కొత్తపలుకులో ఆర్కే ఓపెన్‌ హార్ట్‌

rk1111

ప్రత్యేక వంచనకు కొత్త పలుకుల వంత పేరిట నేను రాసిన వ్యాఖ్యానం సోషల్‌ మీడియాలో ఒక చిరు సంచలనమైంది. దానికి ఆర్కేను ఉతికిన తెలకపలిఅని ్ల పేర్కొంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, మరికొందరు ఇచ్చిన కథనం ఇంకా ప్రచారం పొందింది. ఇంతకూ నేను చేసింది రాజకీయ పరమైన మీడియా పరమైన విమర్శ మాత్రమే గాని ఉతుకుడు కోసం కాదు. ఆ తర్వాత వారం ఆంధ్రజ్యోతిలో నా గమనం శీర్షిక వస్తుందా రాదా అని చాలామంది ఆసక్తిగానూ అనుమానంగానూ ఎదురు చూశారు.నాకైతే అలాటి ఎలాటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పత్రికలో మరీ ముఖ్యంగా ఆర్కే ఆధ్వర్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించడం జరుగుతూనే వుంది. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఆ విధమైన విస్త్రత వేదికగా వున్నది పత్రిక.ే ఆయన వ్యాఖ్యలతో కొన్నిసార్లు విభేదించినా ప్రచురించిన సందర్భాలున్నాయి. తాజాగా అక్టోబరు 30 తాజా కొత్తపలుకులు చదివితే ఆశ్చర్యం కలిగించే వైరుధ్యాలు కనిపించాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆడుతూ పాడుతూ పాలిస్తుంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారనేది ప్రధాన ఇతివృత్తం. కెసిఆర్‌కు మీడియా కూడా సహకరిస్తున్నదట.చంద్రబాబును పొగిడేవారు, ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని వాదించేవారు లేరట. ఇలా రాసేప్పుడు సహజంగా ఈ వ్యాఖ్యలు ఆర్కేకు కూడా వర్తిస్తాయి కదా.. మరి వకాల్తా పుచ్చుకోవడం సరైందనుకుంటే తనే పుచ్చుకోవచ్చు. అలాగే తెలంగాణలో మీడియా సహకారం అన్నప్పుడు అదీ తనకు వర్తిస్తుంది.చంద్రబాబు ఎక్కువ సేపు మాట్లాడ్దం, అనవసరమైన సుదీర్ఘ సమీక్షలతో కాలం గడపడం వంటి విమర్శలు ఎప్పుnaidukcr_2478588fడూ వుండేవే గాని విధానపరమైనఅంశాలకు కీలకమైన లోపాలకు మాత్రం బాధ్యత మరెవరిపైనో నెట్టేయడం చెల్లుబాటు కాదు.
ఉదాహరణకు స్విస్‌ చాలెంజి విషయంలో కోర్టులో ఎదురుదెబ్బ తగలడానికి, ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహం రావడానికి అధికారులు పొరబాటున చేర్చిన ఒక మాట కారణమట. ఫోకస్‌ మొత్తం రాజధాని అమరావతిపై పెట్టారంటూ చంద్రబాబును విమర్శించిన ఈ వ్యాఖ్యాత మరి ఆయనకు తెలియకుండానే ఈ మాట అధికారులే చేర్చారనడంలో వాస్తవికత వుంటుందా? సింగపూర్‌లో అవినీతి వుండదు గనక వారి భాగస్వామ్యాన్ని అనుమానించరాదని మరో కితాబు.కాని ఆ సంస్థ ఇక్కడ సబ్‌లీజుకు ఇచ్చే అవకాశం వుందని కూడా గుర్తుంచుకోవాలి కదా? ఇలాటివన్నీ వున్నా ఎపిని నిలబెట్టేది చంద్రబాబేనన్న భావన ప్రజల్లో బలంగా వుందన్నారు. పైగా ప్రతిపక్ష నేత జగన్‌వైపు మొగ్గురావడం లేదట. మరి అలాటప్పుడు ఇంక చంద్రబాబుకు సమస్యేముంటుంది? ఆయన అభిమానులకు ఆందోళన ఎందుకు కలుగుతుంది? ఆయనకు జనాదరణ తగ్గుతున్నదనే సందేహం రాజకీయ పరిశీలకులలో కలుగుతున్నదని మొదట్లో రాసిన దాన్ని పూర్వపక్షం చేయడం కోసమే ఇది రాశారా?
