చంద్రుడిపై రవి జాలి!


చాలా కాలం తర్వాత టీవీ9లో ప్రత్యేక హౌదాపై చర్చ చేసిన మిత్రులు రవి ప్రకాశ్ పదే పదే చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. మీరెందుకు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని బిజెపి నాయకుడు రఘునాఘబాబాను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ధ్వనించింది. ఇది తెలుగుదేశం నాయకులు రోజూ వినిపిస్తున్న రికార్డును తలపించింది. ఇకపోతే చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు లేవని ఈ దాగుడు మూతల్లో ఆయనకు భాగం లేదని భావించాలా? ఆయనపై జాలి పడాలా ఆగ్రహించాలా? రాజకీయ నేతల ప్రభుత్వాధినేతల తప్పిదాలను అవకాశవాదాలను ఎండగట్టే రవి ప్రకాశ్‌కు ఇప్పుడు ఇంత జాలి కలగడానికి హేతువేమిటో అంతుపట్టని ఆశ్చర్యంగా మిగిలింది. జాలి పడాల్సింది చంద్రబాబుపైనా మోసపోయిన రాష్ట్రంపైనా లేక ప్రజలపైనా? కాక ఎవరు నిజంగా తప్పు చేశారో తెలుసుకోలేని లేదా తెలిసినా చెప్పలేని మీడియాపైనా?