మహా ‘ నటన’లో మామూలు మనుషులు!

సాహిత్యం చిత్ర కళ, సంగీతం వంటివాటిని అర్థం చేసుకోవాలంటే కొంత అవగాహన అభిరుచి వుండాలి. తర తమ తేడాల్లేకుండా మనుషులందరూ సమానంగా ఆస్వాదించ గలిగే కళ నటన ఒక్కటే. ఎలాటి పాత్రలు నటన ఇషyం అన్నదానిలో ఎవరి అభిరుచి వారికి వుండొచ్చు గాని సాటి మనిషి అభినయిస్తుంటే చూసి తాదాత్మ్యం చెందడంలో మాత్రం ఎలాటి తేడాలు వుండవు. అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ సమర్థులైన నటీనటులు ప్రసిద్ధులు కావడానికి ప్రజాభిమానం పొందడానికి కారణం అదే. తెలుగులో నాటి ఎనీyఆర్ ఏఎన్నార్‌లతో మొదలు పెటిy నేటి మహేష్‌బాబు రామ్ చరణ్ తేజల వరకూ ఈ మాట వర్తిస్తుంది.
నటీనటులను వారి వారి పాత్రలను బటిy ప్రేక్షకులు అభిమానిస్తారు. మాస్ క్లాస్ అంటుంటారు గాని వాస్తవంలో అలాటి తేడాలు లేకుండా కూడా ఆదరణ పొందడం కనిపిస్తుంటుంది. దేవదాసుగా ఎనీyఆర్‌ను, కృష్ణుడుగా రామారావును, జేమ్స్‌బాండ్‌గా కృష్ణను, కుటుంబ సంబంధమైన పాత్రలో శోభ’న్ బాబును ఇలా జనం రకరకాలుగా అభిమానిస్తారు. హీరోలు కాక పోయినా ఎస్వీరంగారావు వంటివారి నటనకు కదలిపోతారు. మోహన్ బాబు డైలాగులు, చిరంజీవి డాన్సులు ఫైట్లు, కమల్ హాసన్ వైవిధ్యం, బాలకృష్ణ హడావుడి, నాగార్జున నవ్యత,వెంకటేష్ సెంటిమెంటు ఇలా ఏవో బలమైన ముద్రలు పడిపోతాయి. నటీమణుల్లోనూ భానుమతి గడుసుతనం, సావిత్రి సాత్వికత,జమున కలికితనం, వాణిశ్రీ వైవిధ్యం,శారద వి’ాదం, సుహాసిని సున్నితత్వం, సౌందర్య సౌజన్యం ఇలా నేటి ఇలియానా జెనీలియాల వరకూ ఏవో ప్రత్యేకాదరణలు వుంటాయి. ఆ నటీనటుల కోసమే వెళ్లేవారు కోకొల్లలు.
ఇంతటి ఆరాధనకు ఆదరణకు నోచుకుని అనేకానేక రకాల పాత్రలు అవలీలగా అవధరించే నటీనటులు కూడా మామూలు మనుషులే.అందుకే వారు పాత్రోచితమైన నటన కనపర్చినా లేక పాత్రలో జీవించినా వారి మామూలు తత్వాలు అలవాట్లు ఉచ్చారణ వగైరాలు అన్ని పాత్రల్లోనూ తొంగి చూస్తుంటాయి. వీటినే మ్యానరిజమ్స్ అంటుంటారు. మిమిక్రీ కళాకారులు వీటినే పటుyకుని అనుకరణ కళతో అలరిస్తుంటారు.అక్కినేని వేలు పైకి పెటిy నటించడం, ఎనీyఆర్ ఆవేశం, కృష్ణ వంగి వుండటం వంటివి సాధారణంగా చూపిస్తుంటారు.
అయితే విమర్శనాత్మకంగా పరిశీలిస్తే ఆయా నటీనటులు వేసే ప్రతి పాత్రలోనూ ప్రతి సందర్భంలోనూ అదే విధమైన అభినయం సంభాషణా రీతి వున్నాయని మనం చూడగలుగుతాము. కోపాన్ని లేదా వి’ాదాన్ని ఒక నటుడు చూపించే తీరు ఒక రకంగా వుంటుంది. ఇది ఎప్పుడూ మార్పు లేకుండా వుంటుంది. సన్నివేశం మారుతున్నప్పుడే వారి శైలి ఎలా వుంటుందో మనం పసిగటyచ్చు. అక్కినేని దేవదాసును ప్రేమనగర్‌ను ప్రేమాభిషేకం వీటి మధ్య దశాబ్దాల వ్యత్యాసం వుంటుంది. మూడింటి నేపథ్యం వేరు. కాని పాత్రలో ఆయన ప్రవేశించే ప్రతిస్పందించే తీరు అన్ని తుచ తప్పకుండా ఒకే విధంగా అనిపిస్తాయి. ఎనీyఆర్ కూడా అంతే. ఆయన ఎలా ప్రవేశిస్తాడో ఎలా నిష్క్రమిస్తాడో ఎలా మాట్లాడతాడో సగటు ప్రేక్షకుడు కూడా ముందే చెప్పేయగలడు. అచ్చంగా అదే తెరపై కనిపించేది. ఈ ఇద్దరు పెద్ద హీరోలు ధనవంతులుగా వేసినా రిక్షా వారుగా వేసినా అంగికాభినయంలోనూ సంభాషణల్లోనూ మాత్రం అవే లక్షణాలు తొణకిసలాడుతుంటాయి. పౌరాణిక పాత్రల్లో ఆహార్యం ప్రభావం పక్కనపెడితే సంభాషణల్లో ఒక ఫక్కీ వుంటుంది.ఎనీyఆర్ పౌరాణికాల్లో విభిన్న పాత్రలు ధరించాడనుకున్నా అందులోనూ ఒక తరహా తప్పనిసరి. విశేషమేమంటే ఒక సినిమాలో రావణాసురుడికి మరో సినిమాలో దుర్యోధనుడికి ఆయన అదే నటనా శైలి కనపర్చడం. దానవీరశూర కర్ణ చిత్రంలో దుర్యోధనుడి సంభాషణా శైలిని మార్చారు. కాని విరాటపర్వంలో అదే శైలిని కీచక పాత్రకు ఉపయోగించుకున్నారు. ఎనీyఆర్ కవి పాత్రలు వేయడం చాలా అరుదు. కాని ఆయన వేసిన శ్రీనాథ కవి సార్వభౌముని పాత్రను చాలా ఏళ్ల కిందట అక్కినేని వేసిన కాళిదాసు పాత్రను పోల్చి చూస్తే తేడా తెలిసిపోతుంది.
సావిత్రి మహానటి అయినా ఆమె నటనలో ఒకటి రెండు హావభావాలు ప్రధానంగా ప్రత్యక్షమవుతుంటాయి. వాటినే తర్వాత వాణిశ్రీ స్వంతం చేసుకోగలిగారు. శారద విషయానికి వస్తే వి’ాదానికి సంబంధించి ఒక శైలి పెంపొందించుకోవడంతో పాటు ఏక కాలంలో వి’ాదంగా నవ్వడం అనే ఒక శైలిని తీసుకొచ్చారు.తర్వాత కాలంలో గంభీర పాత్రలు ధరించే తారలందరికీ అదే వరవడి అయింది. వాస్తవంగా వారి నటనా శక్తికి అదో కొలబద్దగా మారింది.సుహాసిని సౌందర్యల నటనల్లో ఇది మనం మరింత తేలిగ్గా చూడగలుగుతాము.
క్యారెకyర్ నటుల్లో ఎస్వీఆర్ ఇందుకు బాగా అన్వయిస్తారు. ఆయన వి’ాదానికి సంబంధించిన ముఖ ముద్ర ఒకటి, వినోదానికి ఒకటి ప్రతి సినిమాలోనూ తప్పక కనిపిస్తాయి. ఒక్క ముద్రతోనే లక్షలు సంపాదించాడని అంటుంటారు విమర్శకులు. గుమ్మడి చేయి నలుపకోవడం కూడా అలాటిదే ఇటీవలి కాలంలో ప్రకాశ్ రాజ్‌ను తీసుకుంటే ముక్కు నలుపుకోవడం, తేలిగ్గా చూడటం, కోపాన్ని అణచుకోవడం వంటి కోణాలు ప్రతి చిత్రంలోనూ తప్పక కనిపిస్తాయి. హాస్య నటులనే తీసుకుంటే రేలంగి రాజబాబుల నుంచి నేటి బ్రహ్మానందం వేణు మాధవ్‌ల వరకూ ఒక ఫక్కీలో తయారవడం మనం చూస్తాం.రాజబాబు కంగారు కంగారుగా నటిస్తే బ్రహ్మానందం అయోమయాన్ని ఎదుటివారిపై దాడి చేయడాన్ని బాగా అభినయిస్తుంటారు.
ఇప్పుడు వారి వారి వారసులు రంగంలోకి వచ్చారు గనక జాగ్రత్తగా గమనిస్తే వారిలోనూ అవే ప్రక్రియలు తొంగిచూడటం గమనిస్తాము.మ్యానరిజమ్స్‌గా చెప్పుకునే ఈ ప్రత్యేకతలు నిజానికి ఆ నటులలోని అసలైన మనుషులను పటిyచ్చే సందర్బాలు. మహా నటనలోని మానవ పార్వ్యాన్ని మనం పటుyకోగలిగితే అప్పుడు నిత్య జీవితంలోనూ అభినయించే వారిని అర్తం చేసుకోవడం తేలికవుతుంది. ఎందుకంటే నటన జీవితం రెంటికీ ఎప్పుడూ చాలా సంబంధం వుంటుంది.కొంతమంది అన్నటుy నటులు పాత్రల్లో జీవించరు. జీవితమే పాత్రల్లో కనిపిస్తుంది.