‘అతడు’ ‘దేవాంతకుడు’.. వెంకయ్య నాయుడు గారు —అసత్యాన్ని కూడా మార్చేస్తుంటారు…
నిజం చెప్పకపోవడం అబద్దం. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అంటాడు అతడులో మహేష్‌బాబు(త్రివిక్రమ్ శ్రీనివాస్ సాక్షిగా). ఈ ముక్క గుర్తుపెట్టుకోండి
ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక సహాయంపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు మాన్యశ్రీ సీనియర్ కేంద్రమంత్రి వర్యులు మాన్యశ్రీ వెంకయ్య నాయుడు ఆ సభలో చాలా మందికి తెలియని దేవాంతకుడు సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు.యమగోలకు మాతృక లాటి దేవాంతకుడులోనూ ఎన్టీఆర్ యమలోకం వెళతారు. అక్కడ అసహాయ వితంతువు సూర్యకాంతంకు ఏదో శిక్ష వేస్తారు. ఏమంటే ఆమె ఏకాదశి నాడు ఉపవాసం వుండి కూడా ఏదో తినాలని అనుకున్నదట. అనుకుంటే పాపం ఎలా అవుతుందని హీరో ప్రశ్నిస్తాడు. పాపమే అంటాడు యముడు. అయితే నా పుణ్యం కొంత ఆమెకు ధారపోస్తానంటాడు. ఇతగాడి ఖాతాలో పాపం తప్ప పుణ్యం లేదంటాడు చిత్రగుప్తుడు. అదేమిటి నేను ఇందాక వచ్చేప్పుడు సత్రాలు కట్టించాలని దేవాలయాలు కట్టించాలని చాలా అనుకున్నాను అంటాడు. అనుకుంటే అయిపోతుందా అని అడిగిన సిహెచ్‌గుప్తా చిక్కులో పడిపోతాడు. వెంకయ్య నాయుడు ఈ సీనేమా కథ ఎందుకు చెప్పారంటే కాంగ్రెస్ ప్రత్యేక హౌదా ఇవ్వాలనుకున్నది గాని ఇచ్చేందుకు చట్టంలో పెట్టలేదు అని అపహాస్యం చేయడానికి. మరి మీ సంగతి అంతకంటే అధ్వాన్నం కదా సార్ అంటే ఆయనకు కోపం వచ్చేస్తుంది. అప్పుడు అడిగారు, తెచ్చామన్నారు,ఇస్తామన్నారు..ప్రణాళికలో పెట్టారు. ప్రధాని కాబోయే పెద్ద మనిషి సమక్షంలో ప్రచారం చేశారు. కాబట్టి దేవాంతకుడు కంటే చాలా అడుగులు వేసినట్టు కదా..తర్వాత ఇంతకాలం జరిగిందీ ఇప్పుడు జరుగుతున్నది ప్రజలు చూస్తూనే వున్నారు. ఇది దేవాంతకుడు తరహాలోకి వస్తుందో లేక అతడులో చెప్పిన అబద్దం/మోసం తరహాలోకి వస్తుందో వారే నిర్నయించుకుంటారు.
రాముడి బొ
మ్మతో ఓట్టు తెచ్చుకున్న పార్టీ అగ్రనేత ఆయనలా ఒక్క మాటకు -సత్యం కాకపోయినా అసత్యానికైనా – ఒక్క మాటకు కట్టుబడి వుండాలని ప్రజలు కోరుకుంటారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హౌదాకు ఒప్పుకోలేదని ఎన్నిసార్లు చెప్పారు? నీటి ఆయోగ్ చూసుకుంటుందని ఎన్నిసార్లు దాటేశారు? సాక్ష్యాలతో సహా నిరూపించడం పెద్ద సమస్య కాదు. నీటి ఆయోగ్ ఉపాద్యక్షుడు అరవింద్ పనగారియా స్వయంగా తమకు సంబంధం లేదని చెప్పాక గాని ఆ ప్రచారం ఆగలేదు.ఇక 14వ ఆర్థిక సంఘం ఆటంకమనేది అసత్యమని నేను 2016 మే29 మొదటి సారి వివరంగా తెలకపల్లిరవి.కామ్‌లో రాశాను. అప్పటి వరకూ ఆ తరహా చర్చ జరిగిందే లేదు. తర్వాత కూడా కొంత సమర్థన కొనసాగించారు. ఆఖరుకు అరుణ్‌జైట్లీ ఇదే వెంకయ్య నాయుడు తదితరులతో కలసి నిర్వహించిన ఉత్తుత్తి ప్కాకేజీ మీడియా సమావేశంలోనూ చెప్పడమే గాక అందుకు ఆధారంగా వుండే పేరాగ్రాఫులు విడుదల చేస్తామన్నారు. ఆ విడుదల చేసిన పేరాల్లో ఈ వూసే లేదని కూడా నేను గట్టిగా నిరూపించాను. ఇదంతా అయ్యాక ఇప్పుడుమన పెద్దాయన 14వ ఆర్థిక సంఘం వద్దన్నట్టు తాము చెప్పలేదంటున్నారు. అనుకోకుండా ఈ రోజు టివి తిప్పేప్పుడు ఒక ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా సరిగ్గా ఈ మాటలే వినపడ్డాయి.
నిజంగా వెంకయ్య నాయుడేగాక ఇంకా చాలా మంది పెద్దపెద్దవాళ్లు 14వ ఆర్థిక సంఘం ఆటంకమని చెప్పారా లేదా? దీన్ని కూడా క్లిప్పింగులతోనూ నిరూపించడం పెద్ద పని కాదు. అందుకే నేనంటున్నాను- అవాస్తవమైనా సరే ఒక దానికి కట్టుబడి వుంటే కొంతలో కొంతలో కొంత మెరుగని. లేకపోతే మహేష్‌బాబు డైలాగే వర్తిస్తుంది.
మరో పెద్ద అసత్యం.. అన్ని రాష్ట్రాలకూ వర్తించే అసత్యం!
14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు గొప్పగా కేటాయింపులు చేసిందని! అందులోనూ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు భారీగా పెరుగుదల వచ్చిందని. ఇవి రెండూ నిజం కాదు. ఈ కథనం ఇంకా చెప్పే బదులు గతంలో అంటే 2016 మే29న నేను చేసిన పోస్టింగులో కొంత భాగం ఇస్తున్నా..
రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతి ప్రభుత్వానికి సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి. ఎవరో ఒక వ్యక్తినో లేక వ్యవస్థనో బలిపశువును చేయాలి. ఇక్కడ ఆ భారం 14వ ఆర్థిక సంఘంపై పడింది. కొంతకాలం నీటిఆయోగ్ చూస్తుందని చెప్పినా తర్వాత ఆ మాట మార్చారు. ఎందుకంటే నీటి అయోగ్ ఇంకా ఉనికిలో వుంది. తమ ఆధ్వర్యంలోనే అంటే ప్రధాని అద్యక్షతనే నడుస్తుంటుంది గనక రేపైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది.అదే 14వ ఆర్థిక సంఘం అయితే ముగిసిపోయిన అధ్యాయం గనక ఏ బాద్యతా వుండదు.
ే. 14వ ఆర్థిక సంఘం ే. పేరులోనే వున్నట్టు 13 సంఘాల తర్వాత అది వచ్చింది. ఇది రాజ్యాంగం 280 వ అధికరణం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను నిర్ధారించే వ్యవస్థ మాత్రమే తప్ప రాష్ట్రాల విభజన వంటి ప్రత్యేకాంశాలతో సంబంధం వుండదు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వైవిరెడ్డి చైర్మన్‌గా 14 వ ఆర్థిక సంఘాన్ని 2013 జనవరి 13న నియమించారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సంబంధించిన నిర్ణయం ప్రకటించలేదు. దానికి ఇచ్చిన పరిశీలనాంశాలలో( టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్)లో ప్రత్యేక హౌదా అన్న అంశమే లేదు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో తీవ్రమైన రభస మధ్య విభజన బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ప్రధాని (మన్మోహన్ సింగ్) ప్రకటించిన ప్రత్యేక హౌదా గురించి అది పరిశీలించడంఎలా సాధ్యం? రాజ్యాంగం ప్రకారం మళ్లీ ఉత్తర్వును సవరించితే తప్ప తనకు నిర్దేశించని పని ఎలా చేస్తుంది?
14 వ ఆర్థిక సంఘం దగ్గరకి వద్దాం. రాష్ట్రాలకు వాటాను32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం గనక ఆంధ్ర ప్రదేశ్ అవసరాలన్ని తీరిపోయినట్టు చెప్పడంలో అర్థ రహితం. 42 శాతం అనేది అన్ని రాష్ట్రాలకు వర్తించే మామూలు పెరుగుదల. విభజనానంతర రాజధాని రహిత రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ చేసింది కాదు. ఆర్థిక సంఘాలు అంతకు ముందుకన్నా నిధుల పెరుగుదల సిపార్సు చేయడం మామూలుగా జరిగేదే. ఉదాహరణకు మొదటి ఫైనాన్స్ కమిషన్ కేవలం ఆదాయం పన్ను,ఎక్సయిజ్ సుంకాలనే పంపిణీ చేసింది. పదవ ఫైనాన్స్ కమిషన్ నాటికి అనేక ఇతర వనరుల పంపిణీ కూడా చేపట్టారు. అయినా రాష్ట్రాలకు రావలసిన దాంట్లో కొద్ది భాగమే ఇచ్చి కేంద్ర పెత్తనమే నడిపించారు. కనుకనే సర్కారియా కమిషన్ వంటివి అవసరమైనాయి.
14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చేఆదాయం 45 శాతం పెరిగిందంటున్నారు గాని వాస్తవానికి పెరిగింది పదిశాతమే. 32 శాతం వున్నప్పుడు ఈ మొత్తం 3.48 లక్షల కోట్లు కాగా 42 శాతంకింద 5.26 కోట్లుగా వుంటుంది. మొత్తంపైన ఇది 1.78 లక్షల కోట్ల పెరుగుదల. ఇదంతా సకాలంలో సక్రమంగా మంజూరు చేసి విడుదల చేసినప్పటి మాట.కాని మరోవైపున కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు వంటివాటిని మొత్తంగా ఎత్తివేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు(సిఎస్‌ఎస్)ల వ్యయం రాష్ట్రాలు అధికంగా భరించాలని ఆర్థికసంఘం చెబితే కేంద్రం ఆ పథకాలనే ఎత్తివేస్తానన్నట్టు మాట్లాడుతున్నది. లెక్కలుఎప్పుడూ శాతాలలో చూడాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర వనరులలో 6.937 శాతం లభించేది.ఇప్పుడు తెలంగాణకు 2.437 శాతం, ఎపికి 4.305 శాతం కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రెండు కలిపిచూస్తే 6.472 శాతం అవుతుంది. ఇది గతంలో కన్నా పెరిగినట్టా? తగ్గినట్టా? వెంకయ్య నాయుడు వంటి వారే చెప్పాలి.


venkaiah naidu tv5 program lo kooda eeroju kani pincharu, ventane nenu channel marchanu, adi aprayatnamga jarigindi, ante naa manasu aa pedda manishi maatalu vinataniki siddanga ledani ardha mayindi. ee roju nenu, repu verokaru, aatharuvatha marokaru, prajalantha venkaiah athivaaguduku visigi poyaru, athani matalu vintaniki estapadani rojulu chala daggaralone vunnayani gattiga cheppagalanu. ayina prajala naadi telisikooda, prajalloki raleni variki ye naatiki viluva vundadu. variki channelle dikku. inkaa bariteginchi ede konasagite athanni choodagane chanel mari verroka channelki vellatharu. venkaiah program chestunna channel vari rating padi potundi, adichaalada buddi ravataniki.