కేంద్రం గాలి తీసిన కార్యదర్శి

indias-ambassador-to-the-us-s-jaishankar
సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఇదే మొదటిసారి అంటూ వూగిపోతున్న కేంద్ర మంత్రుల గాలి తీసేశారు ఆ ప్రభుత్వ కార్యదర్శి. అదికూడా చాలా కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి. మామూలుగా ఈ శాఖలో అధికారులకు ఆచితూచి మాట్లాడ్డం అలవాటవుతుంది. వారి నోట వచ్చే చిన్న పొరబాటు కూడా దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తుందని వారికి తెలుసు. ఇలాటి శాఖ కార్యదర్శిగా వున్న ఎస్‌.జైశంకర్‌ స్వయంగా చెప్పిందేమంటే గత ప్రభుత్వాల హయాంలోనూ ఇలాటి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగాయి అని. అయితే ఆ ప్రభుత్వాలు పైకి ప్రకటించలేదు.అవసరమైన పని చేసుకుపోయాయి.ఇప్పుడు ఆ విషయం ఘనంగా ప్రకటించడమేగాక రాజకీయ ప్రచారానికి వాడుకోవడం జరుగుతున్నది. అంతే తేడా. ఈ సంగతి గతంలో దాడులు జరిగిన తేదీలు మీడియాలో వివరంగా వచ్చినా హిందూ లాటి పత్రికలు ఆ నాటి ఉత్తర్వుల ప్రతులు ప్రచురించినా బిజెపి నేతలు గాని మంత్రులు గాని తమ ధోరణి మార్చుకోలేదు. మరి ఇప్పుడు వారి సర్కారులో కీలక అధికారి చెప్పిన దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. అందులోనూ ఆయన ఏకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు చెప్పారంటే అన్ని విధాల ఆలోచించి గాని మాట్లాడరు. పార్లమెంటరీ కమిటీ ముందు తప్పు మాట్లాడటం తమ బాధ్యతలను భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందని వారికి తెలుసు. సో- ప్రధాని మోడీగారి బృందం ఇకనైనా తమ బూటక ప్రచారాలను బూకరింపులను కట్టిపెట్టడం మంచిది. ప్రతిపక్షాలకు ఉద్దేశాలు ఆపాదించినంత తేలిగ్గా తమ శాఖాధిపతులపైన కూడా బురద వేయాలనుకుంటే అప్పుడు ప్రభుత్వానికే పరువు నష్టం.అయినా భాth08_document1_wat_3039440fరత దేశం ఇప్పుడే పుట్టినట్టు దానికి సైన్యం ఇప్పుడిప్పుడే ఏర్పడినట్టు వారు మొదటిసారి ఏదైనా చర్య తీసుకున్నట్టు మాట్లాడ్డం ఎంత హాస్యాస్పదం? ఇది మాత్రం సైన్యం స్థయిర్యాన్ని దెబ్బతీయదా? నిన్న తమ సీనియర్లు చేసిన ఆపరేషన్‌ను తక్కువ చేస్తున్న ఈ సర్కారు రేపు తాము చేసిన పోరాటాన్నీ కూడా అదే గతి పట్టించవచ్చుననే సందేహం వారికి కలిగితే దేశభద్రతకే అది ముప్పు కదా?కాని ఈ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రచారానికి పాకులాడినంతగా దాని పర్యవసానాలను గురించి ఆలోచించదు కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *