ఆరెస్సెస్‌ రాజ్యంగా హర్యానా

04e2f9409a86ca6b81a2cb7d23919fc6
ఒకప్పటి గుజరాత్‌ అడుగుజాడల్లోనేర్యానా హ నడవడం చూస్తుంటే అదిఆరెస్సెస్‌ తాజా ప్రయోగశాలగా మారుతున్నట్టు అర్థమవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో హర్యానాప్రజలు బిజెపికి స్వల్ప మెజార్టితో గద్దెక్కించారు.మనోహర్‌ ఖట్టర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వరుస వివాదాలు కుదిపేస్తున్నాయి. ఇటీవలనే జాట్ల ఆందోళన అట్టుడికించింది. ఆ పరిణామాలను పరిశీలించేందుకు మాజీ డిజిపి విన్‌రారు అద్యక్షతన ఏర్పాటైన పీపుల్స్‌ ట్రిబ్యునల్‌ హర్యానా పూర్తిగా ఆరెస్సెస్‌ కనుసన్నల్లో నడుస్తున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25మందిని ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాల్లో నియమించారు.వీరిని సుహాసన్‌ సుహాగ్‌ అంటారు. వీరు నేరుగా ముఖ్యమంత్రితో సంబంధం కలిగివుంటారు. ఈ కారణంగా ద్వంద్వ పాలన ఏర్పడి అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ట్రిబ్యునల్‌ నివేదించింది. కొంతకాలం కిందట దళితులను కాల్చిచంపితే కూడా స్పందన లేకపోయింది.ప్రతికుక్క చావుకూ విచారించాలా అని ఒక కేంద్ర మంత్రి నోరు పారేసుకున్నారు. ఇక విద్యామంత్రి రామ్‌ విలాస్‌ నాథ్‌ అయితే పాఠ్యాంశాల కాషాయీకరణ జరగాలని పిలుపునిచ్చారు.ఉపాధ్యాయులకు డ్రెస్‌కోడ్‌పెట్టారు. వారంతా పోలీసుల్లా సెల్యూట్‌ చేయాలని ఆదేశించారు. ఇదేగాక ప్రైవేటు విద్యా సంస్థలకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. గోవధ సమస్యపై రభస చేసి ఫిరోజాబాద్‌ జిల్లాలో ఇద్దరితో గోమూత్రం తాగించారు.తాజాగా ఆవుల రక్షణకు 24/7 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులు ఆహ్వానిస్తున్నారు. రాజకీయ అవినీతి విషయానికి వస్తే ప్రతిపక్షాలకు బలం వున్నా రాజ్యసభకు వారి అభ్యర్థి ఆర్‌కె ఆనంద్‌ను ఓడించి మీడియా బేహారి సుభాష్‌ చంద్ర ను పంపేందుకు కుట్ర పద్ధతులు అనుసరించారు. ఓటింగ్‌మధ్యలో ఇంకు పెన్ను మార్చి ఇంకు మారిందనే కారణంతోనే 12 ఓట్లు రద్దుచేయించారు.ఇవన్నీ చూస్తుంటే ఒకప్పటి గుజరాత్‌ తరహాలోనే హర్యానా మారిపోతున్నట్టుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *