దీపకు భరతావని జేజేలు

DIPA_KARMAKAR_2973038f

రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌ విభాగంలోఫైనల్స్‌కు ఎంపికైన తొలి భారతీయ యువతి దీపా కర్మేకర్‌ తృటిలో పతకం కోల్పోయినా ఎవరూ విచారించలేదు సరికదా విజయ హారతి పడుతున్నారు. ఎక్కడో త్రిపుర అనే చిన్న రాష్ట్రం త్రిపుర నుంచి బయిలుదేరి విశ్వ క్రీడా వేదికపైకి దూసుకెళ్లిన 23 ఏళ్ల దీప జిమ్మాస్టిక్స్‌లో ప్రొడునోవా అంశంలో నాలుగో స్థానం వరకే చేరగలిగింది. అయితే మూడవ స్థానం పొందిన స్విస్‌క్రీడాకారణికి ఆమెకూ తేడా 0.15 పాయింట్లు మాత్రమే! నిజానికి మొదటి రెండు స్థానాలు కూడా ఇంకా కొంచెం ముందుంటాయి. మొదటి రెండు రౌండ్లలో బాగా మెరుగ్గా వున్న ఆమె స్కోరు మూడవ దశలో తగ్గడానికి కారణం విన్యాసం పూర్తి చేసిన తర్వాత ఒక్కసారిగా కూచుండిపోవడమేనట. అయితే మొదటి ఒలింపిక్స్‌లోనే నాలుగో స్థానంలోకి రావడం వూహించని విజయం అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.2020లో జపాన్‌ రాజధాని టోక్కోలో జరిగే సమ్మర్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించడం తన లక్ష్యంగా ప్రకటించింది.కొన్ని క్రీడాం000_ER8WI_2972619fశాల్లో నాల్గవ స్థానానికి చేరినా కాంస్య పతకం లభిస్తుంది గాని ఇందులో కాదు అని పద్ధతిని వివరించింది. అందుకు ఆమె బాధపడకపోగా దేశంలోని వందకోట్లమందికి పైగా ప్రజలకు సారీ చెప్పింది.అయితే దీప చూపించిన అద్భుత ప్రతిభ పట్ట దేశం పులకించి పోయింది. ఫేస్‌బుక్‌ ట్విట్లర్‌ వంటివన్నీ ఆమె ఫోటోలు సమాచారం సందేశాలతో నిండిపోయాయి. మేరికామ్‌,వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి క్రీదాకారులు శేఖర్‌ కపూర్‌ వంటి దర్శకులూ ఆమెను అభినందిస్తూ ట్విట్లు పెట్టారు
ఇక దీప స్వరాష్ట్రమైన త్రిపుర ఆమె పురోగమనానికి పులకించిపోయింది. ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రత్యేకంగా అభినందనలు తెల్పుతూ ఆమె స్పూర్తి మరెందరికో ఉత్తేజమవుతుందన్నారు. రాజధాని నగరం అగర్తల పోస్టర్లు బ్యానర్లు ఆమె ఫోటోలతో మెరిసిపోయింది. తంద్రి దిలాల్‌, తల్లి గౌరి సంతోషానికి మేరలేదు. ఆమె మొదటిసారి ఒలింపిక్స్‌ ఫైనల్స్‌కు చేరడం గర్వకారణం. నాకు కొడుకు లేడని కొంతమంది అనేవారు. దీప అంతకన్నా ఎక్కువే అని దిలాల్‌ సంతోషం ప్రకటించారు. దీపకు మొదట కోచ్‌గా వున్న సోమానందిది మరో విధమైన ఆనందం. తర్వాతి కాలంలో ఆ మె శిక్షణ బాధ్యత భర్త విశ్వశ్వర్‌ నందికి అప్పగించింది..శిక్షణ అంటే ఆయనచాలా కాలం దూరంగా వుండాల్సి వస్తుందని తెలుసు. అయినా ఆమె ప్రతిభ గురించి తెలుసుగనకే అందుకు అంగీకరించాను అని ఆనందం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *