తరలి పోయిన కళా సంపద
చక్రవర్తి అశోకుడెచ్చట
జగద్గురు శంకరుడెచ్చట?
ఏవి తల్లీ నిరుడు కురిసిన
హిమ సమూహములు?
షాజహాను
అంత:పురమ్ములో
షట్పదీ శింజాన మెక్కడీ
ఝాన్సీ లక్ష్మీ బాయి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ?
అంటూ శ్రీశ్రీ గడచిన కాలపు గురుతులను గానం చేశాడు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముటyడికైన ఖర్చులూ మతలబులూ ఖైఫీయతులు ఇవి కావోరు చరిత్ర సారం అన్న కవే ఈ విధంగా రాశాడంటే గత చరిత్ర అవశే’ాల పట్ల మరీ ముఖ్యంగా అమూల్యమైన వారసత్వం పట్ల ఎవరికైనా ఎంత అనుబంధం అకాంక్ష వుంటుందో తెలుస్తుంది. స్వాతంత్ర పోరాట కాలంలో భార తీయులు –
కోహినూరు నీ జడలో పువ్వట
తాజు మహలు నీ పాద పీరyమట
……
నమో భ’రత మాతా
మాతా…
అనిపాడుకునేవారు. రత్నగర్భగా అద్భుత సంపదలకు కళా ఖండాలకు నిలయంగా ప్రపంచాన్ని ఆకర్షించిన భారత దేశం నిజంగానే యావత్ప్రంచాన్ని ఆకర్షించింది. అదే భార తీయుల పాలిట పెను శాపంగానూ మారింది. ఈ సంపదల కోసం దేశ దేశాల దురాక్రమణ దారులు ఇండియాపై నిరంతరం దాడులు చేసి కొల్లగొడుతూ వచ్చారు. వారిలో కొందరు ఈ దేశంలో లీనమై పోయి దీన్నే తమ నెలవుగా చేసుకున్నారు. కాని వీరందరికీ భిన్నంగా పాశ్యాత్యులు మరీ ముఖ్యంగా ఆంగ్లేయులు మన దేశాన్ని వలసగా చేసుకుని ప్రజలను బానిసత్వంలో నెటిy దేశ సంపదను గుల్లచేశారు.ఆ క్రమంలోనే ఇంతకు ముందు పాటలో చెప్పుకున్న అమూల్య కళాఖండాలతో పాటు అనేకానేక అమూల్య సంపదలను తరలించుకుని పోయారు.ఎంచక్కా తమ రాణుల కిరీటాల్లో, సింహాసనాల్లో, వస్తు ప్రదర్శన శాలల్లో అమర్చుకున్నారు. కోహినూరు వజ్రం, నెమలి సింహాసనం, మైసూరు పులి టిప్పు సుల్తాన్ సునిశిత ఖడ్డరాజం, మహా తాత్వికుడైన బుద్దుడి మనోహర ప్రతిమ, మరెన్నో ఎన్నెన్నో భారతీయ కళా ఖండాలు పాశ్యాత్య దేశాల్లో పడి వున్నాయి. 200 ఏళ్ల పరాయిపాలనను స్వాతంత్ర పోరాటంతో తుదముటిyంచ గలిగాము గాని వారి హస్తగతమైన మన ఘన వారసత్వ సంపదను మాత్రం తిరిగి తెచ్చుకోలేకపోతున్నాము. ఇది భారతీయుల ఆవేదన.ఆరాటం.
నిజానికి మన దేశం మాత్రమే కాదు. ప్రపంచ వ్యాపితంగా వలసపాలన కోరలలో నలిగిన ప్రతి వర్దమాన దేశమూ, లేదా పరాజయాలు చవి చూసిన ప్రతి పాత సామ్రాజ్యమూ ఇదే కోరుకుంటున్నది. ఇందుకోసం ఈజిపుy రాజధాని కైరోలో ఒక అంతర్జాతీయ సభ’ కూడా జరిగింది.బలీవియా,చైనా,సైప్రస్,గ్రీస్,గ్వాటిమాలా,హోండురాస్,ఇరాక్,ఇటలీ,లిబియా, మెక్సికో,నైజీరియా,దక్షిణ కొరియా, స్పెయిన్,శ్రీలంక, సిరియా తదితర దేశాలు ఈ సమావేశంలో పాల్గని ప్రాచీన సంపదలు కళాఖండాల తస్కరణను తరలింపును నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి గటిyగా జోక్యం చేసుకోవాలని కోరాయి.ఈ దేశాల్లో చాలా భాగం మన లాగే ప్రాచీన నాగరికతకు నిలయాలుగా పేరొందినవే. ఈజిపుy పిరమిడ్లు వగైరాల సంగతి అందరికీ తెలుసు.
మాయా నాగరికతకు నిలయం మెక్సికో. మనలాగే ప్రాచీన ప్రాచ్య నాగరితకు ఆటపటుy చైనా. మొదట మెసపుటేమియా పేరిట ప్రసిద్ధమైన ఇరాక్ తర్వాత కాలంలో బాగ్దాద్ కథలన్నిటికీ రంగస్థలం. ఐరోపాలో నాగరికతా వికాసానికి తొలి పాదం గ్రీస్. రోమను సామ్రాజ్య పీరyం ఇటలీ. తర్వాతి కాలంలో ప్రపంచాధిపత్యం సాధించిన బ్రిటన్ వీటన్నిటి నుంచి అనేక విధాల సంపదలు తరలించుకుపోయింది. బ్రిటన్ ఆధిపత్యం స్థిరపడక ముందు ఇతర దేశాలు కూడా అలాగే కొన్నింటిని కైవశం చేసుకున్నాయి.
ఇది గాక పాశ్చాత్య దేశాలు ప్రాచీన కళాఖండాలతో వ్యాపారం కోసం అక్రమ రవాణాను ప్రోత్సహించాయి. అలాగే తమ కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు ఎంతగానో కోరుతున్నా వారి సంపద వారికి అప్పగించకుండా భారీ ఖరీదులకు వేలం వేసి కుబేరుల పరం చేశాయి. ఆ విధంగా వాటిపై తమకు హక్కు లేదన్న వాదనను తీసుకొచ్చాయి. వాస్తవంలో చిన్న దేశాల పట్ల సామ్రాజ్యవాదుల దురహంకారానికి ఇది కూడా ఒక నిదర్శనం. తమ దేశ వారసత్వ సంపద కోసం ఒక దేశ ప్రభ’ుత్వాలు కోరుతుంటే వారిని కాదని వ్యాపార సరళిని ప్రోత్సహించడం నాగరికం కూడా కాదు. కాని సామ్రాజ్య వాద దేశాలకు ఇతరుల ఆత్మ గౌరవం గాని తమ నాగరికతా విలువలు గాని ప్రధానం కానే కాదు. స్వలాభ’మూ, స్వీయాధిపత్యమూ నిలబెటుyకోవడమే వారి పరమార్థం.అందుకే వర్థమాన దేశాలు ఎన్నిసార్లు ఎన్ని విధాల కోరినా వాటి వారసత్వ సంపదను వారికి అప్పగించేందుకు సుతరామూ ఒప్పుకోవడం లేదు.ఐక్యరాజ్యసమితి ప్రాచీన సంపద అపహరణను తరలింపును నిషేదిస్తూ ఒక చటyం చేసింది. అయితే ఇది 1970 తర్వాత కాలానికే వర్తిస్తుంది. నిజానికి జరగాల్సిందంతా దానికి ముందే జరిగింది. వాటికి సంబంధించి ఈ ఒప్పందంలో ఎలాటి ప్రస్తావన లేదు. పైగా అన్ని విషయాల్లో లాగే ఈ ఒప్పందాన్ని కూడా అమెరికా అమోదించలేదు.కనక ఇది అన్ని విధాల కంటి తుడుపు వ్యవహారం మాత్రమే.అందుకే ప్రపంచ దేశాలు కైరో సమావేశంలో దీనిపై సామూహికంగానే వత్తిడి చేయాలని నిర్ణయించుకున్నాయి.
విదేశాల నుంచి మనకు రావాలని ఇండియా కోరుతున్న జాబితాలో చాలా వున్నాయి.తరచూ చెప్పుకునే వాటికి తోడు భోజుల కాలం నాటి సరస్వతీ విగ్రహం కూడా వాటిలో ఒకటి.అసలు భారత దేశ ప్రాచీన నాగరికత పట్ల వున్న ఆకర్షణ, ఆదరణ దృ’ాy్య మన కళాఖండాలు మంచి రేటు పలుకుతాయి. పరాయిపాలకులు తీసుకు పోయినవాటి మాట అటుంచి 1977,78,79 మూడేళ్లలోనే 3000పైగా ఇలాటి చౌర్యాలు జరిగాయి. దొంగతనాలుగా చెబుతున్నప్పటికీ నిజానికి ఇవన్నీ అంతర్జాతీయ మురవాల ఆద్వర్యంలో జరిగిన తరలింపులే. ఐరాస లెక్కల ప్రకారం 1979-89 మధ్య దశాబ్దిలో యాభై వేలకు పైగా భార తీయ కళాఖండాలు సరిహద్దులు దాటాయి! మారు మూల ప్రాంతాల్లోని మ్యూజియంలు, కళా కేంద్రాలలో ఇలాటి అపహరణలు సులభ’ంగా జరుగుతాయని ఒకప్పుడు అనుకునేవారు. కాని పాట్నానగర మ్యూజియంలోనూ ఆఖరుకు రాష్రyపతి భ’వనంలోనూ కూడా ఇలాటి చౌర్యాలు జరిగాక ఈ మురవాల శక్తి తెలిసి వచ్చింది. స్వభావం వేరైనా శాంతినికేతన్లో రవీంద్రనాథ టాగోరు నోబుల్ పురస్కారం అపహరించడం కూడా ఈ జాబితాలోకే వస్తుంది.
1997లో మ్యూజియంలలోని మూడో వంతు కళాఖండాలు గల్లంతైనాయి. ఇందులో అనేక వాటిని తర్వాత పటుyకున్నప్పటికీ జరగాల్సిన సషyం జరిగేపోయింది. విగ్రహాలను కరిగించి వెండిగా మార్చడం, ఇతరమైన వాటిని ధ్వంసం చేయడం కనుగొన్నారు. రాష్రyపతి భ’వన్‌లో చౌర్యానికి పాల్పడింది పాతకాగితాలేరుకునేవాడని తేలింది. అయితే ఈ దొంగలను అంత తేలిగ్గా తీసేయకూడదు.తెర వెనక వేరే వుంటారు.ఫ్రాన్స్‌కు చెందిన ఆండ్రీ మాల్రాక్స్ ఇలాటి ఘటనల్లో పటుyబడి ప్రపంచమంతటా ఆయన పేరు మోగిపోయంది. కంబోడియాలో విగ్రహాలను పరిశీలిస్తామంటూ బయిలుదేరి ఏకంగా తస్కరించేశాడు. తమా’ా ఏమంటే కొన్నేళ్ల తర్వాత ఆయనే ఫ్రాన్స్ సాంసృతిక శాఖామంత్రి అయ్యాడు!
ఇవన్నీ చదువతుంటే ఎన్‌టిఆర్‌తో సహా భారీ తారాగణం నటించిక కృష్ణ సొంత చిత్రం దేవుడు చేసిన మనుషులు గుర్తుకు వస్తుందా? నిజమే! ఆ చిత్రం ఈ అంశంపైనే ఆధారపడి తీశారు. ఆలయాలలో వెలుతురు లేదు, ఆకాశంలో చీకటి లేదు, విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే గుడిలో ఎందుకు రామయ్యా నిను విడుదల చేస్తాం రావయ్యా అంటూ దొంగల మురవా విమానంలో వెళ్తున్న పూజారిని హత్యచేసి విగ్రహాన్ని కాజేచడానికి పథకం వేస్తుంది. తర్వాత ఏవో మలుపులు వుంటాయి గాని ప్రధాన కథ ఇదే. నిజంగానే భారతీయ విగ్రహాల పట్ల ఆకర్షణతో పాటు వాటి విలువ, విశ్వాసాలు కూడా రేటు పెరగడానికి కారణమైనాయి. ఆ విధంగా ఒకప్పటి పరాయి పాలకులు దొరల్లా దోచుకెళితే ఇప్పుడు దొంగలు ఆ పని కొనసాగిస్తున్నారు. చాలా దేశాలు స్వాతంత్రం తర్వాత అపహరణకు గురైన తమ తమ జాతి సంపద జాబితా ప్రకటించాయి. ఆఖరుకు చిన్న పొరుగుదేశమైన నేపాల్ కూడా 1988లోనే తమ శిల్పాల జాబితా ప్రకటించింది. కాని అరవై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనం అలాటి సమగ్రమైన జాబితా ప్రకటించలేకపోయాము. ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్నవాటినైనా తెచ్చుకోవడానికి గటిy వ్యూహాలు రూపొందించుకోలేకపోయాము. కార్పొరేట్ సంస్థలతో సహా అనేక మంది కళా సేవ పేరిట లోపాయికారిగా ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. విదేశాలలో వున్న సంపదను కూడా వశపర్చుకుంటున్నారు.
ఉదాహరణకు ప్రసిద్ధమైన టిప్పు సుల్తాన్ కత్తిని వ్యాపార వేత్త విజరు మాల్య లండన్ వేలం పాటలో కొనుగోలు చేశాడు. అందుకు ఆయన చెల్లించిన మొత్తం కోటిన్నర రూపాయలు. ఈ మాత్రం మొత్తం మన దేశం చెల్లించలేకపోయిందా? అంటే సమాధానం చెప్పడం కషyం. 1799 మే 4 వ తేదీన శ్రీరంగ పటyణం యుద్ధంలో టిప్సు వీరోచితంగా పోరాడి మరణించిన తర్వాత ఈ ఖడ్గం దొరికింది.(ఇప్పటికీ శ్రీరంగ పట్నంలో ఆయన భౌతిక కాయం, కరవాలం దొరికిన చోట్లు గుర్తు పెటిy వుంటాయి) దాన్ని తమ విజయ చిహ్నంగా బ్రిటిష్ వారు పటుyకుపోయారు. యుద్ధంలో ప్రదిర్శంచిన శౌర్యానికి గాను మేజర్ జనరల్ బైర్డ్‌కు దాన్ని బహుకరించారు. ఆయన వారసులు వస్తువులను వేలం వేస్తుంటే విజరుమాల్యా కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. దీనికోసం 2003 నుంచి తాను ప్రయత్నాలు చేస్తున్నానని ఇక దీన్ని అమ్మే ప్రసక్తి వుండదని మాల్యా ప్రకటించాడు. దీన్ని టిప్పు ప్రార్తనలు చేసిన దర్గా ఉత్సవాల సమయంలో మాత్రమే ప్రజల సందర్శనకు వుంచి తక్కిన సమయమంతా బ్యాంకు లాకర్లోనే భ’ద్రంగా వుంచేస్తానని ఆయన స్పషyం చేస్తున్నారు.
…………..
1877 జనవరి మొదటి తేదీన కోహినూర్ వజ్రం ి వశమైన తర్వాతనే బ్రిటిష్ రాణి వికోyరియకు ఖైజార్ ఎ హింద్ అన్న బిరుడును జోడించారు. అంటే భారత దేశపు మహాసామ్రాజ్ఞి అని అర్థం. దాన్ని ఆమె కిరీటంలోనూ అమర్చారు. ఇప్పటికీ అదే ఆ కిరీటంలో అత్యంత ప్రకాశవంతమైన వజ్రం.
……………
బారత దేశం కోల్పోయిన అపూర్వ వస్తు సంపద వివరాలు ప్రకటించి ఎందుకు వాటికోసం వత్తిడి తేవడం లేదు? పటుy పట yడం లేదు. న్యాయ పరంగా ఈ పని చేయడం చాలా దీర్ఘకాలం తీసుకునే ఖరీదైన వ్యవహారమని పురావస్తు శాఖ డైరెకyర్ జసరల్ అర్జున్ సేన్‌గుప్తా అంటారు.కాని వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన సూచించడం లేదు. అంటే వీటిని శాశ్వతంగా వదులుకోక తప్పదని మన పాలకులు భావిస్తున్నారన్నమాట. అద్భుతమైన సంపదలన్ని పోయిన తర్వాత ఇప్పుడు తాము చేయాల్సింది చేయకుండా రాష్రy ప్రభ’ుత్వాలు కరిyనమైన భ’ద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఉచిత సలహాలిస్తున్నది! మరోవైపున ఈజిపుy వంటి దేశాలతో పాటు గటిyగా నిలబడి పోరాడటానికి సిద్ధం కావడం లేదు.
అందుకే ఈ దేశానికి చెందిన అమూల్య సంపదలు విదేశాల గుప్పిటినుంచి విముక్తమై వచ్చే రోజు ఇప్పట్లో వూహించలేము.
గమనిక: ఇది గతంలో రాసిన దాని ఎడిటెడ్ వెర్షన్ మాత్రమే. మరీ తాజా సమాచారం వుండకపోవచ్చు. సోమవారం (సెప్టెంబరు 12) పత్రికల్లో టిప్పు సుల్తాను కత్తి గురించిన వార్తల వంటివి కూడా ఈ జాబితాకు కలుపుకోవాలి.ఇంకా ఏమైనా తాజా పరిణామాలు నిపుణులు చెబితే కలుపుతాను.