కాంట్రాక్టు విధానానికే నోబెల్‌లో సంకేతం

nob-kdc-621x414livemint

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన అలివర్‌ హర్ట్‌, బెంట్‌ హాల్మ్‌స్టామ్‌లు వివిధ రంగాల్లో సంస్థల్లో కాంట్రాక్టు విధానాలకు సంబంధించి పరిశోధన చేశారు. వ్యాపార కాంట్రాక్టులకంటే కార్మికులు ఉద్యోగులకు సంబంధించిన వాటిపైనే ఈ పరిశోధన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.గతంలోనూ వీరు ఇలాటి పత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు.ఉదాహరణకు సంస్థ దీర్ఘకాలిక పరిస్థితి చూడకుండా తాత్కాలికంగా ఉత్పత్తి పెరిగిందని బోనస్‌ ఇస్తే తర్వాత చిక్కులు వస్తాయని వాదించారు. అమెరికాలో 2008లో వచ్చిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభానికి కూడా ఇలాటి కారణాలే ప్రధానమన్నారు. దీర్థకాలికంగా గాక కొన్నిగంటల పాటు మాత్రమే పనిచేయించుకోవడానికి చేయడానికి వెసులు బాటు వుండొచ్చని వాదిస్తారు.ఇలాటివి వీటిలో ఇంకా చాలా వున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టు విధానంతో పనికి భద్రత లేక శ్రమజీవులు ఘోషిస్తుంటే ఆ విధానాన్ని మరింత విస్త్రతం చేసేందుకు ఉద్దేశించిన ఈ థియరీకి నోబెల్‌ రావడం దేనికి సంకేతమో వేరే చెప్పాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *