.అప్పుడు ఎంజిఆర్ అచ్చం ఇలాగే! .కేంద్రం సహకారంతో గూడుపుఠానీ .కుటుంబాలు ముఠాల పాలన ఫలితం.ఆస్వస్థ ప్రజాస్వామ్యం!

చెన్నై అపోలో ఆస్పత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతుపట్టని పరిస్థితి చూస్తుంటే 80లలో ఆమెకు ప్రేరకుడైన ఎంజిరామచంద్రన్ చివరి దశ గుర్తుకు వస్తుంది. అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు లేవు గనక జయలలిత అస్వస్థ పర్వం అంతకంటే నాటకీయంగా నడుస్తున్నది. అంతస్సూత్రం మాత్రం ఒక్కటే.ప్రాంతీయ పార్టీలూ, ఏక వ్యక్తి కుటుంబ ఆధిక్యతలూ.. అంత:పుర కుట్రలూ అవాంఛనీయ శక్తుల ప్రాబల్యాలూ . అపరభగవంతుడుగా ో వెలుగొందిన పుట్టపర్తిబాబా చివర ఘట్టం ఈ సమయంలో కళ్లముందు కదలాడుతుంది. అప్పుడూ ఇప్పుడూ కూడా కేంద్ర రాష్ట్రాల్లో నాయకులు చూసి వస్తూనే వున్నారు. వైద్యశాలలు ఏవో సమాచారాలు విడుదల చేస్తూనే వున్నాయి. అయినా అనుమానాస్పదంగా.. అవిశ్వాసంలో అశేష.. ప్రజానీకం. ప్రజాస్వామ్యం.
సాయిబాబా సరే ఆధ్యాత్గిక సామ్రాజ్య నేత. జయలలిత తమిళనాడు ప్రజలుా ఎన్నుకున్ననాయకురాలు. అసలు ఆమెకు ఏమైంది? ఏమైనా అయివుంటే ఆమె స్థానంలో ఎవరు పాలిస్తున్నారు? ఇవన్నీ అనివార్యంగా . రావలసిన ప్రశ్నలు. సెప్టెంబరు22 నుంచి అంటే ఇప్పటికి పక్షం రోజులకు పైబడి కబురైనా లేని స్థితి. కాని ప్రపంచంలోనే పెద్దదైన లిఖిత రాజ్యాంగం గల ఈ దేశంలో సంబంధిత బాధ్యులెవరూ ఆ పనిచేయరు.కేంద్రం అడగదు, దాని ప్రతినిధిగా వున్న తాత్కాలిక గవర్నరు పెదవి మెదపరు. ఆమె నాయకత్వంలోని పార్టీ అయినా పారదర్శ
కంగా మాట్లాడదు. అంతా గప్‌చిప్‌గా గూడుపుఠానీ..
సినీనాటకీయ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడు ఇంతకంటే రసవత్తర క్రీడలే చూసింది. 1984 అక్టోబరులో హఠాత్తుగా ఒక అర్థరాత్రి ఇదే అపోలో ఆస్పత్రి ముందు ఆంబులెన్సు ఆగింది. ముఖ్యమంత్రి ఎంజిఆర్ ఎగశ్వాస దిగశ్వాసతో ప్రాణాంతకంగా ప్రవేశించారు. ఆయన చాలా కాలంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నారని తేలిపోయింది. ఇప్పట్లాగే తీవ్ర ఉత్కంఠ . అత్యంతే జనప్రియుడు గనక అంతులేని ఉద్రిక్తత. . ప్రధాని ఇందిరాగాంధీ కూడా వచ్చి పరామర్శించారు.ు.ఆ నెలాఖరుకు ఆమె దారుణహత్యకు గురై దేశం కల్లోలితమైంది. గవర్నర్ ఎస్.ఎం.ఖురానా సీనియర్ నాయకుడైన నెడుంచెజియన్‌కు ఎంజిఆర్ నిర్వహించే శాఖలు బదలాయించడమే గాక మంత్ర్‌ివర్గ సమావేశాలకు అద్యక్షత వహించే అధికారం అప్పగించారు. ఆయన తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష డిఎంకె నేత కరుణానిధి విమర్శించారు. కేంద్రం అనుకూలంగా వుంది గనక ఇబ్బంది లేకపోయింది. ఎంజిఆర్‌ను అమెరికాలోని బ్రూక్‌లీకి తీసుకెళ్లారు. ఆయన పేరిట ో అనేక నిర్ణయాలు అమలు జరిగాయి.పార్లమెంటరీ పార్టీ నేతగా జయలలిత తొలగింపు, మంత్రి తిరువక్కరుసు శాఖల తగ్గింపు వగైరా. నెడుంచెజియన్, ప్రధాన కార్యదర్శి వీరప్పన్, మరో మంత్రి పియుషణ్ముగం, ఎంజిఆర్ మొదటి భార్య జానకి దుష్టచతుష్టయంగా ఆయన పేరిట పెత్తనం చేస్తున్నారనే అందరూ భావించారు. ఈలోగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నాడిఎంకె పొత్తు పెట్టుకోవడం, ఇందిర హత్య ఎంజిఆర్ అనారోగ్యం రెండూ సానుభూతులతో అఖండ విజయం సాధించడం జరిగిపోయాయి. ఎంజిఆర్ నామినేషన్‌పై అక్కడే సంతకం చేశారని చెప్పారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన ప్రాణాలతో తిరిగి రావడం ప్రజలను ఆనందడోలికల్లో ముంచేసింది. కాని మాట లేదు, కదలికలు చాలా నామమాత్రం. అంతా ఆయన పేరిట సాగిన కొద్దిమంది ముఠా పాలన.చివరకు ఆయన 1987లో మరణించాక జయలలితను అంతిమశకటనం నుంచి దించేయడం,జానకిని ముఖ్యమంత్రిని చేయడం, తర్వాత తగాదాలు, చివరకు అసెంబ్లీ రద్దు దేశ రాజకీయాలల్లో ఒక జుగుప్సాకర ఘట్టంగా మిగిలిపోయాయి.
ఎంజిఆర మరణించాకే కరుణానిధి 1988 ఎన్నికల్లో గెలిచారు కాని ఆయనకూ భార్యలు పిల్లల వివాదాలు తప్పలేదు. 1991లో రాజీవ్‌గాంధీ కూడా అక్కడే హత్యకు గురికావడంతో కాంగ్రెస్ అన్నా డిఎంకెలు విజయం సాధించాయి. అప్పటి నుంచి ఈయన జయలలిత ఒకరితర్వాత ఒకరు పాలిస్తూ వచ్చారు. కేంద్రంలోనూ పొత్తులు అటూ ఇటూ మార్చేవారు. ఈ క్రమంలో జయను శశికళ వంటి స్నేహితులు అవినీతి ఆరోపణలూ ఆర్భాటాలు వెంటాడాయి.ఇక కరుణ ఇంట కుమారులు స్టాలిన్ అళగిరి తగాదాలు. మరోవైపు మారన్‌లగొడవ. తర్వాత కనిమొళి అరెస్టు వంటివి తమిళనాడు ప్రతిష్టకు మంచ్చ తెచ్చాయి.ఇవన్నీకూడా వాస్తవంలో కుటుంబాలు వ్యక్తుల కుటిల రాజకీయాల ఫలితాలే. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చేస్తూ ాి అన్నిరకాల అప్రతిష్టాకర వ్యవహారాలూ అనుమతించారు. చివరకు జయలలిత శిక్షకు కూడా గురై జైలుకు వెళ్లి ే బయిటపడ్డారు. వీటన్నిటి చాటునా తన అనారోగ్యాన్ని కప్పిపుచ్చుకుంటూ తనకు తనే హాని చేసుకున్నారు. 2015లోనే ఆమె చాలా రోజులు కనిపించకుండా పోయినప్పుడు అనేక కథనాలు వచ్చాయి..చెన్నై జలప్రళయం సమయంలోనూ కనిపించలేదంటే కదల్లేని అనారోగ్యమే కారణం. . ఎంజిఆర్ ఎప్పుడూ ఒకే మేకప్‌తో తన అసలు రూపాన్ని ఎంతగా దాచుకునేవవారో ఆయనకు అతి దగ్గరవాడైన డిజిపి ఒకరు సవివరంగా రాశారు. ఆధునిక మీడియాలో అది సాధ్యం కాదు గనకే జయలలిత సాధ్యమైనంత తక్కువగా బయిటకు కనిపిస్తూ క్లుప్తమైన లిఖిత పూర్వక ఆదేశాలతో పాలన నడిపిస్తూ వచ్చారు. చివరకు ఇప్పుడు ప్రాణాంతకస్థితిలో పడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సానుకూలంగా వుంది గనక పూర్తి సమాచారం లేకున్నా కాలం గడవనిస్తున్నారు. ఆమె గురించి వస్తున్న వదంతులలో ఏది ఎంత నిజం అనేది ఎలా వున్నా పాలనకు సబంధించిన మధ్యంతర ఏర్పాట్లు అనివార్యమే. అనధికారిక తరహాలో తప్ప రాజ్యాంగ బద్దమైన సమగ్ర పద్ధతులను పాటించడం లేదు. ా ఇక్కడ వ్యక్తిగా జయలలిత మాత్రమే గాక వ్యవస్థగా ప్రజాస్వామ్యమే ఆస్పత్రి పాలైనట్టు చెప్పాలి. ఎంత నిగూఢంగా నడిపించినా రేపో మాపో విషయాలు బయిటకు రాకుండా పోవు.
ప్రార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, కుటుంబ సభ్యులు అస్మదీయులకు ప్రభుత్వాలు ధారాదత్తం కావడం వల్ల ఉత్పన్నమైన వికృత పరిస్థితి ఇది. దేశాధినేతల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం కావచ్చు గాని రాష్ట్రాల పాలకులకు సంబంధించిన ఈ గోప్యత కేవలం ముఠాలు, ముల్లి వ్యవహారాల ఫలితమే. సోనియా గాంధీ కాన్సర్ గురించి కూడా చాలా ఆలస్యంగా గాని వెల్లడించలేదు. యుపిలో ఇటీవల ముఖ్యమంత్రిని కూడా కాదని ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్ చర్యలతో పుట్టిన ముసలం గాని, బీహార్‌లో పశుగ్రాసం కుంభకోణం సమయంలో లాలూ యాదవ్ పాచికలు గాని, ఇంకా చాలా ఉదాహరణలున్నాయి. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ తన పరిస్థితి సరిగ్గా లేనప్పుడ గవర్నర్ ు రాజీనామా లేఖ తీసుకున్నారని కేసు వేయడం కూడా ఇలాటి సందర్భమే.( అయితే తెలుగుదేశంలో తిరుగుబాటుతో ఆయన అప్పటికే బలం కోల్పోయారనేది వేరే విషయం.) ఇవన్నీ గాక పాలకుల ఆరోగ్యాల గురించి ప్రతిపక్షాలలో కొందరు నిరంతరం ఉత్తుత్తి కథలు చెబుతూనే వుంటారు. వారి వారసుల మధ్య నిరంతర ప్రత్యక్ష పరోక్ష యుద్ధం జరుగుతూనే వుంటుంది.ప్రజలు ఒక పార్టీని ఎన్నుకుంటారు. ఆ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతులలో నాయకుణ్ని ఎన్నుకోవడం, రాజ్యాంగ బద్దంగా సమిష్టి సూత్రంతో పాలించడం జరగాలి. అయితే . సిపిఎం బిజెపి(మోడీ మినహా) ి వంటి పార్టీలను మినహాయిస్తే ో ఏకవ్యక్తి ఆధిపత్యం కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతుంటాయి గనకనే ఆ ఒక్క నేత మనుగడ మొత్తం తలకిందులు చేస్తుంది. నిజానికిది వాంఛనీయం కాదు. జయలలిత కోలుకోవాలని, అలాగే మన ప్రజాస్వామ్యం కూడా ఈ వక్రీకరణలు అధిగమించాలని కోరుకుందాం.
ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి, గమనం 7,10,16
Hello! My name is MaryMarkova, our compane need to advertise on your website. What is your prices? Thank you. Best regards, Mary.
o
Thank you. sending soon. may i know your company please?