ఆక్వాపార్కుపై బాబు,వపన్‌ భిన్న స్వరాలు

telugu-actor-turned-politician-pawan-kalyan-attacks-tdp-and-bjp-cmn-chandrababu-naidu-not-happy-about-it-indialivetoday
్త పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందనలు పూర్తి భిన్నంగా వున్నాయి. ఈ పార్కుకు పూర్తిగా మద్దతు తెల్పడమే గాక దానిపై నిరసన తెలిపేవారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. చేపల చెరువుల కోసం భూములతీసుకుని ఫ్యాక్టరీ నిర్మాణం తలపెట్టిన వారిని బలపరుస్తూ దాని శంకుస్తాపనకు వస్తానని హామీ ఇచ్చారు. మరోవైపున పవన్‌ కళ్యాణ్‌ అభివృద్ది పేరుతో ప్రజలకు బాధలు కలిగించడం సమంజసం కాదని ఆ బాధిత గ్రామాల ప్రతినిధులతో అన్నారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కారం సాధించడానికి జనసేనగా తమ వంతు చేయగలిగింది చేస్తానన్నారు.. అభివృద్ధి పేరిట అమలు జరిగే విధానాలు ప్రజలు భయపడే పరిస్థితి తీసుకురావడం సరికాదని కూడా వ్యాఖ్యానించారట. ఈ పార్కు విషయంలోన చాలాకాలంగా ే వామపక్షాలు ఆ గ్రామాల ప్రజలూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగానే వెళ్లిన సిపిఎం నాయకులు పి.మధు తదితరులను అరెస్టు చేయడమే గాక పోలీసులు దారుణంగా వ్యవహరించడంపై తెలకపల్లి రవి.కామ్‌లో చెప్పుకున్నాం. ఈ పార్కు వల్ల 35 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని, తాగు సాగు నీటి వనరులు కలుషితమై జీవితాలే దెబ్బతింటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి మాట అటుంచి చిన్నకారు రైతులు మత్స్కకారులు వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుంది. ఈ సమస్యపై స్థానికులు, ౖ బాధితులు కాకినాడ ఆత్మగౌరవసభలోనే పవన్‌ కళ్యాణ్‌కు వినతిపత్రం ఇచ్చారు. సమయం తీసుకుని మరోసారి వివరాలు తెల్పినప్పుడు ఆయన స్పందించారు. తాను దీనిపై పర్యావరణ నిపుణులతోనూ అధికారులతోనూ మాట్లాడుతున్నానని కూడా ఆయన తనను కలిసిన వారితో చెప్పారు. పరిస్థితి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అక్కడ పర్యటించాలని కోరితే సానుకూలంగా స్పందించారట. మరి మధును అరెస్టు చేసిన ప్రభుత్వం ఆయనను కూడా అరెస్టు చేస్తుందేమో తెలియదు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతంలో భూముల సమీకరణ సమస్యలు స్వయంగా పరిశీలించేందుకు వెళ్లినట్టే ఇప్పుడు ఆయన భీమవరం వెళ్లవచ్చు. కాటమరాజు సినిమా షూటింగు పెట్టుకున్నా ప్రజల సమస్యలపై కొంతైనా స్పందించాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. . సినిమాలు తన వృత్తి అనీ, జీవిత వ్యయం కోసం నటిస్తానని ముందు చెప్పారు గనక మరెవరో ఆ అంశం చెప్పడానికి లేదు. . ఎంపిలు ఎంఎల్‌ఎలే గాక మంత్రులూ ముఖ్యమంత్రులు కూడా వ్యాపార సంస్థలలో కూరుకుపోయి ఆ లాభనష్టాలు సంపదల భాషలో మాట్లాడ్డం చూస్తున్నాం. కనుక ప్రసిద్ధుడైన ఒక నటుడు నటించడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ఒకప్పుడు నేను సినిమాలైనా చూసుకో రాజకీయాల్లోకైనా రమ్మన్నమాట నిజమే.ఇప్పుడున్న నాయకులే పెద్ద పనిలేక వ్యర్థ వివాదాల్లో మునిగితేలుతున్నారు గనక ఆయన సినిమాల్లో నటిస్తూనే వీలైన మేరకైనా సమస్యలపై స్పందిస్తూ మిగిలిన సమమయంలో అధ్యయనం చేస్తే మంచిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *