హత్యకు గురైన పూర్వప్రధానిపై ద్వేషం
ౖసర్దార్ పటేల్ గొప్పవారే కావచ్చు. నెహ్రూ వారసత్వాన్ని లేదా కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన కుటుంబ వారసులను దెబ్బతీయడానికి ఆయన బిజెపి ఆరెస్సెస్‌లకు బాగా ఉపయోగపడే మాట కూడా నిజమే కావచ్చు. కాని ప్రజాదరణతో ప్రధానిగా ఎన్నికై అధికార నివాసంలో హత్యకు గురైన ఇందిరాగాంధీని గౌరవించడం ఆమె స్థానంలో కూచున్న నరేంద్ర మోడీ బాధ్యత. ఆమె పాలనా కాలంలో తప్పులు అత్యవసర పరిస్థితి వంటి ఘట్టాలు వుంటేవుండొచ్చు. కాని దారుణ హత్యకు గురైన దేశఫ్రధాని అది కూడా ఒక మహిళా నేత, సుదీర్ఘ కాల పాలనలో రెండవ స్థానం పొందినగట్టి ప్రభుత్వాధినేతను వర్థంతి రోజున ఆమె
సమాధి స్థలం వద్ద సముచితంగా గౌరవించకపోతే పాలనా వ్యవస్థలో కొనసాగింపు ఏముంటుంది? ఆరోపణలు అప్రజాస్వామిక దాడులు అన్నీ వున్నాయి గనక ఆమె రాజ్యాంగ స్థానం చెరిగిపోతుందా? ఆమాటకొస్తే ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ హయాంలో గుజరాత్ మారణహౌమం జరిగింది గనక ఆయన ప్రధాని పదవి విలువ తగ్గుతుందా? . దేశ పాలన అంటే కాంగ్రెస్ బిజెపి తగవు కాదు. కాంగ్రెస్‌లో నెహ్రూ ఇందిర కుటుంబాన్ని వేరుచేసి మిగిలిన వారిని మురిపించడం కాదు. రాజకీయానుబంధాలతో నిమిత్తం లేని రాజ్యాంగ క్రమం ఒకటుంటుంది.ఆమె వర్థంతి రోజున నివాళి సమర్పించకుండా ట్విట్టర్‌తో సరిపెట్టడం తగనిపని.కనీసం ప్రభుత్వ ప్రతినిధిని కూడా పంపక పోవడందారుణం.