దుస్తంత్రాలు, దుష్ఫలితాలు

new-delhi-india-9th-aug-2014-bharatiya-janata-party-bjp-president-e5yprt

 

రాజకీయాలలో విజయం సాధించడానికి మన ఘనతే కారణం కానక్కర్లేదు, అవతలి వారి క్షీణత కూడా దోహదం చేస్తుంది. ఎన్నికల ముందుండే పరిస్థితులు కూడా అసాధారణ విజయాలకు దారితీస్తుంటాయి. సానుభూతి పర్వంలో . రాజీవ్‌గాందీ హయాంలో ఏ పార్టీకి రానన్ని స్థానాలు కాంగ్రెస్‌ తెచ్చుకుంది. కాని రెండేళ్లలోనే అంతా కకావికలైింది. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పూర్తి ఆధిక్యత కూడా ఒక అసాధారణ విజయమే. తర్వాత రాష్ట్రాలలోనూ కొంత దెబ్బతిని కొంత విస్తరించి ి బలంగానే కొనసాగుతున్నదంటే కాంగ్రెస్‌ బలక్షీణత కారణం. కానైతే సర్వశక్తివంతుడైన మోడీ-అమిత్‌ షా జోడీలో ప బిజెపి ఎన్‌డిఎ ఎదురుదెబ్బలు తింటున్నాయి. ఇవన్నీ స్వయం కృతాలు రాజ్యాంగ విఘాతాల పర్యవసానం కావడం మరింత నిజం. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో నాబమ్‌తుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఈ వరస దెబ్బల పరంపరకు పరాకాష్ట.
చిన్న ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ . గత ముప్పై ఏళ్లనుంచి అక్కడ అత్యధికంగా కాంగ్రెస్‌ పాలనే నడుస్తున్నది. అయితే వారిలో వారు కుట్రలూ కూలదోసుకోవడాలూ అస్థిర రాజకీయాలకు పేరు మోసింది. ప్రస్తుత ి. సభలో 60 కి 47 మంది సభ్యులున్న కాంగ్రెస్‌ నుంచి నబాంతుకీకి వ్యతిరేకంగా కలియపోల్‌ వర్గానికి చెందిన 21 మంది ఫిరాయింపును ప్రోత్సహించింది. బిజెపికి 11, ఇతరులకు రెండు స్థానాలున్నాయి. ఒక ప్రభుత్వ బలం రాజ్‌భవన్‌లో గాక శాసనసభ వేదికపైనే తేలాలన్నది ఎస్‌ఆర్‌బొమ్మై కేసులో ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పు. స్పీకర్‌ ఫిరాయించిన వారిలో 15 మందిని అనర్హులుగా ప్రకటించినా గవర్నర్‌ జెపిరాజ్‌కోవాను ముందుంచి కథ నడిపించింది. రాజ్యాంగ పరిధిని కూడా ఘోరంగా అతిక్రమించేస ఆయన ి సభా నిర్వహణను చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతినిచ్చింది. 2016 జనవరిలో జరగాల్సిన శాసనసభను 2015 డిసెంబర్‌లోనే జరిగేలా ఉత్తర్వులిప్పించి స్పీకర్‌ను తొలగించి అంతా గత్తరబిత్తర చేసింది. హఠాత్తుగా రాష్ట్రపతి పాలన ఎత్తివేసి కాలికోపాల్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది. ఈ కేసు నడుస్తుండగానే ఉత్తరాంచల్‌లో రావత్‌ ప్రభుత్వాన్ని కూడా ఇదే ఫార్ములాతో పడగొట్టింది. ఆయనా హైకోర్టులో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా అక్కడా హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించి తొలిసారి రాజ్యాంగాధినేతకు కూడా అక్షింతలు వేయించారు. అయినా రావత్‌ పున:ప్రతిష్గితులైనారు. . అంతకన్నా తీవ్రంగా అరుణాచల్‌ చెంపదెబ్బ. ఈ కేసులో సుప్రీం కోర్టు స్పీకర్‌ హక్కులు బాధ్యతలు గవర్నర్‌ పరిమితులు సుస్పష్టంగా నిర్వచించడం వల్ల ఇది మరో మైలురాయిగా నిల్చిపోతుంది. నబాంతుకిని పునరుద్ధరించామంటూనే ఈ తీర్పు విచిత్రమైందని బిజెపి వ్యాఖ్యానించడం చూస్తుంటే వారింకా కళ్లుతెరవడానికి గాని, వాస్తవాలు స్వీకరించడానికి గాని సిద్ధంగాలేరని అర్థమవుతుంది. నబాం తుకి సర్కారు ఏమవుతుందనేది చిన్న విషయమైతే ్ల మోడీ సర్కారు దుస్సాహసాలు దుస్తంత్రాలు బెడిసికొట్టడం కీలకమైన పరిణామం. ,
ో జమ్మూ కాశ్మీర్‌లో కల్లోల పునరావృతి కూడా ి ఎంతో ప్రతికూలమైన పరిణామం. సున్నితమైన సంక్లిష్టమైన ఆ సరిహద్దు రాష్ట్రంలో పాగా వేసేందుకు ఆ పార్టీ వేసిన విన్యాసాలు సృష్టించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అసలు 370నే ఎత్తివేయాలంటూ స్థానిక ప్రజల్లో భయసందేహాలు తీవ్రం చేసిన నేపథ్యం.కాశ్మీర్‌ సమస్యను ఇజ్జత్‌ కా సవాల్‌ అన్న భావన కలిగించిన బిజెపి కేంద్రంలో పాలించిన రెండు సందర్భాల్లోనూ గడ్డుగా మారడం యాదృచ్చిం కాదు. వాజ్‌పేయి హయాంలో కొంత శాంతి చొరవ చూపించినా కార్గిల్‌లో పాకిస్తాన్‌ చొరబాటును పసిగట్టడంలో ఘోరంగా విఫలమవడం సంఘర్షణకు దారితీసింది. దాంట్లో విజయం ఆయన పునరాగమనానికి మార్గమైవుండొచ్చు గాని దేశం మూల్యం చెల్లించవలసివచ్చింది. దానికన్నా ముందునుంచి తీవ్రవాదం పట్ల సానుభూతిని వేదికగా చేసుకుని పెరిగిన మొహబూబా మఫ్తి పిడిపి పార్టీ వాస్తవానికి బిజెపి భావజాలానికి పూర్తి విరుద్ధమైంది. అయినా సరే మొన్నటి ఎన్నికల తర్వాత ఈ రెండు పక్షాలూ అధికారం కోసం నిస్సంకోచంగా చేతులు కలిపి సర్కారును నెలకొల్పాయి.అయితే గత ముఖ్యమంత్రి సయిద్‌ మృతి తర్వాత మెహబూబా ప్రభుత్వం ఏర్పడ్డానికి దాదాపు మూడు నెలల వ్యవధితీసుకుని శూన్యత సృష్టించారు. ఈ మూడు దశాబ్దాల్లోనూ ఇలాటి అస్థిర అస్పష్ట సందర్భాల్లోనే ఉగ్రవాదం విజృంభించడం చరిత్ర చెబుతున్న వాస్తవం. ఈలోగా గోమాంసం వివాదం, శ్రీనగర్‌ ఎన్‌ఐటి చిచ్చు, జెఎన్‌యులోనూ కాశ్మీర్‌ సంబంధిత కక్ష సాధింపు, పఠాన్‌కోట చొరబాటుకు వంటి వరస ఘటనలు. అంతర్జాతీయంగా ఐఎస్‌ఐఎస్‌ అమానుషాలు పెరుగుతున్న తరుణంలో పక్కనే పాకిస్తాన్‌ కుట్రలు తెలిసి కూడా మోడీ ప్రభుత్వం నిఘా విభాగం ముందస్తుగా పరిస్థితిని అంచనా కట్టలేకపోయాయి. హిజబుల్‌ దళాధిపతి 22 ఏళ్ల బర్హున్‌ వన్నిని ఎన్‌కౌంటర్‌ చేయడం ఒకటైతే దాని ప్రతిస్పందనను కూడా అంచనా కట్టలేకపోయాయి. తమకు అలవాటైన రీతిలో సాయుధ దళాలను పంపి అణచివేయవచ్చని వూహించాయి. నిజానికి వీధుల్లోకి వచ్చి నిరసన తెల్పుతున్న వేలాది మంది యువత ఈ దేశపు బిడ్డలే గాని ఏ ఉగ్రవాద సంతతి కాదు. పర్యాటకం మినహా మరే ప్రధాన ఉపాధి లేక అది కూడా దెబ్బతిని అల్లాడుతున్న అక్కడి ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఢిల్లీ పాలకులు ఎన్నడూ గుర్తించలేదు.పండిట్ల వూచకోత, తరిమివేత బాధాకరమే గాని అదే కాశ్మీర్‌ సమస్యగా చూస్తే ఇవన్నీ బోధపడవు కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్న ప్రకటనలే తప్ప కాశ్మీర్‌లో భారత్‌ అ ంతర్బాగం కావాలన్న బాధ్యతాయుత స్పందన రాలేదు. అంతకు ముందు వీరోక్తులు పలికిన మెహబూబా ఆధినేతగా వుండి చొరవచూపించి లేదు. ఫలితమే మరోసారి డజన్నమంది ప్రాణాలు కోల్పోవడం. శాంతియుత ప్రాంతాలు కూడా భగ్గున మండడం. .వైరుధ్యాల పుట్టగా మారిన బిజెపి పిడిపి ప్రభుత్వం ఏకీకృత వ్యూహంతో ఈ సంకోభాన్ని పరిష్కరించడం ఏమంత సులభం కాదు. ఏతావాతా ఈ వైఫల్యానికి ఆ రాష్ట్రం దేశం కూడా మరోసారి ప్రతిఫలం చెల్లించక తప్పదు.
అంతర్జాతీయంగానూ ఎన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో మోడీ ప్రభుత్వం ఆర్బాటం అపహాస్యం పాలైన తీరు ప్రపంచమంతా చూసింది. ఆ ఆశతో అమెరికాకు ఆసాంతం లొంగిపోయి భంగపాటే మిగిల్చిన కేంద్రం చైనాపైకి విమర్శ మరల్చేందుకు విఫలయత్నం చేసి విరమించుకుంది.ఈ ప్రహసనానికి దక్షిణ చైనా సముద్ర సమస్యను ముడిపెట్టి చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో వున్నాననే సంకేతాలు అందించింది.ఇప్పుడు హేగ్‌ అంతర్జాతీయ న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కూడా చైనా తోసిపుచ్చి అమెరికా కూటమిపై ధిక్కారం ప్రకటించింది. కావాలంటే ఈ సమస్యపై పిలిప్పయిన్స్‌తో చర్చలు జరుపుతానని సంసిద్ధత తెల్పింది. మన దేశం స్పందన కూడా కాస్త సమతుల్యంగా వున్నట్టు కనిపించే ప్రయత్నం చేసింది. భారత్‌ తననే బలపర్చిందని చైనా చెప్పుకుంటున్నది. ఒక విధంగా ఈ తీర్పు అంతర్జాతీయ రంగంలో చైనా స్థానం నిలదొక్కుకోవడానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐరాస సముద్ర జల సూత్రాల ఒప్పందానికే కట్టుబడని అమెరికాకు హేగ్‌తీర్పుపైపట్టుపట్టే అర్హత ఎలాగూ వుండదు.1986లో నికరాగ్వాలో సాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు నిలిపేయాలని ఇదే కోర్టు తీర్పు నిస్తే అమెరికా బేఖాతరు చేయడం తెలిసిందే.అంటే అంతిమంగా మనం అమెరికాకు ఉపగ్రహంగా మిగిలిపోగా చైనా స్వతంత్రతను చాటుకుంటున్నదన్నమాట. మోడీ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ నివేదికలో వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గుర్తు చేయాలి. పాకిస్తాన్‌ విషయంలోనూ నాటకీయ ఆలింగనాలు ఎలా వున్నా నికరమైన విధానం లేకుండా పోవడం బలహీనతగా మారింది.
హెచ్‌సియు జెఎన్‌యు వివాదాల్లో చెలరేగిపోయిన సృతి ఇరానీని శాఖ మార్చడం, కోరి తెచ్చుకున్న సుబ్రహ్మణ్యస్వామి కొరివితో తలగోక్కున్నట్టు రోజుకో రచ్చ తెస్తుంటే ఉక్కిరి బిక్కిరి కావడం సంఘ పరివార్‌ మార్కు మాటల మంటలు, దాడులు ఇవన్నీ షరామామూలే.మరో వంక మరణించానని ప్రకటించిన తమిళ రచయిత పెరుమాల్‌ వరదన్‌ పునరుజ్జీవం కూడా గొప్ప గుణపాఠం. కొత్తగా గెల్చుకున్న హర్యానాలో జాట్ల వివాదం, మహారాష్ట్రలో పొసగని కాపురంలో అరోపణల పొగలు కనిపిస్తున్నాయి. అస్సాంలో కూడా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక రంగంలో సవాళ్లు సరేసరి. వెంకయ్య నాయుడు వంటివారికి మోడీ దేవుడిగా కనిపిస్తున్నారు గాని ఇవన్నీ చూస్తుంటే దిద్దుబాట్లు చాలా అవసరమని తేలిపోతుంది. సభలో సంఖ్యాబలమే సరిపోదని గుర్తించకపోతే చరిత్రే ఆఖరి పాఠం చెబుతుంది.

ఆంధ్రజ్యోతి గమనం, 15.7.16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *