తిట్టానంద పండిత శూరులు!

స్త్రీలను అందులోనూ వితంతువులను అపహాస్యం చేసే శ్లోకం ప్రస్తావించడం సరికాదని నిన్న ఒక పోస్టు రాశాను. దానిపై కొంత మంది శక్తి కొద్ది నన్ను తిట్టి ఆనందిస్తున్నారు. అసహ్యం అంటే సహించలేనిది అని పండిత డిండిములు గాండ్రిస్తున్నారు. ఇంకా సమర్థించుకుంటున్నారు.ఎవరో లింకు పంపితే చూశాను. నాకు ఆసక్తి లేదు, ఎప్పుడూ చూళ్లేదు కూడా. నాకుభాష రాదంటే రాదనుకోండి. వేదఘోషలలోనే మునిగిపోకుండా తరతరాలస్త్రీల వేదనా ఘోషలు తెలిసి వుంటే నవ వైధవ్యం ఉపమగా తీసుకోరు. పోనీ సానుభూతిగా ఉదహరించారంటే అప్పుడు అది విమర్శకు వర్తించదు. లోకరీతి కన్నా నిఘంటువులను పట్టుకుని వేళ్లాడ్డంపండితుల లక్షణం . (పువ్వుల కంపు అంటే కూడా పూర్వం వాసన అని మాత్రమే అర్థం. పంచెను చీర అనే అంటారు.) అర్థం లేని సవాళ్లు మాని అసలు సారం గ్రహిస్తే మంచిది. లేదంటే లేదు. ఇలాటి వారి కోసమే శ్రీశ్రీచెప్పాడు- శ్మశానాల వంటి నిఘంటువులు దాటి రమ్మని. నేనూ వేదఘోషలు విన్నవాన్నే. పేదల ఘోషలూ తెలిసిన వాణ్ని. చిన్న సవరణ చేసుకోలేక అసందర్భ వాదనలతో కొనసాగించడం ఎందుకు? ఆ రాసిన వాళ్లను ఎంత తిట్టినా నాకేం అభ్యంతరం లేదు. ఇక నేను తెలంగాణకు వ్యతిరేకం అన్నప్పుడు ఒక్క అక్షరమైనా నా రాతల్లో చూపించమని ఎప్పుడో సవాలు చేశాను. దానికీ ఏదేదో రాశారు తప్ప చూపించింది లేదు. ఇప్పటికైనా సిద్ధమే. అటూ ఇటూ వున్న పైత్యకారులను మాత్రమే వ్యతిరేకించాను. ఇకముందూ వ్యతిరేకిస్తాను. నన్ను తిట్టుకుని ఆనందించదలిస్తే తక్కువగా రాస్తే వచ్చే నష్టం లేదు.నేనైతే విషయంతో సంబంధం లేకుండా ఎవరి గురించి అలారాయలేదు. వారం వారం సవాల్ రెడ్డి ఏం రాసినా నేనేం వ్యాఖ్యానించలేదు. ఇలాటి స్త్రీవ్యతిరేక శ్లోకాలు వద్దని మాత్రం మళ్లీ చెబుతూ, స్వస్తి!