అమానవీయం తలాఖ్‌ – హిందూత్వ కోడ్‌ క్రీడ

talaq-bccl

ముస్లిం భర్త తన ఇష్టానుసారం మూడు సార్లు తలాఖ్‌ తలాఖ్‌ తలాఖ్‌ అంటే భార్యకు విడాకులిచ్చినట్టేనంటున్న ప్రస్తుత ముస్లిం పర్సనల్‌ లా( వ్యక్తిగత చట్టం)ను తప్పక సవరించాల్సిందే. చాలామంది మిత్రులు దీనిపై రాయాల్సిందిగా కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపిన అభిప్రాయం సరైందే. ఇందుకు భిన్నంగా అఖిలభారత ముస్లిం పర్సనల్‌ లా బోరు(ఎఐఎంపిఎల్‌బి) మత చాందసత్వంతో ఈ మూడు తలాఖ్‌ల పద్ధతి కొనసాగించాలంటూ అఫిడవిట్‌ దాఖలుచేయడం దారుణమైన విషయం. ముస్లింలు అన్నప్పుడు పురుషులే తప్ప మహిళల మనుగడ భద్రత గౌరవం ఈ బోర్డుకు అసలు పట్టవని తేలిపోయింది. నిజానికి మతం పేరు ఉపయోగించడమే గాని ఇస్లామిక్‌ దేశాల్లోనే ఈ మూడుసార్ల తలాఖ్‌ పద్ధతి అమలులో లేదు. పాకిస్తాన్‌తో సహా 22 దేశాలు దీన్ని రద్దుచేయడమో లేక బాగా కఠినమైన షరతులతో అమలును అసాధ్యంగా మార్చడమో చేశాయి. కాని లౌకిక దేశంగా చెప్పే మనం మాత్రం రాజకీయ కారణాల వల్ల మహిళా వ్యతిరేకమైన ఈ తలాక్‌ను కొనసాగిస్తుండడం విపరీతం. బిజెపి నేత, మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా వంటి వారు ఇస్లామిక్‌ సూత్రాల ప్రకారం తలాక్‌ను మరో విధంగా వినియోగించాల్సి వుంటుందని వివరిస్తున్నారు. కొందరు ముస్లిం మతపెద్దలు కూడా తలాఖ్‌ ఉద్దేశం ఇది కాదని ఏవో భాష్యాలు చెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు తలాఖ్‌ అనాలి తప్ప వెంటవెంటనే చెప్పేసి ప్రకటిస్తే చాలదని వారు వివరిస్తున్నారు. ఇలాtalaqth12-tahir-muslim__2928715fటి సన్నాయి నొక్కులు ఎలా వున్నా మౌలికంగా ఈ తలాక్‌ పద్ధతే తప్పు. అమానవీయం. మహిళా వ్యతిరేకం. ఇదే గాకుండా ఇస్లామిక్‌ సూత్రాల ప్రకారం భర్త నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. భార్య తప్పక ఏక భర్త్రత్వం పాటించవలసిందే. దీనిపై కేరళ హైకోర్టు న్యాయమూర్తి బి.కుమార్‌ పాషా కొంత కాలం కిందట కేసు విచారిస్తూ స్త్రీలకు మాత్రం ఎందుకు బహుభర్త్రుత్వాన్ని అనుమతించరని తమాషాగా అడగగడం దుమారానికి కారణమైంది.ఎందుకంటే ఇదే గాక ఇంకా లనేక అంశాల్లో ఇస్లామిక్‌ చట్టాలు షరియత్‌ వంటివి స్త్రీల అణచివేతకు కారణమవుతున్నాయి. వారికి ఓటు హక్కు కూడా ఇవ్వని దేశాలున్నాయి. ఇలాటి వివక్షలు ఎక్కడ ఏ రూపంలో వున్నా నిర్మూలించవలసిందే.

అయితే హిందూత్వ వాదుల్ల తలాఖ్‌ చర్చలో స్త్రీల విముక్తికోణం కన్నా ఇస్ల్‌ాంలోనే దురాచారాలున్నాయని చెప్పే తాపత్రయం చూస్తాం. .దీన్నీ యూనిఫారం సివిల్‌ కోడ్‌ (యుసిసి)ను కలిపి చర్చకు తెస్తుంటారు. ఇవి రెండూ వేర్వేరు అంశాలు. భిన్న విశ్వాసాలున్న చోట ఆమోదయోగ్యమైన ఉమ్మడి సివిల్‌ కోడ్‌ రావాలంటే సమయం పడుతుందని రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు. కనుకనే వారు ఉమ్మడి(కామన్‌) అనకుండా ఏకరూప(యూనిఫాం) అన్నారు. ఈ రెండు పదాలకు తేడా ఏమంటే ఉమ్మడి అన్నప్పుడు అందరికి ఒకటే విధానం అమలు కావాలి. ఏకరూప అంటే ఒక విషయంలో ఒకరికి ఏ సూత్రం పాటిస్తారో దాన్ని ఇతరులకూ అనువర్తింపచేయాలి. కాని ఒకేదేశం-ఒకే ప్రజ- అంటూ ఒకే మతం విశ్వాసాలు అందరూ పాటించాలని చెప్పే హిందూత్వ వాదులు ఈ కీలకమైన తేడాను గుర్తించడానికి నిరాకరిస్తారు. ఉన్న ఫలానా ఉమ్మడి సివిల్‌ కోడ్‌ తీసుకురావాలనే రాజకీయ ప్రచార నినాదం ఎత్తుకుంటారు. 1989 లోక్‌సభ ఎన్నికలలోనే వారు మూడు నినాదాలు ముఖ్యంగా తీసుకున్నారు- ఒకటి కామన్‌ సివిల్‌ కోడ్‌, రెండు అయోధ్య రామమందిర నిర్మాణం, మూడు కాశ్మీర్‌ 370 అధికరణం రద్దు. ఈ మూడింటిలోనూ వున్న మతపరమైన కోణాలు ఎవరికైనా అర్థమయ్యేవే.మళ్లీ . ఈ మూడు నినాదాల్లోనూ అవకాశవాదమే. 370వ అధికరణంపై పట్టుదలగా వుంటే కాశ్మీర్‌లో పిడిపితో కలసి ప్రభుత్వంలో పాల్గొనే అవకాశమే వుండదు. అయోధ్యకు ఎన్నికలతో సంబంధం లేదనేవారు ఇప్పుడు యుపి ఎన్నికలకోసమే మళ్లీ బయిటకు తీశారు.ఈ క్రమంలోనే వారి మూడవ మౌలిక నినాదమైన ఉమ్మడి సివిల్‌ కోడ్‌ కూడా ముందుకు తెచ్చే పరిస్థితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ దేశ నేపథ్యం రీత్యా ఇది అనేక చిక్కులతో కూడుకుని వుంది. కాబట్టే ఆచితూచి అడుగేయాలి. దీనికి సంబంధించిన కేసుల పూర్వాపరాలు, సమస్యలు మరో భాగంలో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *