కెసిఆర్, చంద్రబాబు భిన్న ప్రయోగాలు

మౌలికంగా ఒకే ‘స్కూలు’ నుంచి వచ్చిన వారు గనక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ల ఆర్థిక రాజకీయ వ్యూహాల్లో చాలా సారూప్యతలు కనిపిస్తుంటాయి. అయితే పరిస్థితుల మనస్తత్వాల తేడా కూడా బలంగానే ప్రభావం చూపిస్తుంటుంది. అన్నిటిని మించి ఉభయులూ సామాజిక కోణానికి చాలా ప్రాధాన్యత నిస్తారు గనక ఆ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సాపత్యం వుండదు.
ప్రస్తుతానికి వస్తే దసరా సందర్బంలో ఉభయులూ నవశకం మొదలైనట్టు ప్రకటించారు. ఒకరు రాజధాని మార్పు,మరొకరు జిల్లాల పెంపు అందుకు కారణంగా చూపారు. సానుకూల ఫలితాలు కోరుకోవడం తప్ప శ్రీకారం చుట్టుకుంటున్న దశలోనే వీటిపై విమర్శలు అవసరం లేదు. తర్వాత వివరంగా విశ్లేషించుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఉభయులూ అనుసరించిన భిన్న వ్యూహాలను గమనించాల్సి వుంటుంది. జిల్లాల్లో ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన పట్టణాలతో సహా విస్త్రత పునర్వ్యవస్థీకరణ వ్యూహం కెసిఆర్ అనుసరించారు. అంటే 31 జిల్లాల్లో కొన్ని పట్టణాలు ప్రధానంగా పెరిగితే వాటి చుట్టూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావచ్చనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. దానికి తోడు ఆయన సిద్దిపేటలో అన్నట్టు ఫ్యూడల్ పెత్తనం పోవాలని మొదటిసారి అన్నది ఒక సామాజిక తరగతిని దృష్టిలోపెట్టుకునేనంటున్నారు. ఈ కోణంలో ఆయన ప్రత్యర్థులు కూడా ఈ జిల్లాల విభజనను సమర్థిస్తున్నారు.
చంద్రబాబు జిల్లాల విభజన ఆలోచన లేదని చెప్పడంలో కొత్త సమస్యలు తెచ్చుకోవడం వద్దనే భావనతో పాటు సామాజిక ప్రభావాలు ప్రతికూలంగా వుంటాయనే అంచనా కూడా వుంది.విజయవాడ గుంటూరు వంటి ప్రముఖ నగరాల మధ్య అమరావతిని రాజధానిగా ఎంచుకోవడంలో ఆయన వ్యూహం మూడు నగరాలను కలిపైనాహైదరాబాద్ వంటి మహానగరం దరిదాపులకు చేరే ప్రయత్నం వుంది.మొన్న తెలకపల్లిరవి.కామ్‌లో చెప్పుకున్నట్టు బేసిక్ జనాభా పెరిగితే తప్ప నగర వాతావరణం రాదని ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవని ఆయన బృందం ఆలోచనగా వుంది. అంటే ఇక్కడ మూడు నగరాల విలీనం ద్వారానైనా హైదరాబాద్ ప్రయోగాన్ని పునరావృతం చేయాలని ఆయన ఆశిస్తున్నారు. అయితే అది కూడా చాలా చాలా సమయం తీసుకుంటే గాని తేలదు.ఏమైనా వున్న జిల్లాలను విభజించడం ద్వారా అభివృద్ధి అనేది కెసిఆర్ వ్యూహానికి ే క్రిడా పేరిట చాలా విశాల ప్రాంతాన్ని కలిపి ఒక పెద్ద ఆర్థిక నగరంగా మార్చాలనేది చంద్రబాబు పథకానికి వున్న తేడా ఆసక్తికరమైంది.
Fire engine red color lo undataniki, VVIPlani ahvaninchadaniki vese carpet red gaa undataniki sambandham vethiki kalipinattu undhi.