కేజ్రీవార్‌? ముఖ్య కార్యదర్శిఅరెస్టు..

Rajendra_2706108f
ఢిల్లీముఖ్య మంత్రి  త్రి కేజ్రీవాల్‌కూ కేంద్రానికి మధ్య నిరంతర రాజకీయ ఘర్షణ తప్పేట్టు లేదు. జులై 4న ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర  కుమార్‌ను  సిబిఐ అవినీతి కేసులో అరెస్టు చేసింది. అయితే ఈ వ్యవహారం జరిగింది 2006లో అంటే కేజ్రీవాల్‌ రాజకీయ ప్రవేశానికి ముందు. కాని ఆ రాజేంద్ర కుమార్‌నే కోరికోరి కార్యదర్శిగా నియమించుకోవడం గురించి మాత్రం కేజ్రీవాల్‌పై విమర్శలు వస్తున్నాయి. 2006లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కోసం ఎండీవర్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదిరింది. అయితే ఈ సంస్థ రాజేంద్ర కుమార్‌ బినామీ అని, తన సన్నిహితుడైన అశోక్‌ కుమార్‌తో కలసి ఈ సంస్థను ఏర్పాటు చేసి ఒప్పందం కుదిర్చాడని ఆరోపణలు వచ్చాయి.మొదట్లో ఈ అవినీతి ఆరోపణల విలువ 9.5కోట్ల రూపాయలు అనుకున్నారు గాని అదిప్పుడు 50 కోట్లకు పెరిగిందంటున్నారు. 2013లో కేజ్రీవాల్‌ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాజేంద్ర కుమార్‌పై కొన్ని ఆరోపణలు వున్నాయి. ఇక రెండవ సారి పదవి చేపట్టిన తర్వాత 2015మేలో అశిష్‌ జోషి అనే అఖిలభారత పోస్టల్‌సర్వీస్‌ అధికారి ఆయనపై అవినీతి ఆరోపణలు దాఖలు చేశారు. వాటి ఆధారంగా డిసెంబర్‌లో సిబిఐ ఢిల్లీ ప్రభుత్వ సచివాలయంపై దాడి చేసి కొన్ని ఫైళ్లు తీసుకెళ్లింది.తనకు తెలియకుండా తన ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేయడం ఎమర్జన్సీని తలపిస్తున్నదని అప్పట్లో కేజ్రీవాల్‌ ఆరోపించారు. సిబిఐ పట్టుకెళ్లిన పత్రాలుఇప్పించాలని కేసు వేశారు.కిందికోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా హైకోర్టు మాత్రం సిబిఐనే సమర్థించింది.ఆ పత్రాలు అట్టిపెట్టుకోవడానికి అనుమతినిచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ దర్యాప్తు మరింత ముందుకు నడిచి రాజేంకుమార్‌ను  అరెస్టు చేశారు. బహుశా ఈ పర్యాయం కేజ్రీవాల్‌ గతంలో వలె రాజకీయయుద్ధం చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే అవినీతి వ్యతిరేకత ప్రధాననినాదంగా అధికారంలోకి వచ్చిన వారు ఆరోపణలున్న వ్యక్తిని ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. గతంలో సచివాలయంపై దాడిని ఖండించిన వారు కూడా ముఖ్యమంత్రిని ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదని అన్నారే తప్పరాజేంద్ర కుమా ర్‌ను లేదా తన నియామకాన్ని సమర్థించలేదు. ఇప్పుడు పంజాబ్‌లో బిజెపి అకాలీ కూటమికి ఒక ప్రత్యర్థిగా వున్న ఆమాద్మీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఈ అరెస్టు ఉపయోగపడితే ఆశ్యర్యం లేదు. కేజ్రీవాల్‌ కూడా బిజెపిపై విమర్శలు చేయడంతో పాటు తన కార్యదర్శికి సంబంధించిన సవాళ్లకు జవాబు చెప్పవలసిన పరిస్తితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా రకరకాల వివాదాల్లో చిక్కుకున్నారు. అనుభవ రాహిత్యంతో పాటు ఏకపక్ష దోరణులు కూడా ఆప్‌ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *