలాటి వ్యాఖ్యలే చేశారు. ఈ విషయమై ౖ ఏదో చర్చలో నన్ను అడిగినప్పుడు రైతుల కోసం మాట్లాడితే కోదండరాం గౌరవం పెరుగుతుందే గాని తగ్గదని స్పష్టంగా చెప్పాను.రైతు జెఎసి తరపున జరిగిన ధర్నాకు కె.రామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డి,పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి పాత్రికేయ ప్రముఖులు మద్దతు తెలిపారు. కోదండరాం అంత ప్రచారంలో లేకపోయినా ప్రజాస్వామిక బుద్ధిజీవులు ఇంకా చాలా మందే వున్నారు. అప్పుడు న్యాయమూర్తిగా వుండిన చంద్రకుమార్‌ చాలా నిశిత విమర్శలే చేస్తున్నారు.ప్రభుత్వ విధానాలు మారకపోతే వివిధ రంగాల్లో ఈ తరహా కార్యాచరణలు పెరిగే అవకాశమే కనిపిస్తున్నది.ఇతరులను ఏమైనా అనొచ్చు గాని ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నవారిని అంటే అంత సులభంగా చెల్లుబాటు కాదు. అనడం న్యాయమూ కాదు. వారూ వీరు అని గాక నిస్వార్థంగా వుండే వారెవరైనా ప్రజల కోణంలో చేసే విమర్శలను గౌరవించి పొరబాట్టు సరిచేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఉద్యమాలే జీవితం అనుకునే వారికి ఎలాగూ వచ్చే నష్టం వుండదు. కాని ఎక్కువ కాలం పాలించాలనుకునేవారే ఆచితూచి అడుగేయాల్సి వుంటుంది. ఏకపక్ష ధోరణులు ఎక్కువైతే సహేతుక విమర్శలు కూడా బొత్తిగా భరించలేని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు తప్పులూ పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *