సీమ కేబుల్‌ నిలిపివేతపై నిరసన

seema

 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తమకు నచ్చని ఛానళ్ల ప్రసారాలకు ఆటంకాలు కల్పించటం తెలిసిన విషయమే. దీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ అనధికార నిషేధాలు తీవ్ర విమర్శలు కోర్టుల జోక్యం తర్వాతనే తొలగించారు. వాస్తవానికి స్థానికంగా కేబుల్‌ ప్రసారాలను అడ్డుకోవడం మొత్తం వ్యవస్థ గుప్పిట్లో పెట్టుకోవడం రివాజుగా మారింది. చాలాచోట్ల ఇది మాఫియా తరహాకు మారిపోయింది. ఇటీవలనే కర్నూలులో సీమ కేబుల్‌ ప్రసారాల నిలిపివేత తీవ్ర నిరసనకు దారితీసింది. అధికారులపై వత్తిడి తెచ్చి వైర్లు కత్తిరించడం, కార్యాలయం సీజ్‌ చేయడం వరకు వెళ్లింది. దీని వెనక ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్‌ హస్తం ఉందని . కర్నూలులో కలెక్టర్‌, ఎస్పీలు పచ్చచొక్కాలు వేసుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీనిపై సోమవారం(25న) ఒక పెద్ద బహిరంగసభ జరిగింది. కేబుల్‌ రంగంలో కెఇ, టిజి, ఎస్వీల గుత్యాధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ ప్రజలకు తక్కువ ధరలకు సీమ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ నాణ్యమైన ప్రసారాలు అందించిందని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ప్రజామద్దతు చూరగొన్నదని సిపిఎం మాజీ ఎంఎల్‌ఎ ఎంఎగఫూర్‌ అన్నారు. మరొకరు వ్యాపారం చేసుకోరాదనే తరహాలో కెఇ కుంటుంబం, టిజి వెంకటేష్‌, ఎస్వీ మోహన్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారని అన్నారు. లిక్కర్‌, ఇసుక, మైనింగ్‌, భూ కబ్జాలు, దందాలు ఇలా అన్నింటిలో పాతుకుపోయి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారని తెలిపారు. సీమ కేబుల్‌ వ్యాపారం కోసం పెట్టలేదని, కేవలం కర్నూలులో ప్రత్యామ్నాయ మీడియా ప్రజలకు అవసరమన్న లక్ష్యంతో ముందుకు వచ్చిందన్నారు. చట్టపరంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ టిజి వెంకటేష్‌ ఫిర్యాదు చేశారనే సాకుతో కలెక్టర్‌ అడ్డగోలుగా ఛానళ్లను సీజ్‌ చేయడం సరైంది కాదన్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని చట్ట పరిధిలోనే ఎదుర్కొంటామని ఇయన ప్రకటించారు. శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) చైర్మన, వైసీపీ నేత ్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలులో రాజ్యాంగ విరుద్ధంగా సీమ కేబుల్‌పై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు. . డిసిసి అధ్యక్షులు బివై రామయ్య మాట్లాడుతూ, కెఇ కృష్ణమూర్తి పెద్ద మనిషిగా చెలామణి అవుతూ నగరంలో అరాచకాలు సృష్టిస్తున్నాడని విమర్శించారు.మొత్తంపైన సీమ కేబుల్‌ నిలిపివేత కర్నూలులో మీడియా పరిధి దాటి రాజకీయ పోరాటంగానూ మారడం ఆసక్తికరం. సాంకేతిక నైపుణ్యం వల్ల అందిన కేబుల్‌ పరిజ్ఞానాన్ని కొద్దిమంది గుప్పిట్లో పెట్టుకోవడం మాత్రం ఎక్కడైనా అనుమతించరానిదే. ఎబిఎన్‌ చానల్‌ణు గాని ఎన్‌టివిని(కొంతకాలం టివి9ను) గాని అడ్డుకోవడం ఎంత తప్పో సీమ చానల్‌ వంటివాటిపై దాడి చేయడం కూడా అదే తరహాకు చెందుతుంది. మీడియా మిత్రులూ ప్రజాస్వామ్య ప్రియులు దీన్ని ఎన్నటికీ ఆమోదించరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *