కృష్ణమ్మ క్యాసినో…కెఆర్‌కాంట్రాక్టు..

trnstry

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కాకినాడ రాజమహేంద్రవరం రోడ్డు కాంట్రాక్టరుగా వున్న ట్రాన్స్‌ట్రారు(అంటే గతంలోనూ ఇప్పుడూ పాలకపక్ష ఎంపిగా వున్న రాయపాటి సాంబశివరావు గారి తాలూకూ) పట్ల పక్షపాతం చూపిస్తున్నట్టు సాక్షాత్తూ ప్రపంచ బ్యాంకు మండిపడింది. 2013-2016 మధ్య ఆరు శాతం పనులు మాత్రమే చేసిన ఈ కాంట్రాక్టు సంస్థను మార్చకుండా కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి విసిగి పోయిప్రాజెక్టుకు ఇచ్చే రు.200కోట్ల రుణం ఇవ్వలేమని ప్రకటించినట్టు ఈనాడు వార్త ఇచ్చింది. మూడుసార్లు ఈ విషయమై సూచించినా స్పందన లేదు గనక నిష్క్రమిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ స్పందన ఇంకా తెలియదు గాని ప్రతిష్టకు మాత్రం దెబ్బ తగిలింది.ఇప్పుడు పోలవరం మూడేళ్లలో పూర్తిచేయడానికి కూడా ఈ కంపెనీపైనే ప్రభుత్వం ఆధారపడి వుండటం కొసమెరుపు.

మరోవైపున విజయవాడ సమీపాన కృష్ణానదిలోని భవానీ ద్వీపంలో పేకాట శిబిరం(క్యాసినో) ఏర్పాటు చేస్తానంటూ అమెరికాలోని శివప్రకాశ్‌ బొబ్బా అనే ఎన్‌ఆర్‌ఐ చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వున్నట్టు హిందూ పూర్తి వివరాలతో మొదటి పేజీ కథనం ఇచ్చింది. దీనికోసం 1974 గేమ్స్‌ చట్టాన్ని సవరించాలట.గోవా తరహాలోనే క్యాసినోలను పెంపొందించే మరో ఆయిదారు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో వున్నాయట. వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రాజెక్టుల కన్సల్టెంటు కె.లక్ష్మీనారాయణ చెబుతున్నారు. సింగపూర్‌ లోని సెంటోసా ద్వీపం తరహాలోనే అమ్యూజ్‌మెంట్‌ పార్కు అభివృద్ది చేయాలనిtrans222 ఆలోచిస్తున్న ప్రభుత్వ పథకాలకు ఇది బాగా సరిపోతుందంటారు బొబ్బా. కాని కృష్ణా ద్వీపాన్ని పేకాట డెన్‌గా మార్చడంపై స్థానికులు విముఖంగా వున్నారు. పెట్టుబడుల సమీకరణకు ఇది మార్గం కాదని కూడా అంటున్నారు

ఇది ఇలా వుంటే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం నాడు సంపాదకీయంలో ప్రభుత్వం పెద్ద కార్పొరేషన్లనే దృష్టిలో పెట్టుకుంటూ చిన్న వ్యాపారులను ఉత్పత్తిదారులను విస్మరిస్తున్నదని తప్పు పట్టింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కితాబులు బడా వ్యాపార సంస్థలకే గాని ఇలాటి వారికి ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *