అనుకరణకు అద్భుత విజయం- అసలు కథ అంతంత మాత్రం!
వినాయక నిమజ్జనం రోజున ఏదో ఛానల్‌లో శ్రీరామరాజ్యం వస్తుంది. నిజంగా లవకుశ వంటి జనరంజకమైనకథ, గొప్ప మ్యూజికల్ హిట్ చిత్రం అంత పేలవంగా ఎలా తీశారా అని ఆశ్యర్యం వేసింది. దాదాపు నాలుగు నిముషాలకో పాటో పద్యమో వున్నా పాత లవకుశలో ప్రతి పద్యమూ పాటా ఇప్పటికి వూపేస్తుంటాయి. వాటితో పోలిస్తే శ్రీరామరాజ్యం లో జగదానంత కారకా అనే పాట మినహా మరేదీ నిలవదు. సెట్టింగులూ నటనలూ అన్నీ సోసో.. ఆ సంగతి అలా వుంచితే దర్శకుడు బాపు. తమాషా ఏమంటే లవకుశ ఆధారంగా ఆయన తీసిన ముత్యాల ముగ్గు సంచల
న విజయం సాధించింది ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. అలాటి వ్యక్తి అదే పురాణకథను తీస్తే పరిమిత ఫలితమే వచ్చింది. రామభక్తుడు బాపు ముత్యాల ముగ్గులో హీరో పొరబాటును సూటిగా చెప్పినట్టు రామరాజ్యంలో అసలు రాముడిని చూపించలేకపోయారు. సీతను అడవికి పంపడానికి చాలా ఘర్షణ పడ్డాడని చూపించి తన ఘర్షణను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. బాలయ్య కూడా బాగానే చేసినా కొన్ని చోట్ల తేలిపోయాడు. సెట్టింగులు మరీ అధ్వాన్నంగా గ్రాఫిక్స్ అని తెలిసిపోయాయి. సీనియర్లయిన అక్కినేని వాల్మీ
కిగా బాలయ్య వశిష్టుడుగా అస్సలు పురుణ సంబాషణాశైలిని పలకలేదు. ఇవన్నీ కలసి ఏదో నడిచిందనిపించాయి.లవకుశ వంటి కథ ఎవర్ గ్రీన్ కథ ఆకట్టుకోకపోవడానికి కారణాలే ఇవన్నీ. రమణ కన్నుమూత కూడా ఒక కారణం కావచ్చు గాని ప్రధాన కారణమనలేము.