దీనికి చూపించే పరిష్కారం ప్రచారం పెంచుకోవడం, ఆయన భాషలో చెప్పాలంటే హైలెట్‌చేసుకోవడం. తెలంగాణలో కన్నా ఎపిలో చెల్లింపులు వగైరా బాగా జరుగుతున్నా హైలెట్‌ చేసుకోకపోవడమే సమస్యగా వుందట. మరి అది సరైనపని అనుకుంటే ఆ బాధ్యత కూడా నిక్షేపంగా తీసుకోవచ్చు కదా. ఇదెంత వరకూ పోయిందంటే ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో ఆటోలు కొన్నవారు పవన్‌ కళ్యాణ్‌ ముద్రగడ పద్మనాభం ఫోటోలు పెట్టుకుంటున్నారట. అంటే వారు కేవలం చంద్రబాబు ఫోటోలే పెట్టుకావాలని నిబంధన తీసుకురావాలా? మొత్తానికి ఆర్కే అనేదేమంటే ప్రభుత్వ ప్రచారం సరిగ్గా లేకపోవడం వల్ల అపవాదు మోయవలసి వస్తుందట. అవన్నీ అపవాదులేనని నమ్మితే ఆయన గాని లేక మరెవరైనా గాని తప్పక వాటిని ఖండించాల్సిందే కదా.. ఇంత చుట్టుతిరుగుడు రాతలు అవసరం లేదు.
ఇదంతా చదివాక అనిపించేది ఒకటే- చంద్రబాబు ప్రభుత్వ విధానాలపైన ప్రత్యేకించి ఆయన వ్యక్తిగత శైలిపైన విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఏదో మేరకు వాటిని ప్రస్తావించకపోతే నిష్పాక్షికంగా వున్నట్టు కనిపించదు.అయితే విధానాల పరంగా గాని రాజకీయంగా గాని విమర్శించడం ఇష్టం లేదు. కాబట్టే తిలకాష్టమహిషబంధనం అన్నట్టుగా .. రాయడం కోసం తంటాలు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో అనేకసార్లు ఆర్కే ప్రాంతీయ సున్నితత్వాలు కూడా విస్మరించి యథాలాపంగా రాసేస్తుంటారు.
ఈ తాజా పలుకులోనే ఒక మాట రాశారు. తెలంగాణ ప్రజలను సంతృప్తి పర్చడం సులభమట. ఎపి ప్రజలు అంత తేలిగ్గా సంతృప్తిచెందరట. దీన్ని విశ్లేషిస్తే అర్థమయ్యేదేమిటి? నేను ఆ పని ఇక్కడ చేయబోవడం లేదు గాని కులాల ప్రాంతాల మధ్య సాధారణ సూత్రీకరణలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప రాతలో అందునా లక్షల మంది చూసే రాతల్లో వుండటం శాస్త్రీయం అనిపించుకోదు. మొదట కెసిఆర్‌ సమర్థత అంటూ మొదలు పెట్టి, ఆడుతూ పాడుతూ పాలిస్తున్నారని చెప్పి చివరాఖరుకు ప్రజలు తేలిగ్గా సంతృప్తి చెందుతారంటే ఏమని అర్థం చేసుకోవాలి? కెసిఆర్‌తో సమానంగావ్యూహాలు రచించగలిగిన వారు తెలంగాణలో ఎవరూ లేరనే పొగడ్త బాగానే వుంది గాని ముఖ్యమంత్రిగా వున్నవారి అనుకూలతలూ అందులోనూ ఉద్యమ నాయకుడుగా వచ్చిన నేపథ్యం ఇతరులకు ఎలా కలుగుతుంది?
ఈ తాజా పలుకులో తమాషాలు వైరుధ్యాలు ఇంకా వున్నాయి గాని ఒకటి రెండు మాత్రమే ప్రస్తావిస్తాను. అమరావతిలో శంకుస్థాపన, ఎవోబిలో పెను ఎన్‌కౌంటర్‌ విమర్శలకు దారితీసినా ఆర్కే వాటి జోలికి పోలేదు. అది ఆయన అభీష్టం. గతసారి వెంకయ్య మినహా దిక్కు లేదన్నట్టు రాసిన దాన్ని పునరుద్గాటించకపోవడం కూడా ఓకె. కాని ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి విజయం సాధింది పరిపాలనలో కొనసాగడానికి ఏం చేయాలనే సలహాలు ఇవ్వడం పత్రికల సంపాదకుల బాధ్యత అవుతుందా? ప్రజల కోణంలో ఫలానాది చేయాలని చెప్పడం వేరు, ఫలానా జాగ్రత్తలు తీసుకుని మీరే గద్దెపై కొనసాగాలనే ఆకాంక్షను సూచించడం వేరు. రెండో పని మీడియాది కాదు, రాజకీయ పార్టీలది. తీర్పునిచ్చే ప్రజలది. అందులోనూ నిశితంగా వుంటారని పేరున్న ఆర్కే వంటి వారు పాలక పక్ష హితబోధల బాధ్యత తీసుకోవడం వారి ఇమేజికి సరిపడదు. కొసమెరుపు ఏమిటంటమెగా ఆక్వాపార్కు విషయంలో ప్రభుత్వ వైఖరిని విమర్శించడం. గతంలో సిపిఎం వంటి పార్టీల ఆందోళనలే తప్పన ్న ఆయన సర్కారీ తప్పును కూడా గుర్తించడం మంచి విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *