అమరావతి: రైతులపై ఆంక్షలు, ఆ పైన రేట్ల తగ్గుదల
ఎపి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులపై ఆంక్షలు పెరగడం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులూ అధికారులూ ఒప్పించి నొప్పించి ఎలాగో
సమీకరణ ఘట్టం పూర్తి చేశారు. అక్కడ ఇంకా భూమి కావాలంటే సేకరణ నిబంధనల ప్రకారం వెళ్లవలసి వుంటుంది. దానికి రైతులకు అనేక అనుమతులూ అధికారిక పత్రాలు కావలసి వస్తున్నది. ఈ ఘట్టంలోనూ వారికి అండగా నిలవాల్సింది పోయి ా అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితిని ప్రభుత్వమే తెచ్చిపెడుతున్నది. అసలు భూములు విక్రయించుకోవడానికి వీల్లేకుండా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది.మామూలుగానే రాజధాని పరిధిలో భూమి రిజిస్ట్రేషను ఎక్కవ ఎవరికి అయినా, ఆ సమాచారం మొత్తం యంత్రాంగానికి మెసేజ్‌లా వెళ్తుంది. ఈ నిఘా చాలనట్టు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో సమస్యలు రాకుండా చూడటానికే ఈ నిషేదం అని పైకి చెబుతున్నారుగాని నిజానికి రైతులను అష్టదిగ్బంధనం చేయడమే దీని లక్ష్యమని అధికారవర్గాల సమాచారం. భూ సమీకరణప్రక్రియ నడిచినపుడు రైతుల కమిటీల పేరిట అధికార పార్టీకి అనుకూలులైన వారితోనే అయినా ఒక తతంగం నడిపింది. లాభదాయకమైన వాణిజ్య ప్టాట్ల కేటాయింపు వారందరి కల. కాని తీరా వారి ప్లాట్లు కేటాయించే సమయానికి ్తప్రభుత్వం ు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ప్రశ్నార్థకంగా మారింది. ే…
ఈ నేపథ్యంలో రాజధాని రైతులు ప్రతి అవసరాలనికి సిఆర్‌డిఎ కార్యాలయాల
కు వెళ్లి నిరభ్యంతరపత్రం (ఎన్‌ఓసి) తెచ్చుకోవలసిన అగత్యమేర్పడుతున్నది. వాటిని జారీ చేయడానికి అనేకానేక ఆంక్షలుంటాయి. భూమి ఇచ్చిన సమయంలోసిఆర్‌డిఎ ఇచ్చిన రశీదు, ఆడంగల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, సిఆర్‌డిఎకు ఇచ్చాక మళ్లీ ి విక్రయించలేదంటూ అఫడవిట్ సమర్పించాలట. తమ భూమిని ఇచ్చి తామే ఇన్ని విధాల ఆధారాలు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత రైతులపై పడటం ఒక విచిత్రం. కాగా అవన్నీ ఇచ్చినా అదనపు కమిషనర్ సంతృప్తి మేరకే ఎన్‌ఓసి జారీ చేయొచ్చు చేయకపోవచ్చు. ఏదో ఒక సాకుతో ప్లాట్లు కేటాయింపులు పూర్తయ్యే వరకూ ఎవరికీ ఎన్‌ఓసి కూడా ఇవ్వకూడదని సిఆర్‌డిఎ అధికారులకు అంతర్గత ఆదేశాలున్నట్టు కూడా చెబుతున్నారు. రాజధానికి భూమిఇచ్చిన రైతులకే ఇన్ని ఆంక్షల వలయంలో చిక్కుకుపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇది ఇలా వుంటే ప్రభుత్వం పదివేల ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతులకు కేటాయించడంతో భూముల రేట్లు అందుబాటులోకి వస్తాయని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. ryots, ఇప్పుడు అక్కడ చదరపు గజం లక్షన్నర వున్న పరిస్థితి పోయి యాభైవేలకు తగ్గుతుందని కొన్ని అంచనాలు వస్తున్నాయి.ఈ విధంగా చూసినా రైతుల చేతుల్లోకి భూమి వచ్చేసరికి ధరలు పడిపోతాయని అధికారికంగానే అంగీకరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. వారి దగ్గర వున్న భూమిని కట్టడి చేసి ధరలు నేలకు దించిన తర్వాత రైతులు లేదా మరెవరైనా లాభపడేదేముంటుంది? దీనిపై వచ్చే పెరుగుదల మీకే చెందాలన్నది నా ఉద్దేశం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలెలా నిజమవుతాయి?
