భారత్‌కు పోర్చుగీసు సివిల్‌ కోడా?హవ్వ!

women_religion-331x304

1985లో షాబానో కేసులో సుప్రీం కోర్టు చాందసానికి వ్యతిరేకంగా మహిళలకు మేలు చేసే తీర్పునిచ్చింది.కాని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చాందసుల ఒత్తిడికి లొంగి ఆ తీర్పు స్పూర్తిని దెబ్బతీసే విదంగా ముస్లిం మహిళల భరణం బిలు 1986్ల తీసుకొచ్చారు. ఆ కొనసాగింపుగా హిందూ చాందసులను సంతృప్తిపర్చేందుకు అయోధ్య రామమందిరం/బాబరీమసీదు తలుపులు తెరిపించారు. తర్వాత పరిణామాలు తెలిసినవే. తర్వాత 2002లో షామిర్‌ అరా అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు మరో మంచి తీర్పునిచ్చింది. 2005లో గృహహింస నిరోధ చట్టం వచ్చింది.మహిళల మతంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించే చట్టమది. ప్రస్తుతం మహిళా కార్యకర్తలు స్వచ్చంద సంస్థలు ముస్లిములతో సహా ఏమతం మహిళలకోసమైనా గృహ హింసచటాన్ని వారి విషయంలో 2002,2005 చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల సైరాబాను అనే మహిళ తనకు భర్త తలాక్‌ పోస్టులో పంపించాడంటూ కోర్టులో కేసు వేశారు. ముస్లిం మతంలో పురుషాధిక్యతను సవాలు చేయడమే గాక దేశంలో ముస్లిములందరూ భారత మాతకు జై అనాల్సిందేనని ఆమె టీవీ ఇంటర్వ్యూలలో చెప్పడం బాగా ప్రచారమవుతున్నది.

ే ఈ దేశంలో ముస్లిములకే గాక ఇతర మతాల వారికి కూడా వారి వారి వ్యక్తిగత చట్టాలున్నాయి. కొన్ని విషయాల్లో ఇస్లామిక్‌ వివావ వ్యవస్థ కల్పించే రక్షణలు హిందూ వివాహాలలో వుండవు. ఉదాహరణకు పురుషుల బహుభార్యత్వం ఆ మతంలో చట్టబద్దం. తలాక్‌కు చెల్లుబాటవుతుంది. కాని వివాహ సమయంలోనే భార్య పోషణకు సంబంధించిన మొత్తాన్ని మెహర్‌గా ఇవ్వడం వుంటుంది.విడిపోతే బహుభార్యలకు కూడా భరణం వుంటుంది. హిందూ మతం విషయంలో బహుభార్యత్వం చట్టబద్దం కాకున్నా అనుమతి తీసుకునో లేకుండానో చేసుకుంటూనే వుండటం చూస్తాం. అయితే దాని వల్ల నష్టపోయేది మా500_f_107908613_7vrjeqco2ts6m32fng87q0ugzyqtm82jత్రం ఆ మహిళ. ఏమంటే మొదటి భార్యకు తప్ప రెండవ భార్యకు భరణం చట్టబద్దం కాదు!ఇటీవలే సుప్రీం కోర్టుదీన్ని కూడా సవరించింది. అలాగే విడాకులు తీసుకున్న భార్యపట్ల భర్తకు ఎలాటి బాధ్యత వుండదు. కాని ఇస్లామిక్‌ చట్టంలో ఆమెకు భరణం ఇవ్వవలసివుంటుంది.బాల్య వివాహాల విషయంలో 84 శాతం హిందూ బాలికలు బలవుతున్నారు.ఆస్తిహక్యు వారసత్వం విషయంలో హిందూ స్త్రీలకు హక్కులు చాలా తక్కువ. ఇటీవలనే ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది గాని అవిభక్త హిందూ కుటుంబం అనే చట్టం వారిని పరాధీనతకు గురి చేస్తూనే వుంటుంది. అన్నిటినీ మించి హిందూత్వ వాదులు అమితంగా పూజించే మనుధర్మశాస్త్రం స్త్రీలను హీనాతిహీనంగా శాసించి అశక్తులుగా నమ్మదగని వారుగా అస్వతంత్రులుగా ప్రకటించింది! ే. క్రైస్తవ వివాహాల్లోనూ సమస్యలున్నాయి.

రాజ్యాంగం 44వ అధికరణం అందరి ఆమోదంతో ఏకరూప సివిల్‌ కోడ్‌ తీసుకురావాలని సూచించిన మాట నిజం. గోవానుంచి వచ్చిన రక్షణమంత్రి మనోహర్‌ పరిక్కర్‌, ో సీనియర్‌ మంత్రి వెంకయ్య నాయుడు వేంటివారు గోవాలో ఉండే ఉమ్మడి కోడ్‌ ను ఇందుకు నమూనాగా ప్రస్తావిస్తున్నారు. తమాషా ఏమంటే అక్కడ వున్నది 1939 పోర్చుగీసు సివిల్‌ కోడ్‌. ఆ రాష్ట్రాన్ని పోర్చుగీసులు పాలించారంటూ దాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడా క్యాథలిక్కులకే. అక్కడ హిందువులకు కొన్నివిషయాల్లో మరో కోడ్‌ వుంటుంది. ఉత్తర భారత దేశంలో హిందువులలో రక్త సంబంధీకుల వివాహాలు నిషిద్దం.దక్షిణ భారతంలో చెల్లుబాటవుతాయి. నాగాలాండ్‌ మేఘాలయ మిజోరాం వంటి చోట్ల కూడా భిన్నమైన కోడ్‌లు వున్నాయి. ఇక కాశ్మీర్‌లో షరియత్‌ నిబంధనలు చెల్లవు. ఆ మాటకొస్తే అమెరికా వంటి దేశంలో రాష్ట్రాల వారిగా చట్టాలు నిబంధనలున్నాయే తప్ప ఉమ్మడి సివిల్‌ కోడ్లు వుండవు. అలాటిది బలవంతంగా రుద్దడం తగదని 1960వ దశకంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రసిద్ధ న్యాయమూర్తి విఆర్‌కృష్ణయ్యర్‌ 2003లో రాసిన ఒక వ్యాసంలో ఈ అంశాలు చాలా వివరంగా చర్చించారు. ఈచర్చ మొదలైన తర్వాత కూడా కె.కన్నన్‌ అనే మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇది అందుకు సరైన సందర్భం కాదని రాశారు.తలాక్‌ను రద్దు చేయడంతో సహా స్త్రీల కోణంలో ఆలోచించాలి తప్ప హిందూత్వ భావనలతో ఉమ్మడి కోడ్‌ సమస్యను తెచ్చి కలగాపులగం చేయొద్దని సిపిఎం సూచించింది. బిజెపి కావాలనే ఈ కందిరీగల తుట్టను కదల్చిందని సీనియర్‌ నాయకుడు ఎం.కరుణానిధి వ్యాఖ్యానించారు. సైరాబాను కేసులో సుప్రీం కోర్టు అంతిమంగా ఏం చెబుతుందనేది ఆసక్తికరమైన విషయం. దాన్ని బట్టి ఈ చర్చ తర్వాత ఏ రూపం తీసుకునేది తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *