గల్లిలో చెల్లిపెళ్లి- జరగాలి మళ్లిమళ్లి!
తనికెళ్లభరణి వేషాలన్నిటిలోనూ నాకు పదే పదే గుర్తుకు వచ్చేది యమలీలలో రౌడీకవి కవిత. గల్లిలో చెల్లిపెళ్లి- జరగాలి మళ్లిమళ్లి తతంగం. ఎన్టీఆర్ యమగోలలో కూడా ఒక డైలాగు వుంటుంది. శ్రీరామనవమి రోజున సీతారాములకళ్యాణానికి వెళదామని తల్లి పిలిస్తే ‘ మీ రాముడికి వేరే పని వుండదా ఏటేటా పెళ్లి, మళ్లీ అదే పెళ్లికూతురు’ అంటాడు అభినవ తారకరాముడు. సరే ఆవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే అక్టోబరు 28న అమరావతిలో మరో విడత శంకుస్థాపన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేస్తారట.ఇప్పటికి ఎన్ని భూమిపూజలు, ఎన్ని శంకులూ ఎన్ని ప్రారంభాలూ ఎన్ని ప్రవేశాలూ జరిగాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా గుర్తుంటం కష్టమే. ఎప్పుడూ ఏదో జరుగుతున్నట్టు కనిపించడానికి తప్ప ఈ తతంగం దేనికి? అంతేగాక ప్రత్యేకహౌదాను సమాధి చేసి ప్యాకేజీ ప్రహసనం నడిపిన అరుణ్జైట్టీని ప్రత్యేకంగా గౌరవించుకోవాలని ప్రభుత్వం భావించినట్టు కనిపిస్తుంది.ఈ సందర్భంలో ఆయనకు లెక్కలు చూపించడంకోసం కసరత్తు చేస్తుంటే ఒకరిలెక్కలు మరొకరితో ట్యాలీ కా
వడం లేదట. వెంకయ్య నాయుడుకు ఎలాగూ రోజూ సన్మానాలూ భజనలూ జరుగుతూనే వున్నాయి గనక జైట్లీని సత్కరించుకోవాలని చంద్రబాబు భావన కావచ్చు.శుభం.
అయితే ఆదిలోనే హంసపాదులా నిన్న బుధవారమే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తన స్విస్ ఛాలెంజి టెండరు నోటీసు వెనక్కు తీసుకుంటున్నట్టు తెలియజేసింది.ఇంతకు ముందు కూడా రెండు సార్లు వెనక్కు వచ్చి సమయం తీసుకుని నానాతంటాలు పడటం గుర్తుండేవుంటుంది.కోర్టు అక్షింతల తర్వాతే ఎపిఐఐసి ఎనేబిలింగ్ యాక్ట్‌లోనూ మార్పులు చేశారు.ఆర్డినెన్సు తెచ్చారు. ఇప్పుడునోటీసును మారుస్తామంటున్నారు. అంటే గతంలో వచ్చిన ఆఫర్లు వెనక్కు పోయినట్టేనా? విధానపరంగా ఇంత గజిబిజి పెట్టుకుని పారదర్శకతకు పాతరేస్తూ శంకుస్థాపనలతో మురిపించడం అవసరమా అద్యక్షా?
koose gadida vacchi mese gadidani prabhavitham chesindani sametha. siggu, saram, manam, abhimanam ani konni vuntayani venkayya naiduki teliyadani anukovala?